ప్రార్థన

స్ర్తీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను, ఏలయనగా ఆమె జీవము గల ప్రతివానికిని తల్లి’ - ఆది 3:20
దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు. సాటియైన సహాయము వాని కొరకు చేయుదుననుకొనెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. ఆ తరువాత దేవుడైన యెహోవా ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్ర్తినిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తెచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను. నా యెముకలలో యెముక నా మాంసములో మాంసము. ఇది నరునిలో నుండి తీయబడెను గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. వారు ఏక శరీరులై యుందురు. - ఆది 2:21-24
అయితే ప్రభువు నందు స్ర్తికి వేరుగా పురుషుడు లేడు పురుషునికి వేరుగా స్ర్తి లేదు. స్ర్తి పురుషుని నుండి ఏలాగు కలిగెనో అలాగే పురుషుడు స్ర్తి మూలముగా కలిగెను. కానీ సమస్తమైనవి దేవుని మూలముగా కలిగి యున్నవి. కాబట్టి స్ర్తి పురుషులు ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉండాలి. వారు ఏక శరీరులుగా ఉండాలి. వివాహముతో హవ్వను సాటియైన సహాయంగా చేశాడు.
హెన్రీ మాథ్యూ, హవ్వను ఆదాము ప్రక్కటెముక నుండే ఎందుకు తీసి ఉండవచ్చు అని రాశాడు. ప్రక్కటెముక నుండి తీసింది ప్రక్కనే ఉండటానికి.(Women were created from the rib of a man to be beside him) తల నుండి తీయలేదు. తన మీద పెత్తనము చేయకుండా (not from his hand to top him) కాళ్ల నుండి తీయలేదు త్రొక్కబడుద్దని.(Nor from his feet tobe trampled by him).. కానీ, తన చేతి ప్రక్క నుండి తీశాడు కారణము ఆదాము కాపుదలలో భద్రంగా ఉండాలని. (But by under his arm tobe protected by him) హృదయానికి దగ్గర నుండి తీశాడు. ఎక్కువ ప్రేమను పొందుకోవాలని. (Near to his heart to be loved by him).
ఇంకొక సంగతి ఆదికాండము రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనములో ‘దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసిన వచనాన్ని ఆధారంగా డా.విలియన్ మోర్టన్ ‘ఈథర్’ను వాడి నొప్పి లేకుండా సర్జరీ చేశాడు. తరువాత డా.జేమ్స్ సింమ్సన్ క్లోరోఫామ్‌ను కనుగొని ‘అనస్తీషియా’ ద్వారా నొప్పి లేకుండా ఆపరేషన్ చేయుట 1800లో కనుగొన్నారు. సింమ్సన్‌ను వారు కనుగొన్న దానిలో ముఖ్యమైనది ఏవి అని అడిగినప్పుడు, ఆయన ఇచ్చిన సమాధానము క్లోరోఫామ్ కాదు గానీ, నేను పాపిని దేవుని కృప వల్ల రక్షణ దొరికింది అని చెప్పాడు.
సాటియైన సహాయముగా హవ్వను చేసిన విధానముతో, లోకానికి ‘అనస్తీషియా’ కనుగొనటానికి సాధ్యమైంది. కనుకనే అనేక మంది ఎక్కువ కాలం బతుక గలుగుతున్నారు.
ఆమె జీవము గల ప్రతివానికి తల్లి గనుక ఆమెను హవ్వ అని ఆదాము పిలిచాడు. ఈ సంగతిని ఇప్పుడు శాస్తజ్ఞ్రులు ఈ మధ్యనే కనుగొన్నారు. హఖ్ఘౄశ ఘూషళ అంతా ఒక తల్లి నుండే మొదలైందనీ, దీనిని బట్టి లోకములో మనుష్య జాతి విస్తరించటానికి, అభివృద్ధి చెందటానికి స్ర్తి పాత్ర ఎంత ముఖ్యమైనదో తెలుస్తుంది.
సాటియైన సహాయముగా ఉండుటకు, ఫలించి అభివృద్ధి చెందుటకు స్ర్తిని సృజించాడు. చెప్పాలంటే, స్ర్తిని మంటి నుండి చేయలేదు గానీ ఆదాము నుండి తీశాడు. కనుక ప్రత్యేకముగా సృష్టించబడినది. వినటానికి స్ర్తి ప్రత్యేకముగా ఆదాము ప్రక్కటెముక నుండి తీయబడి దేవుని హస్తాలతో రూపించబడినదను మాట బాగానే ఉన్నా, ఒక తల్లిగా తాను పడే కష్టము అంతా ఇంతా అని చెప్పలేము. గర్భము దాల్చినది మొదలు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో, నవమాసాలు మోయుట ఎంత కష్టమో, చివరకు ప్రసవం ఎంత కష్టమో మనకు తెలుసు. స్ర్తిలకు కాన్పు అనేది మరుజన్మలానే ఉంటుంది. ఇప్పుడు ఆధునిక వైద్య పద్ధతుల వల్ల కొంచెము సులువుగా వున్నా పూర్వం ఎంతోమంది కాన్పు సమయాల్లో ప్రాణాలు పోగొట్టుకున్నారు. కనుట ఒక ఎత్తు అయితే పెంచటం మరియొకటి. తిన్నా తినకపోయినా బిడ్డలను మాత్రము ఉన్నదానిలో, శ్రేష్ఠమైనవి ఇచ్చి, రాత్రనక పగలనక ఎండనక వాననక, ఎముకలను కొరికే చలిలో కూడా తల్లులు శ్రమిస్తూ ఎంతో జాగ్రత్తగా పిల్లలను పెంచుతారు. ఈ మధ్య జరిగిన భూకంపన ప్రమాదములో చిక్కుకున్న వారిని వెలికి తీస్తుంటే ఒక తల్లి ఒడిలో భద్రముగా ఉన్న పసిపిల్లను కనుగొన్నారు. తల్లి చనిపోయిందని వెళ్లిపోతున్న వారికి పసిపిల్ల ఏడుపు వినపడి, చూసినపుడు తల్లి ఒడిలో ఎంతో భద్రంగా ఉన్న బిడ్డను తీయటం జరిగింది. ఇదే తల్లి ప్రేమ అంటే. తన ప్రాణం పోసి బిడ్డలను బ్రతికిస్తుంది. బిడ్డలు తింటే తాను తిన్నట్టుగా తృప్తిపడుతుంది. కుటుంబం యొక్క క్షేమము కొరకు ప్రార్థిస్తుంది. అందుకే సొలోమోను రాజు వ్రాశాడు - భార్య దొరికిన వారికి మేలు దొరికెను. అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు అని. - సామెతలు 18:22.
గృహము విత్తము పితరులిచ్చే స్వాస్థ్యము అయితే సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క ధనము - సామెతలు 19:14.
యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము వంటిదని సొలోమోను సామెతల గ్రంథములో వ్రాశాడు.
గుణవతియైన భార్య దొరకుట అరుదు. అట్టిది ముత్యము కంటె అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక యుంచును. అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నియు మేలు చేయును గాని కీడేమియు చేయదు. ఆమె గొఱ్ఱె బొచ్చును అవిసెనారను వెదకును. తన చేతులారా వాటితో పని చేయును. వర్తకపు ఓడలు దూరము నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకొనును. ఆమె చీకటితోనే లేచి, తన యింటి వారికి భోజనము సిద్ధపరచును. తన పనికత్తెలకు బత్తెము ఏర్పరచును. ఆమె పొలమును చూచి దానిని కొనును తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్షతోట యొకటి నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బలపరచుకొని చేతులతో బలముగా పని చేయును. తన వ్యాపార లాభము అనుభవముచే తెలిసికొనును. రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు. ఆమె పంటెను చేతపట్టుకొనును. తన వ్రేళ్లతో కదురు పట్టుకొని వడకును. దీనులకు తన చెయ్యి చాపును. దరిద్రులకు తన చేతులు చాపును. తన యింటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరు రక్తవర్ణ వస్తమ్రులు ధరించినవారు. ఆమె పరుపులను సిద్ధపరచుకొనును. ఆమె బట్టలు సన్నని నారబట్టలు రక్తవర్ణపు వస్తమ్రులు. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూర్చుండును. గవిని యొద్ద పేరుగొనిన వాడై యుండును. ఆమె నారబట్టలు వేయించి అమ్మును. నడికట్లను వర్తకులకు అమ్మును. బలమును ఘనతయు ఆమెకు వస్తమ్రులు. ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును. జ్ఞానము కలిగి తన నోరు తెరచును. కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన యింటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. పని చేయకుండ ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. చాలామంది కుమార్తెలు పతివ్రతా ధర్మము ననుసరించి యున్నారు కానీ వారినందరినీ నీవు మించినదానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. అందము మోసకరము. సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు గలిగిన స్ర్తి కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలమియ్యదగును. గవునుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. - సామెతలు 31:10-31.
