జాతీయ వార్తలు

ఏడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ:నేడు ఏడు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. కోస్తా ఆంధ్రాతోపాటు తెలంగాణ, విదర్భ, గోవా, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, అండమాన్ నికోబార్ దీవుల్లో బుధవారం భారీవర్షాలు కురవవచ్చని వాతావరణశాఖ అధికారులు బుధవారం ఉదయం విడుదల చేసిన బులిటిన్ లో పేర్కొన్నారు. ఒడిశా, అండమాన్ నికోబార్ దీవుల్లోని సముద్ర తీర ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. రాగల వారం రోజుల పాటు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణశాఖ అధికారులు కోరారు.