ప్రార్థన

వనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనలు దేని చేత తమ నడత శుద్ధి పరచుకొందురు. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా? - కీర్తనలు 119:9
‘నీవు వనేచ్ఛల నండి పారిపొమ్ము. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము’ - 2 తిమోతి 2:22.
యవ్వనప్రాయము బలముతో శక్తితో ఆరోగ్యముతో ఆనందముతో సంతోషముతో కూడి ఉంటుంది. ఇంకొక విధంగా చెప్పాలంటే - బలముతో శక్తితో వారికిష్టమొచ్చినది చేస్తూ సంతోషంగా ఆనందంగా ఉండే జీవితమే యవ్వనం. హద్దులూ లేవు. పద్ధతులూ లేవు. ఎంత చెప్పినా ఏది చెప్పినా వారి ఇష్టమొచ్చింది చేయటం సామాన్యమైన విషయం. ఎంజాయ్ చేయాలనీ, ఎంజాయ్‌మెంటే జీవితమనీ, ఎంజాయ్ చేయకపోతే జీవితం వ్యర్థమనీ యవ్వనుల అభిప్రాయము. మరి ఎంజాయ్ చేయాలంటే డబ్బు కావాలి. ఎలా? ఇక్కడ మార్గాలు ఎన్నో శాఖలుగా చీలిపోతాయి. బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు తెచ్చుకొని, బాగా సెటిల్ అయ్యి ఎంజాయ్ చేద్దామని కొందరు, కష్టపడి పనిచేసి సంపాదించాలనుకునేవారు మరి కొందరు, ఏదో ఒకటి చేసి సంపాదించి ఎంజాయ్ చేద్దామనుకునేవారు ఇంకొందరు. ఇలా రకరకాల మార్గాల్ని ఎన్నుకుంటారు. కొంతమంది సొంత నిర్ణయాలు, కొంతమంది స్నేహితుల నిర్ణయాలు, కొంతమంది తల్లిదండ్రులు చెప్పిన మాటలు, బంధువులు చెప్పిన మాటలు వింటూ వారివారి మార్గాలు ఎన్నుకుంటారు. కొంతమంది విజయాన్ని సాధిస్తారు. ఎక్కువమంది పరాజితులవుతుంటారు. ‘సక్సెస్’ అయిన వారందరూ సంతోషంగా లేరు. ఇంకా ఏదో సాధించాలీ, సంపాదించాలనీ తపన ఉంటుంది. తృప్తి లేకపోవటం వల్ల అనుకున్నది పొందుకున్న సంతోషం ఆనందం ఉండదు. కొంతమంది ఏ కష్టం లేకుండా డ్రగ్స్‌కీ, మందుకీ బానిసలౌతూ ఆరోగ్యాలు పోగొట్టుకుంటున్నారు. ఇంకా కొంతమంది ఆటల్లో ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు. మ్యూజిక్, సినిమా, నాటకాలు ఇలా రకరకాలుగా సంతోషాన్ని వెతుకుతూ ఉంటారు.
