తెలంగాణ

హైదరాబాద్‌లో భారీవర్షం.. జనం అవస్థలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారు జామున భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు వీచడంతో చాలాచోట్ల చెట్లు విరిగిపడి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. డ్రైనేజీలు పొంగి రోడ్లపై ప్రవహిస్తున్నాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. చాలారోడ్లపై నిలిచిన వర్షపునీటిలో వాహనాలు కూరుకుపోయాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు జిహెచ్‌ఎంసి కమిషనర్, ఇతర అధికారులు, కార్పొరేటర్లు వార్డుల్లో పర్యటిస్తూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కూలిపోయిన చెట్లను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించేందుకు చర్యలు ప్రారంభించారు. సహాయక చర్యలు అవసరమైనవారి కోసం జిహెచ్‌ఎంసి ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది.