రాజశ్రీవారి దావతె షాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ రాజశ్రీ ప్రొడక్షన్స్ మొదటిసారిగా ఓ హైదరాబాదీ చిత్రాన్ని రిలీజ్ చేయటం విశేషం. ఈ సినిమాలో పాపులర్ అయిన నటుడు అద్నాన్ షాజిద్‌ఖాన్, మస్తాన్ అలీ, ఫిరోజ్‌ఖాన్ హీరోలుగా సయ్యద్ హుస్సేన్ దర్శకత్వంలో యాబా ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘దావతె షాదీ’. మాధవి, మనీషా, కావ్య హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సమీఉల్లా ఫయాజ్ నిర్మాత. సెన్సార్‌తో సహా అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా దర్శకుడు సయ్యద్ హుస్సేన్ మాట్లాడుతూ, ‘హైదరాబాదీ చిత్రాన్ని ప్రఖ్యాత రాజశ్రీ బ్యానెర్ విడుదల చేయటం ఆనందంగా ఉంది. ఇదొక ఉల్లాసభరితమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. హైదరాబాద్ సినిమా అయినా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా బాలీవుడ్ స్థాయిలో తెర కెక్కించాం. అశ్లీలతకు, డబుల్ మీనింగ్ డైలాగ్స్‌కు తావులేకుండా అందరూ చూసేలా రూపొందించిన ఈ చిత్రాన్ని మార్చి 4న విడుదల చేస్తున్నామన్నారు. నిర్మాత మాట్లాడుతూ, మంచి అవుట్‌పుట్‌తో క్వాలిటీకి రాజీ పడకుండా తెర కెక్కించిన ఈ చిత్రాన్ని తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకం ఉంది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం ఎం.జి.కె. ప్రవీణ్, ఎడిటింగ్ క్రాంతి, నిర్మాణం యాబా ప్రొడక్షన్స్, నిర్మాత: సమీ ఉల్లా ఫయాజ్, దర్శకత్వం: సయ్యద్ హుస్సేన్.