రాష్ట్రీయం

కోయగుట్ట వరకు గ్రావిటీపై నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం జిల్లాకు మరో 1600 ఇళ్లు
హైదరాబాద్, నవంబర్ 23: ఖమ్మం జిల్లాలోని సమీకృత ఇందిర, రాజీవ్‌సాగర్ (దుమ్ముగూడెం ప్రాజెక్టు) రీ-డిజైన్ ప్రతిపాదనకు ఆ జిల్లాకు చెందిన రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఆమోదం తెలిపారు. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సచివాలయంలో సోమవారం మంత్రి తుమ్మల ఖమ్మం జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. దుమ్ముగూడెం నుంచి కోయగుట్ట వరకు గ్రావిటీపై నీటిని సరఫరా చేసి, కోయగుట్ట నుంచి జగనాథపురం వరకు 129 కి.మీ పైప్ లైన్ వేయాలని అధికారులు ప్రతిపాదించారు. అలాగే జగనాథపురం నుంచి రోళ్లపాడు చెరువునకు గ్రావిటీ, ఎత్తిపోతల ద్వారా నీటిని అందించాలని ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాలో ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందని మంత్రి చెప్పారు. ఇలా ఉండగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకం కింద ఖమ్మం జిల్లాకు అదనంగా 1600 ఇళ్లను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు మంజూరు చేసినట్టు మంత్రి తెలిపారు.