తనకు కలిగిన మంచి గుణము, మేలు చేసే మనసు, చేతులారా పనిచేసే స్వభావము, వేకువనే లేవటము, తన యింటి వారికి భోజనము సిద్ధపరచటము, కూడబెట్టుట, పెట్టుబడి పెట్టటం, వ్యాపారము చేయుటకు అనుభవము, దీనులకు దరిద్రులకు చెయ్యిచాపి సహాయపడుట, నారబట్టలు నేయించుట, వర్తకులతో వ్యాపారము చేయుట, నిర్భయముగా జీవించుట, బలమును ఘనతయు వస్తమ్రు వలె ధరించుకొనుట, జ్ఞానముతో మాట్లాడుట, కృపగల ఉపదేశమును బోధించుట, తన యింటివారి నడతలన్నియు కనిపెట్టుట అనే విషయాలన్నిటికి కారణము యెహోవా యందలి భయభక్తులు కలిగి యుండుటే. యెహోవా యందలి భయభక్తులు కలిగి యుండుటే తెలివికి మూలము. దేవుని యందలి భయముతో మొదలైన తెలివి పైన పేర్కొన్న సుగుణాలన్ని కలిగియుండుటకు దోహదపడును. దేవుని యందు భయం లేకపోతే అసలు తెలివి మొదలవ్వదని సొలోమోను మహాజ్ఞాని తెలియజేస్తున్నాడు. యోబు గ్రంథము 28వ అధ్యాయం, 28వ వచనములో యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. అంటే దుష్టత్వములో ఉంటే వివేకముండదు. కనుక చేయాలనుకున్నవన్ని చేయలేక పోవచ్చు. వివేకమున్న వారికి బలము ఘనతయు పై వస్తమ్రుగా ఉండునని సామెతలు 31:25 వచనములో ఉన్నది. బలముంటే ఎంత కష్టమైన పనియైన సంతోషముగా చేయవచ్చు. లేకపోతే నీరసముతో పనులు చేయలేక విసుగు, కోపం, ద్వేషం, పంతం ఇంకా ఏవేవో పెరిగి అనారోగ్యానికి గురౌతారు. అయితే బలము కలిగి ఉంటే 12వ వచనములో చెప్పినట్లు తాను బ్రతుకు దినములన్నియు పెనిమిటికి మేలు చేయును. బ్రతుకు దినములన్నియు మేలు చేస్తుంది కానీ కీడేమియు చేయదు. మంచి వ్యాపారస్థురాలుగా ఉంటుంది. వేకువనే లేచి సమస్తము సిద్ధపరుస్తుంది. జ్ఞానవంతురాలు. పొదుపు చేసిన డబ్బులతో పొలాలు ద్రాక్ష తోటలు కొనగలుగుతుంది. లాభమైన వ్యాపారము అనుభవముతో చేస్తుంది. అంతేకాదు 24వ వచనము ప్రకారము (హోల్‌సేల్) వ్యాపారులకు వ్యాపారిగా ఎదుగుతుంది. దీనులను దరిద్రులను ఆదుకోగలుగుతుంది. ఇంత వ్యాపారం చేస్తూ కూడా తన ఇంటి వారి నడతలు బాగుగా కనిపెట్టును. ఎంత జాగ్రత్త ఉందో చూడండి. అన్ని పనులు చేశాక సామాన్యంగా అలసిపోతారు. కానీ ఈమె మాత్రము ఎవరు ఏమి చేస్తున్నారు? ఎక్కడకు వెళ్లారు? కాలేజీకి వెళ్తున్నారా లేదా? చదువుతున్నారా లేదా అన్నీ కనిపెట్టును గనుక కుటుంబము జాగ్రత్తగా పనులు చేసుకుంటారు. ఒక్కొక్కసారి తల్లిదండ్రులు పనులలో ఉండి సరియైన సూపర్‌విజన్ లేకపోతే పిల్లలు చదివీ చదవక, ఇష్టమొచ్చినట్లు తిరిగి పనికిరాని వాళ్లుగా తయారౌతారు. అప్పుడు ఎంత బాధపడినా ఏడ్చినా పోయిన సమయం తిరిగిరాదు. వయస్సు తిరిగి రాదు. గనుక irreparable damage జరిగి కొంధరి జీవితాలు, కుటుంబాలు నష్టాలలో పడిపోతారు. బిజినెస్ కూడా అంతే. మన సూపర్‌విజన్ ఉండాలి. ఎంత నమ్మకస్తులైనా మనము లేని సమయాల్లో పొరపాట్లు చేయవచ్చు గనుక పనులను, ఇంటి వారిని బాగుగా కనిపెట్టాలి. అప్పుడు ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. అంతేకాదు ఆమె పెనిమిటి ఆమెను పొగడును. చాలామంది కుమార్తెలు పతివ్రతా ధర్మము ననుసరించి యున్నారు కానీ వారందరిని నీవు మించిన దానవని పొడగుతాడట. కుటుంబములో ఒకరినొకరు గౌరవించుకోవటం, వారి మంచి పనులను బట్టి పొగడటము అలవాటు చేసుకోవాలి. ఒకరినొకరు గుర్తించాలి. గౌరవించాలి. ఇది చాలా ఆరోగ్యకరము. కొంతమంది ఎదుటి వారు ఎంత మంచివారైనా ఏదో ఒక తప్పును వెతికి చూయిస్తారు. అది అంత మంచిది కాదు. ఎందుకంటే తప్పులు లేనివారు ఉండరు కనుక, తప్పులెన్నువారు తమ తప్పులెరుగరట. కానీ తప్పు తెలిసికొని సరిచేసుకొనేవారు జ్ఞానవంతులు.
ఇకపోతే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. - సామెతలు 14:1 అని ఉంది. ఇల్లు కట్టుట అంటే బిల్డింగ్స్, బంగళాలు కాదు. కుటుంబాన్ని కట్టుట. అంటే కుటుంబాన్ని కట్టే బాధ్యత దేవుడు భార్యకే ఇచ్చాడన్నమాట. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును వివేచన వలన అది స్థిరపరచబడును. - సామెతలు 24:3.
ఈ స్ర్తి తన పెనిమిటికి కిరీటముగా ఉండునట. అందుకే భార్య దొరికిన వారికి మేలు దొరికెను అని సొలోమోను వ్రాశాడు. అయితే ఈ తెలివికి కారణమైన దేవుని యందలి భయమేంటి? అది ఎలా వస్తుంది అని ఆలోచిస్తే, సొలోమోను యొక్క తండ్రి దావీదు మహారాజు ఆ సంగతిని కీర్తనల గ్రంథము 34వ అధ్యాయములో వివరించాడు.
పిల్లలారా! మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకగోరు వాడెవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకగోరు వాడెవడైన ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయుము. సమాధానము వెదకి దానిని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఆయన చెవులు వారి మొరలకు యొగ్గి యున్నవి. - కీర్తన 34:11-15.
వాస్తవానికి భార్యలే కాదు భర్తలు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడచు వారందరు ధన్యులు. అప్పుడే నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు.
యెహోవా యందు భయభక్తులు గలవారి మొరలు, ఆయన ఆలకిస్తాడు గనుక, అనేక మంది తల్లులు కుటుంబాల కొరకు ప్రార్థించి ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నారు.
పంతొమ్మిది మంది పిల్లలకు జన్మనిచ్చిన తల్లి సుసన్నా వెస్లీ, తొమ్మిది మంది చనిపోగా మిగిలిన పదిమంది పిల్లలను ప్రార్థనాపూర్వకముగా పెంచి ప్రయోజకులనుగా చేసింది. ఆమె పిల్లలు జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీలు దేవుని యందు భయభక్తులతో తల్లి పెంపకములో నేర్చుకొనిన ప్రార్థనా జీవితము వాక్యము, పాటలు, సంగీతము ద్వారా ప్రపంచంలోని అనేక దేశాలకు సువార్తను అందించి ఆశీర్వాదకరముగా మారారు. అంత పెద్ద కుటుంబమైనా, వాక్య ధ్యానము గానీ ప్రార్థనలు గానీ ఎటువంటి పరిస్థితులలోను ఆగేవి కావు. ఎంతో క్రమముగా మర్యాదగా, చదువుల్లోను, ఆటపాటల్లోను, సమాధానముగా క్రమశిక్షణతో పెంచి పెద్ద చేసింది. ఆమె తన తల్లిదండ్రులకు పుట్టిన 25 మందిలో చివరిది. అంత మందిలో పెరిగినా, అంత మందిని పెంచిన క్రమము తప్పకుండా ప్రార్థనా జీవితము కలిగి తన పిల్లల ద్వారా ఎంతోమందికి ఆశీర్వాదమైంది. అలా దేవుని యందు భయభక్తులు గల స్ర్తిలు అనేకులు కొనియాడబడుతూనే ఉన్నారు. వారు లేకపోయినా వారి పనులు ఇంకా జ్ఞాపకములోనే ఉన్నాయి.
ఇటువంటి జ్ఞానవంతులు రాగా, యోగ్యురాలుగా, పెనిమిటికి కిరీటముగా ఇంటిని కట్టుకొనుచు, ఇంటివారి నడతలను బాగుగా కనిపెట్టుచు ఉండేటువంటి స్ర్తిలు ప్రతి కుటుంబములో ఉండాలని ప్రార్థన. అటువంటి వారి వలన, వారి కుటుంబాలు మాత్రమే కాదు. వారి సంఘము సమాజము దేశము కూడా ఆశీర్వాదించబడుతుంది. అదే దేవుని ఆశ.

- మద్దు పీటర్ 9490651256