తెలంగాణ

విద్యార్థులతో కలిసి రాహుల్ దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు సంబంధించి నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేస్తున్న నిరాహారదీక్షలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం ఉదయం పాల్గొన్నారు. రోహిత్ జయంతి సందర్భంగా విద్యార్థులు 18 గంటల సామూహిక నిరాహారదీక్షను ప్రారంభించారు. రాహుల్ రాకను ఎబివిపి విద్యార్థులు వ్యతిరేకించడంతో హెచ్‌సియులో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సాయంత్రం వరకు రాహుల్ దీక్షను కొనసాగిస్తారు. ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు వర్సిటీ బయట దీక్షకు దిగారు. రాహుల్ శుక్రవారం అర్ధరాత్రి హెచ్‌సియుకి రావడం, శనివారం ఉదయం దీక్షలో పాల్గొనడం కేవలం రాజకీయ ప్రయోజనాలకేనని ఎబివిపికి చెందిన విద్యార్థులు ఆరోపిస్తున్నారు.