యవ్వనులను ఎలా ఆకర్షించాలి? ఎలా వారి శక్తిని వాడుకోవాలి? ఎలా వారి సమయాన్ని వారి డబ్బును వినియోగించుకోవాలి అని ప్రపంచం అనేక రకాలైన ప్రణాళికలు మార్గాలు వెతుకుతూ ఉన్నది. తల్లిదండ్రుల బాధలు తల్లిదండ్రులవి. ఎవరికి చెప్పాలో ఏం చేయాలో ఎలా చేయాలో అన్న ఆలోచనలలో ఉంటున్నారు. రాత్రిళ్లు గంటలు గంటలు బైట స్నేహితులతో, సినిమా హాల్స్‌లో ఉండి, ఏ మధ్యరాత్రో తెల్లవారుజామునో ఇంటికి చేరినప్పుడు తెలియలేదు. తల్లిదండ్రులు ఎంత ఎదురుచూస్తారో? ఎన్ని ఆలోచనలు వారిలో ఉంటాయో? టెన్షన్ తట్టుకోలేక ఒకరితో ఒకరు అరుచుకుంటూ పోట్లాడుకుంటూ వాళ్లు కూడా పిల్లలు తిరిగి ఇంటికి వచ్చేవరకు నిద్ర పోరనీ, ఎదురుచూస్తూ ఉంటారనీ ఇప్పుడు పిల్లలు పుట్టి పెద్దవారైనప్పుడు అర్థవౌతుంది. తల్లిదండ్రులు ఎందుకు దిగులు వేదన కలిగి ఉన్నారో? వారి ఆరోగ్యాలు ఎందుకు పాడైపోయాయో? ఇప్పుడు అర్థమైనా చేసేది ఏమీ లేదు. పోయిన కాలాన్నీ, యవ్వనాన్నీ, పోయిన ఆరోగ్యాలను తిరిగి తీసుకురాలేము. చాలామంది వెనుకటి జీవితం గూర్చి ఆలోచించి పొరపాట్లు గ్రహించినా చేయగలిగేది ఏమీ ఉండదు. సరిచేయలేని నష్టాలు జరిగిన తరువాత ఎంత ఆలోచించినా ఉపయోగముండదు. తల్లిదండ్రులంటే ఇష్టం లేక ప్రేమలేక కాదు గానీ యవ్వన ఇచ్ఛాలు మనిషిని ఎటుపడితే అటు లాక్కుపోతాయి కాబట్టి అలా చేస్తారు. తప్పొప్పులు తెలియదు. ఇష్టమొచ్చింది చేయటం, ఇష్టమొచ్చినట్లు తిరగటం, ఇష్టమొచ్చినట్లుండటమే యవ్వనము అనుకుంటారు. యవ్వనస్థులకు కట్టుబాట్లు నచ్చవు. హెల్మెట్ పెట్టుకోమని కొనిచ్చినా పెట్టుకోకుండా ఉండటం, పోలీసులు కనపడ్డప్పుడు వెంటనే పెట్టుకోవటం, పెట్టుకున్నా బకిల్ అప్ చేయకుండా ఉండటం, సిగ్నల్ జంప్ అవ్వటం, సాధ్యమైనంత ఫాస్ట్‌గా వెళ్లటం, ఎక్కువ మంది బైక్‌పై ఎక్కడం ఇదే యవ్వనమనుకుంటారు. దానివల్ల ఎన్ని నష్టాలో?! ఒక చిన్న సంఘటన వల్ల సంతోషంగా సమాధానంగా సాగిపోయే కుటుంబం అస్తవ్యస్థమై కొందరు ఆస్పత్రి పాలై, కొందరు పోలీసుస్టేషన్ పాలై, కొందరు స్మశానం పాలై పోతున్నారు. తిరిగి ఆ కుటుంబం కోలుకోవటానికి దశాబ్దాలు పట్టవచ్చు. ఇది ఒక్క హెల్మెట్ విషయమే. ఇంకా అనేక రకాలుగా యవ్వనప్రాయంలో ఎన్నో కష్టాలు నష్టాలు ఎదురౌతున్నాయి. మన కుటుంబాలకు నష్టమే కాదు మనల నుంచి అనేక కుటుంబాలు కూడా నష్టాల పాలవవచ్చు. యవ్వనప్రాయంలో వచ్చే కోరికలు, ఇష్టాలు, ఆశలు, ఆశయాలు అనేకం. అందుకే యవ్వనేచ్ఛల నుండి పారిపొమ్మని పౌలు భక్తుడు తిమోతికి ఉత్తరం రాశాడు. ఈ ఉత్తరం మనకు కూడా చాలా ఉపయోగము. యవ్వన ఇచ్ఛల నుండి పారిపోకపోతే అంతే. చివరకు ఆ మార్గము మనలను ఊబిలోనికి దించుతుంది. ఉచ్చు వేస్తుంది. తప్పించుకునే మార్గము ఉండదు.
ముందు చెప్పినట్లు సామాన్యంగా వచ్చే కోరిక ధన సంపాదన. ఈ ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. దైవజనుడా! నీవైతే వీటిని విసర్జించి, నీతిని శక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము - 1 తిమోతి 6:10-11.
