జాతీయ వార్తలు

పలు రాష్ట్రాలకు వర్ష సూచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: నేడు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. దాదాపు 17 రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, విదర్భ, చత్తీస్‌ఘడ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో మంగళవారం కుంభవృష్టి కురుస్తుందని తెలిపారు. అసోం, మేఘాలయ, మహారాష్ట్ర, గోవా, ఆంధ్రప్రదేశ్, యానాం, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆల్ ఇండియా వార్నింగ్ బులిటన్ లో అధికారులు పేర్కొన్నారు. బీహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతోపాటు పిడుగులు పడే అవకాశముంది. అరేబియా సముద్రంలో గంటకు 75 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు.