రాష్ట్రీయం

శ్రీకృష్ణావతారంలో భద్రాద్రి రామయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, డిసెంబర్ 19: అధ్యయనోత్సవాల్లో భాగంగా ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో రామయ్య శనివారం భక్తులకు శ్రీకృష్ణావతారంలో దర్శనమిచ్చారు. స్వామికి గర్భగుడిలో తీర్థబిందెను తెచ్చి సుప్రభాత సేవ చేశారు. అనంతరం శ్రీకృష్ణావతారంలో స్వామిని అలంకరించి ఆరాధన చేశారు. వెన్నను నైవేద్యంగా పెట్టారు. అనంతరం బేలమండపానికి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశాక ఊంజల్ సేవ నిర్వహించారు. పూలతో అలంకరించిన ఊయలలో స్వామిని ఉంచి లాలలు జోలలు పాడారు. తర్వాత మిథిలా స్టేడియం వద్ద వేదికపై స్వామి పూజలందుకుని తిరుమాడ వీధుల్లో విహరించారు. గోవిందరాజస్వామి ఆలయంలో పూజలందుకున్నారు. ఆదివారం సాయంత్రం పవిత్ర గోదావరి నదిలో భద్రాచల రామయ్య తెప్పోత్సవం నిర్వహించనున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 1200 మందికి పైగా పోలీసులు తెప్పోత్సవం విధులకు హాజరయ్యారు. 21న ఉదయం ఉత్తర ద్వారంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామి దర్శనం ఇవ్వనున్నారు. (చిత్రం) శ్రీకృష్ణావతారంలో తిరుమాడ వీధుల్లో విహరిస్తున్న భద్రాద్రి రామయ్య