జాతీయ వార్తలు

మానవ మృగాలపై దయ చూపాల్సిన అవసరం లేదు:రాష్టప్రతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దిశ హత్యోదోంతంపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతుండగా మరో వైపు ఈ కేసులో నిందితులు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన సందర్భంలో రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆయన రాజస్తాన్‌లోని సిరోహిలో బ్రహ్మకుమారీస్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ మహిళలపై అత్యాచారాలకు ఒడిగడుతూ వారిని హత్య చేస్తున్న మానవ మృగాలపై దయ చూపాల్సిన అవసరం లేదని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. అటువంటి మానవ మృగాలు క్షమాభిక్షకు కూడా అనర్హులని అన్నారు. కాగా రాష్టప్రతి చేసిన వ్యాఖ్యలను చూస్తే నిర్భయ నిందితులు పెట్టుకున్న క్షమాభిక్షను ఆయన తిరస్కరించే అవకాశాలు లేకపోలేదని సర్వత్రా భావిస్తున్నారు.