జాతీయ వార్తలు

బంగళాఖాతంలో అల్పపీడనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: బంగళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని ఆర్డీజీఎస్ తెలిపింది. దీంతో ఏపీలో ఈనెల 23 నుంచి 26వ తేదీ వరకు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరం శాఖ అధికారులు తెలిపారు. అరేబియా సముద్రంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని దీంతో గుజరాత్, మహారాష్టల్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మహారాష్టల్రో కురిసే వర్షాల వల్ల కృష్ణ, గోదావరి నదులకు మళ్లీ వరద వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముంబయిలోనూ వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. దీంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ముంబయిలో స్కూళ్లకు సెలవు ప్రకటించారు.