అంటే భక్తిపరులు/ దైవజనులు సంపాదించుకోవలసిన విషయాలు నీతిని, శక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వీకమును. అందుకే యవ్వనేచ్ఛల నుండి పారిపోవాలి. యవ్వనస్థులందరికీ ఇచ్ఛలుంటాయన్న మాట. వాటిని బయటకు కనపడేలా చేసేవారు సగమైతే, మిగిలిన వారు కనపడకుండా చేసేవారని అర్థవౌతుంది.
ఆ కోరికల నుండి పారిపోవాలి
యవ్వనప్రాయములో యవ్వన ఇచ్ఛల నుండి పారిపోయిన యోసేపును మనము చూడగలము. యవ్వనప్రాయములో వచ్చిన శోధనల నుండి ఇచ్ఛల నుండి పారిపోయాడు. పోతిఫర్ భార్య జులైక యోసేపు రూపవంతుడును సుందరుడునై యుండుట చూసి, తనతో శయనించమని చెప్పెను. అందుకు యోసేపు ఆమెతో శయనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట వినలేదు.
అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్లినప్పుడు ఇంటి మనుష్యులలో ఎవరును అక్కడ లేరు. అప్పుడామె అతని వస్తమ్రు పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్తమ్రును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను. - ఆది.39:11-12.
ఆ తరువాత పోతిఫర్ భార్య యోసేపు మీద లేనిపోని అభాండములు వేసి చెరసాలలో వేయించిన సంగతి మనకు తెలుసు. అంతేకాదు. యవ్వనేచ్ఛల నుండి పారిపోయిన యోసేపు కనబరచిన నీతి భక్తి విశ్వాసము దేవుని యెడల ఉన్న ప్రేమ ఓర్పు సాత్వికమును బట్టి దేవుడు తనను ఎంతో హెచ్చించాడు. నీతి కలిగి ఉన్నాడు గనుక పొరుగువాని భార్యను కూడుటకు ఇష్టపడలేదు. భక్తి కలవాడు గనుక పరిశుద్ధ దేవుని నామానికి మచ్చ లేకుండా జీవించాడు. విశ్వాసముతో దేవుని విరోధమైన దుష్కార్యము చేయుటకు ఇష్టపడలేదు. దేవుని ప్రేమించాడు గనుక ఇక ఈ లోకములో అల్పకాల భోగాలను ఆశించలేదు. చేయని నేరానికి కారాగారంలో వేసినా రెండు సంవత్సరములు ఓపికతో సాత్వికముతో ఉండి చివరకు దేవుడిచ్చిన బహుమానము పొందుకున్నాడు.
సాధారణంగా యవ్వనస్థులకు ఎదురయ్యే శోధనలు - ధనాశ నేత్రాశ శరీరాశ జీవపుడంబము. ఇవి మానవులకు ఉండేవే. కానీ యవ్వనప్రాయములో ఎక్కువగా చూడగలము. ఇవన్నీ కలిగిన ఒక యవ్వనస్థుని గూర్చి యేసు ప్రభువు చెప్పిన ఉపమానము. ధనాశ వల్ల తండ్రి యొద్ద నుండి సగభాగము ఆస్తిని తీసుకొన్నాడు. తన భాగముతో నేత్రాశ శరీరాశ జీవపు డంబముతో దూరదేశము పోయి తన ఆస్తిని దుష్కార్యములతో పాడుచేశాడు. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి, వెళ్లి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరాడు. అతడు తన పందులను మేపుటకు పొలములోనికి వానిని పంపెను. ఆకలి బాధకు తట్టుకోలేక చివరకు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను గానీ యెవడను వానికి ఏమీ ఇవ్వలేదు. యవ్వనప్రాయములో దుబారా ఎక్కువగా ఉంటుంది. కన్నూమిన్నూ కానరాదు. ఆస్తి అంతా వేశ్యలకు తగులబెట్టాడు. స్నేహితులకు ఖర్చు చేశాడు. చివరకు బికారి అయ్యాడు. ఈ సమయములో స్నేహితులు