ఫిలిం క్విజ్

రాజన్న-- నాకు నచ్చిన సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జున కథానాయకుడిగా విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో రాజన్న చిత్రాన్ని సామాజిక ప్రయోజనంతో రూపొందించారు. తెలంగాణ సాయుధ పోరాటానికి ముందు రజాకార్లు చేసిన అకృత్యాలను కళ్లకు కట్టినట్టుగా తెరకెక్కించారు. నేలతల్లిపై ప్రేమను ఓ పాటలో అద్భుతమైన రీతిలో వ్యక్తం చేశారు. నాగార్జున, స్నేహ, బేబి యాని చిత్రంలో పోటీపడి నటించారు. సినిమాలో సెట్టింగ్స్ కాస్ట్యూమ్స్ అద్భుతంగా ఉంటాయి. యాక్షన్ ఎపిసోడ్స్ ఇప్పటి ఫైట్స్‌ను తలదనే్నలా చిత్రీకరించారు. కీరవాణి పాటలు సినిమాకు జీవం పోశాయి. ఓ మంచి చిత్రం చూసిన అనుభూతి కలుగుతుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణలో దొరల, దొరసానుల వద్ద బానిసలుగా బతుకిన గరీబోళ్లు స్వతంత్రం లేకుండా ఎలా మగ్గిపోయారో చిత్రంలో చూపించారు. పేద బతుకులను కాపాడడానికి కంకణం కట్టుకున్న తిరుగుబాటు గాయకుడిగా నాగార్జున నటన అద్భుతం. ఆయన డప్పుకొడుతూ ప్రజలను ఉత్తేజపరిచే సన్నివేశాలు, పతాక సన్నివేశాలు చాలా చక్కగా చిత్రీకరించారు. సామాజిక ప్రయోజనంతో రూపొందిన ఈ చిత్రం నాకెంతో ఇష్టం.
-నీలం శివగంగాధర, వీరపునాయునిపల్లె