జాతీయ వార్తలు

ఉత్తర భారతంలో కుండపోత వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఉత్తర భారతంలో భారీ వర్షాలు ఆపార అస్తి, ప్రాణ నష్టాన్ని కలిగిస్తున్నాయి. పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా తదితర రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌లోని సట్లేజ్ నది వరద వల్ల ఓ వంతెన కుప్పకూలింది. ఉత్తరాఖండ్‌లో వర్షాలకు 17మంది చనిపోగా.. హిమాచల్‌ప్రదేశ్‌లో సైతం 18మంది మృత్యువాతపడ్డారు. వరదలో చిక్కుకుపోయిన ఆరుగుర్ని రిస్క్యూ టీమ్ రక్షించింది. సిమ్లాలో కొండచరియలు విరిగిపడి ఎనిమిది మంది చనిపోయారు. కులూ, శ్రీమర్, సొలన్, చంబా జిల్లాల్లో ఇద్దరు చొప్పున చనిపోయారు. కుండపోత వర్షాలతో కులు, సిమ్లా జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. హర్యానాలోని హత్నికుంద్ బ్యారెజ్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరింది. యమునా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. యమున ప్రమాదకర హెచ్చరిక 204 మీటర్లు కాగా ఇపుడు 204.70 వరకు యమున ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నీటిని దిగువకు వదిలి వేస్తున్నారు. పంజాబ్‌లో నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో ఇళ్లు, చెట్లు నేలకూలాయి.