బిజినెస్

మరో రెండు రైల్వే జంక్షన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ సిఎంతో రైల్వే జిఎం సమావేశం

హైదరాబాద్, డిసెంబర్ 4: సికిందరాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లపై ఒత్తిడి విపరీతంగా పెరిగిందని, దీనిని నివారించేందుకు శివార్లలో మరో రెండు రైల్వే జంక్షన్లు అభివృద్ధి చేయాలని, దీనికి ప్రభుత్వం సహకరిస్తుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దక్షిణ మధ్య రైల్వేకు తెలిపారు. ముఖ్యమంత్రిని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తా సచివాలయంలో శుక్రవారం కలిశారు. ఔటర్ రింగురోడ్డుకు దగ్గరగా ఉన్న చర్లపల్లి, నాగులపల్లి ప్రాంతాల్లో రైల్వే జంక్షన్లను అభివృద్ధి చేయాలని అవసరం అయిన సహాయ సహకారాలను ప్రభుత్వం ఇస్తుందని ముఖ్యమంత్రి గుప్తాకు చెప్పారు.
రైల్వే శాఖ-రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఉన్న అంతర్గత విషయాలపై చర్చించారు. ఢిల్లీ, చెన్నై తదితర రూట్లకు చర్లపల్లి, ముంబయి రూట్‌కు నాగులపల్లి రైల్వే జంక్షన్ అనుకూలంగా ఉంటాయని, ఔటర్ రింగురోడ్డుకు సమీపంలో ఉండడం వల్ల ప్రయోజన కరంగా ఉంటుందని చెప్పారు. దీనికి రైల్వే జనరల్ మేనేజర్ సానుకూలంగా స్పందించారు. రైల్వే శాఖకు ఈ ప్రతిపాదనలు పంపించనున్నట్టు చెప్పారు. కాగా, చర్లపల్లిలో ఇప్పటికే రైల్వే శాఖకు కొంత భూమి ఉందని, దానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మరికొంత భూమి కేటాయించాలని జిఎం కోరారు.
దీనికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. మరోవైపు సికిందరాబాద్ నియోజక వర్గ పరిధిలో పేదల గృహ నిర్మాణానికి, ప్రభుత్వ విద్యా సంస్థల స్థాపనకు, ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుక స్థలం లేదని, రైల్వే శాఖకు ఉన్న భూమిలో 15 ఎకరాలు ప్రభుత్వానికి కేటాయించాలని ముఖ్యమంత్రి కోరారు. దీనికి బదులుగా మరో చోట రైల్వే శాఖకు భూమి కేటాయిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. దీనికి జిఎం సానుకూలంగా స్పందించారు. తెలంగాణ వ్యాప్తంగా 150 ప్రాంతాల్లో కాపలాదారులు కానీ, గేట్లు కానీ లేని లెవల్ క్రాసింగ్‌లు ఉన్నాయని, వాటి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. గత ఏడాది మాసాయిపేట దుర్ఘటనలో పిల్లలు మరణించడం ఇప్పటికీ బాధ కలిగిస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా వెంటనే గేట్లను ఏర్పాటు చేయాలని కోరారు.
రైల్వే శాఖ దీనిని తొలి ప్రాధాన్యత అంశంగా గుర్తించి దశలవారిగా గేట్లు ఏర్పాటు చేస్తుందని జిఎం హామీ ఇచ్చారు. తుకారాం గేటు వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి పనులను త్వరగా చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు.