తెలంగాణ

మరో రెండు రోజుల పాటు వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల హైదరాబాద్ నగరంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు గత కొన్ని రోజులుగా ముంచెత్తుతున్నాయి. తెలంగాణలో సైతం గురు, శుక్రవారాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నగరంలో గత రెండు రోజుల నుంచి పిడుగులతో కూడిన వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఉప్పల్‌లో 6.0సెం.మీలు, అల్కాపురి, నాగోల్‌ల్లో 4.6 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది. బుధవారం ఉదయం 8.30గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు అత్యధికంగా ఖైరతాబాద్‌లో 4.1సెం.మీలు, ఉప్పల్‌లో 3.9సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది. మరో మూడు రోజులూ గ్రేటర్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.