రాజ్‌తరుణ్... మెగా ఛాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పటికే హ్యాట్రిక్ హిట్‌తో దూసుకుపోతున్న యువ హీరో రాజ్‌తరుణ్‌కు ఇటీవల వచ్చిన ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ చిత్రం జస్ట్ ఓకే అనిపించుకున్నప్పటికీ మనోడికి అవకాశాలు మాత్రం దూసుకువస్తున్నాయి. ఇప్పటికే మూడు సినిమాల్లో హీరోగా నటించేందుకు సిద్ధమైన రాజ్‌తరుణ్‌కి మరో క్రేజీ ప్రాజెక్టు దక్కింది. మెగా మేనల్లుడు సాయిధరమ్ హీరోగా నటించాల్సిన ‘శతమానంభవతి’ చిత్రం ఇప్పుడు రాజ్‌తరుణ్‌కి దక్కింది. ఈ సినిమాలో హీరోగా నటించేందుకు సాయిధరమ్‌కు కుదరకపోవడంతో ఈ ప్రాజెక్టులోకి రాజ్‌తరుణ్ ఎంటర్ అయ్యాడు. ఇప్పటికే సాయిధరమ్ దిల్‌రాజు బ్యానర్‌లో ‘సుప్రీం’ చిత్రంలో నటిస్తున్నాడు. దాంతోపాటు ‘లవర్’ అనే చిత్రం కూడా రెడీగా ఉంది. వేగేశ్న సతీష్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.