జాతీయ వార్తలు

మిగిలిన బాధితులను పరామర్శిస్తా: ప్రియాంకగాంధీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో:ఆమె సోన్‌భద్ర జిల్లాలో జరిగిన ఓ భూవివాదం కేసు సంబంధించి పదిమందిని కాల్చిన ఘటనపై ఆందోళనకు సిద్ధమైన కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీని ఉత్తరప్రదేశ్‌లోని నారాయణపూర్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్న విషయం విదితమే. తదనంతరం చునార్ గెస్టెహౌస్‌కు తరలించారు. చునార్ గెస్టెహౌస్‌కు ఇద్దరు బాధిత కుటుంబాలు వచ్చాయ. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను నలుగురితో మాట్లాడతానని చెప్పానని, కాని అనుమతించలేదని అన్నారు. బాధితుల కోసం ఎక్కడకైనా వెళ్లేందుకు సిద్ధమని అన్నారు.బాధిత కుటుంబాలకు చెందిన ఇద్దరు బంధువులను మాత్రమే నన్ను కలిసేందుకు వచ్చారు. మరో 15 మంది నన్ను కలిసేందుకు వ‌స్తే అనుమతించట్లేదు. కనీసం, నేను కూడా వారిని కలిసేందుకు వెళ్తుంటే అడ్డుకుంటున్నారని ఆమె ఆరోపించారు. కాగా సోన్‌భద్ర జిల్లాలో 144 సెక్షన్ విధించారు. ఈ ఘటనపై కాంగ్రెస్ ప్రతినిధి బృందం గవర్నర్ కలిసింది. ప్రమోద్‌ తివారీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రతినిధుల బృందం గవర్నర్‌ రామ్‌ నాయక్‌ను కలిసింది. ఘటనపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను అభ్యర్థించింది. ప్రమోద్‌ తివారీ మాట్లాడుతూ.. ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం కనీసం బాధితుల కన్నీళ్లను ఎవరైనా తుడవడానికి వెళ్తే కూడా అనుమతించట్లేదని పేర్కొన్నారు.