రాష్ట్రీయం

‘అమరావతి’ నిర్మాణ స్థలం మార్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లేకపోతే భవిష్యత్తులో చెన్నై తరహా ముప్పు: ఏపిసిసి చీఫ్ రఘువీరారెడ్డి
మడకశిర, డిసెంబర్ 6: నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ స్థలం ఏ మాత్రం అనువుగా లేదని, అక్కడే నిర్మాణం జరిగితే భవిష్యత్తులో చెన్నై తరహా ముప్పు తప్పదని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపిసిసి) అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి హెచ్చరించారు. రఘువీరా ఆదివారం అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజకీయ పార్టీలతో కానీ, మేథావుల సలహాలు, సూచనలు కానీ ఏ మాత్రం తీసుకోకుండా ఇష్టారాజ్యంగా విదేశీయుల సలహాలు పాటిస్తున్నారని విమర్శించారు. రాజధాని నిర్మాణం చేపడుతున్న స్థలం మొత్తం వ్యవసాయ భూమి అని, భవిష్యత్తులో ఆ భూమి కుంగిపోవడం, భూ కంపాలు వచ్చే అవకాశం లేకపోలేదన్నారు. దీంతో చెన్నై తరహా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు.
రాజధాని నిర్మాణానికి శివరామకృష్ణ ఇచ్చిన నివేదికను వెంటనే బహిరంగ పరచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మేథావులైన అనేక మంది ఇంజినీర్లు ఉండగా నిర్మాణ పనుల కోసం విదేశీ ఇంజినీర్లను పిలిపించారని ఎద్దేవా చేశారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో అనేక రహదారులు నిర్మించామని, మరి కొన్నింటికి మరమ్మతులు చేయించామన్నారు. అయితే సిఎం చంద్రబాబు కాంగ్రెస్ పాలనలో రహదారులను నిర్లక్ష్యం చేశారని చెప్పడంలో వాస్తవం లేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి వస్తున్న నూతన రహదారులన్నీ రాష్ట్ర విభజన చట్టంలోనివే కానీ బిజెపి ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసినవి కావన్నారు.
అలాగే కేంద్ర మంత్రి గడ్కరీ ప్రకటించిన రహదారులు కూడా అందులోనివే అన్నారు. 20 నెలల టిడిపి పాలనలో అభివృద్ధిని పూర్తిగా విస్మరించారన్నారు. రాష్ట్రంలో టిడిపి బలహీనపడిందని, దీంతో పార్టీ పునర్మిర్మాణం కోసం జన చైతన్య యాత్రలు చేపట్టారని, వాటివల్ల ప్రజలకు ఏ మాత్రం ఉపయోగం లేదన్నారు. ఇకపోతే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం నేడు ఢిల్లీలో చేపట్టనున్న ధర్నాలో రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యులందరూ పాల్గొంటారన్నారు. అంగన్‌వాడీ ఉద్యోగులకు పెంచిన జీతాలను వెంటనే చెల్లించాలన్నారు. వీటిపై చర్యలు తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్, ఈశ్వరప్ప తదితరులు పాల్గొన్నారు.