మెయిన్ ఫీచర్

అపర భగీరథుడు.. అయ్యప్ప మసగి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నా జీవిత లక్ష్యం వేలాది మందిని నీటి సంరక్షణ యోధులుగా తీర్చిదిద్దటమే’’ అని అంటున్నారు అయ్యప్ప మసగి. భూమి మీద పడే ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకుంటే భావితరాల భవిష్యత్తుకు బంగారు బాట వేసినవారమవుతామని చెబుతూ.. నీళ్ల కోసం ఆయన చేస్తున్న ప్రయత్నం అపర భగీరధుడు గుర్తుకు వస్తాడు. పసితనంలో గుక్కెడు నీటి కోసం తాను పడిన కష్టాలే తనను ఈ నీటి సంరక్షణ వైపు అడుగులు వేయించిందని అంటున్న అయ్యప్ప మసిగి ఇప్పటివరకు 7వేల కోట్ల లీటర్ల నీటిని భద్రపరచి రికార్డులకు ఎక్కారు. బెంగళూరుకు 110 కిలోమీటర్ల దూరంలో ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా చిలుమత్తూరుపల్లె ఇపుడు పంటచేలతో పచ్చటి తోరణంగా కనిపిస్తోంది. ఒకప్పుడు అక్కడ బోరు వేస్తే చుక్క నీరు పడేది కాదు. కాని నేడు 25వేల నీటి గుంటలు, నాలుగు చెరువులు నీటితో నిండుగా కళకళలాడుతుంటాయి. పచ్చటి పంట పొలాలు, ఎత్తయిన చెట్లు ఇందులో 40 శాతం పండ్ల తోటలే కనిపిస్తుంటాయి. రాబోయో కాలంలో ఇక్కడ ఓ డెయిరీని నెలకొల్పుతానని అయ్యప్ప మసగి వెల్లడిస్తున్నారు. అపర భగీరథ అవతారమెత్తిన అయ్యప్ప మసగి గురించి చెప్పాలంటే ఎల్ అండ్ టిలో ఇంజనీర్ ఉద్యోగం చేస్తుండేవారు. వర్షాకాలంలో వృధాగా పోతున్న వర్షపు నీటిని చూసిన ఆయన ఆ నీటిని సంరక్షించే పని ఓ ఉద్యమంలా చేపడితే దేశంలో నీటి కష్టాలు ఉండవని నమ్మి చేస్తున్న ఉద్యోగాన్ని 2002లో వదిలేశారు. చిన్నతనంలో నీటి కోసం పడిన కష్టాలే తనను ఈ సాహసానికి పురిగొల్పాయని చెబుతారు. అనంతపురం జిల్లా చిలుమత్తూరుపల్లెలో 87 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అక్కడ 25,000 వేల నీటి కుంటలు, నాలుగు చెరువులు తవ్వించాడు. బోర్‌వెల్స్ ద్వారా నీటి కళ రప్పించారు. ఇలా సొంత పొలంలో ఆయన చేసిన ప్రయోగాలు నేడు ఆ జిల్లాలోని ప్రజలే కాదు దేశ విదేశాల ప్రజలు మెచ్చి ఆయన అందించే విలువైన సూచనలు పాటిస్తూ నీటి సంరక్షణ చర్యలు తీసుకుంటూ పంటలు పండించుకుంటున్నారు.
‘‘మీకు నీరు కావాలంటే నన్ను పిలవండి’’ అంటూ ఎవ్వరూ పిలిచినా విసుగు విరామం లేకుండా నీటి సంరక్షణ కోసం ఎలాంటి పనులు చేయాలో విడమర్చి చెబుతారు. ఇందుకోసం ‘వాటర్ లిటరసీ ఫౌండేషన్’ అనే ఎన్జీఓ సంస్థను స్థాపించారు. వేల ఎకరాల భూమిని సారవంతం చేస్తున్నారు. ఎండిపోయిన కొన్నివేల బోరు బావులకు మళ్లీ జల కళ తీసుకొచ్చారు. ఐదు వందలకు పైగా చెరువులను సృష్టించారు.
దేశవ్యాప్తంగా పర్యిటిస్తూ వేలాది గ్రామాల్లో నీటి సంరక్షణపై అవగాహన తరగతులు నిర్వహిస్తూ రైతులను, ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. నీటి సంరక్షణపై ఇప్పటికే ఏడు పుస్తకాలు రాశారు. అమెరికా, జర్మనీ, జపాన్ తదితరు దేశాలు సైతం అయ్యప్పను ఆహ్వానించి తమ దేశాలలో నీటి సంరక్షణ కోసం చేపట్టాల్సిన చర్యల గురించి సలహాలు తీసుకుంటున్నాయి. మాటలతో కాకుం డా చేతలతోనే ఎలాంటి అద్భుతాలనైనా సృష్టించగలమని నమ్మే అయ్యప్ప మసగి తన సేవలను ప్రస్తుత ప్రభుత్వాలు వినియోగించుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 783 మిలియన్ల ప్రజలు పరిశుభ్రమైన నీటి కోసం తంటాలు పడుతున్నారని, మనదేశంలో వర్షపు నీటిని 30శాతం నిల్వచేసుకున్నా సంవత్సరం పాటు వర్షాలు పడకపోయినా బతకవచ్చని చెబుతున్నారు. అందుకే ‘రెయిన్ వాటర్ కానె్సప్ట్’ పేరుతో మరో సంస్థను
స్థాపించి అపార్ట్‌మెంట్లు, కార్పోరేట్ సంస్థలు, పరిశ్రమలు, గృహ సముదాయాల్లో వృథాగా పోతున్న నీటిని సంరక్షించే ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు.