జాతీయ వార్తలు

రాహుల్ వ్యాఖ్యలపై ఈసీ నోటీసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రాహుల్ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈసీ నోటీసులు జారీ చేసింది. జార్ఖండ్ ఎన్నికల అధికారికి నివేదిక పంపాల్సిందిగా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఇదిలావుండగా ప్రధాని మోదీ మేక్ ఇన్ ఇండియా రేప్ ఇన్ ఇండియాగా మారిందని రాహుల్ గాంధీ రెండు రోజుల క్రితం జార్ఖండ్ ఎన్నికల ప్రచార సభలో చేసిన వ్యాఖ్యలు పార్లమెంటును స్తంభింపజేయటం తెలిసిందే. రేప్ ఇన్ ఇండియా అంటూ విమర్శలు కురిపించిన రాహుల్ దేశంలోని మహిళలందరికీ క్షమాపణలు చెప్పాలని బీజేపీ ఎంపీలు ముఖ్యంగా మహిళా పార్లమెంట్ సభ్యులు డిమాండ్ చేశారు. అయితే రాహుల్ గాంధీ మాత్రం క్షమాపణలు చెప్పేందుకు ససేమిరా అన్నారు. తాను చెప్పింది అక్షరాలా నిజం, నిజం మాట్లాడినందుకు క్షమాపణలు చెప్పటం ఏమిటని, క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని రాహుల్ గాంధీ పలుమార్లు స్పష్టం చేశారు. నిజం మాట్లాడినందుకు తానెప్పుడు క్షమాపణలు చెప్పలేదు, ఇక మీదట కూడా చెప్పబోనని ఆయన పునరుద్ఘాటించారు. దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసినందుకు ప్రదాని నరేంద్ర మోదీ, ఆయన సహాయకుడు అమిత్ షా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.