తనతో ఎవ్వరూ లేరు. అందరూ విడిచి వెళ్లారు. యవ్వనప్రాయము మన నుండి పోతుంది. వయసు ఉడిగిపోయి శక్తి ఉండదు. బలము ఉండదు. స్నేహితులు ఉండరు. ఆరోగ్యం క్షీణించి పోతుంది. పట్టించుకునే నాథుడు ఉండడు. అప్పుడు చివరకు తండ్రి ఇంటికి చేరాడు. అయినా తండ్రి ప్రేమతో చేర్చుకొని, దూరముగా ఉన్నప్పుడే తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు క్షమాపణ కోరుకొని, పరలోకానికి విరోధముగా నీ యెదుటను పాపము చేసితిని. నీ కుమారు డనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నీ కూలివాళ్లలో ఒకనిగా నన్ను చేర్చుకొమ్మని ప్రార్థించగా, తండ్రి ఎంతో ప్రేమతో తన దాసులను పిలిచి ప్రశస్త వస్తమ్రు త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి. క్రొవ్విన దూడను తెచ్చి వధించండి. మనము తిని సంతోషపడుదుము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను. తప్పిపోయి దొరికెనని చెప్పెను. దీనినిబట్టి యవ్వనేచ్ఛలలో పడిపోతే తప్పిపోవటమే ఆత్మీయ మరణము. ఒకప్పుడు తప్పిపోయిన వాళ్లు ఎప్పుడో ఒకసారి తిరిగి కనబడేవారు. సైన్స్ అడ్వాన్స్ అయిన ఈ రోజుల్లో తప్పిపోయిన పిల్లలు దొరికితే మనుషులుగా చూడటం లేదు. వారిని విచ్చలవిడిగా వాడుకొంటున్నారు. చంపి శరీరావయవాలను తీసివేసుకుంటున్నారు. జాగ్రత్త! వ్యసనాలలో పడి ఇంటికి దూరమవ్వకూడదు. అది నరకప్రాయమే.
ఇక్కడ పరలోకపు తండ్రి ప్రేమను చూస్తున్నాము. మనలను ఎంతగానో ప్రేమించిన దేవుడు. మనలను ప్రేమించి తన అద్వితీయ కుమారుని మన కొరకు అనుగ్రహించిన తండ్రి మన అతిక్రమముల కోసము తన కుమారుని సిలువ వేసి మన పాపములు కొట్టివేసిన దేవుడు పశ్చాత్తాపముతో తిరిగి వచ్చిన వారిని కౌగిలించుకొని ముద్దాడి ప్రశస్త వస్త్రాలిచ్చి బంగారు ఉంగరం పెట్టి కాళ్లకు జోడు ఇచ్చి నిత్యజీవాన్నిచ్చే దేవుడు ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నాడు. ఈ లోకములో తండ్రి మరచిపోవచ్చు. పట్టించుకోకపోవచ్చు. కానీ పరమ తండ్రి మాత్రం మారని ప్రేమతో మనలను ప్రేమిస్తూ, ఎదురుచూస్తూనే ఉంటాడని అర్థవౌతోంది. క్షమించటానికి సిద్ధముగా ఉన్నాడు. ఎంత ఖర్చు చేసినా ఎంత తిరుగుబాటు చేసినా పరమ తండ్రి ప్రేమ మాత్రం పశ్చాత్తాపపు నొంది, తప్పు తెలిసి తిరిగి వచ్చిన వారిని చేర్చుకోవటానికి సిద్ధం. ఎవరైనా ఎప్పుడైనా సరే. ఈ లోకస్థులు నష్టాన్ని ఎక్కువ లెక్కించి దగ్గరకు రానివ్వకపోవచ్చు. కానీ ప్రభువుకు నీవు ముఖ్యము. మనస్సు మార్చుకొని, ఈ లోకాశ, నేత్రాశ, జీవపుడంబము మోసమని తెలుసుకొని తిరిగి వచ్చేవారిని ప్రేమతో చేర్చుకొనే దేవుడు.
అందుకే దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటియందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందే నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. యోనా దేవుని మాటకు అవిధేయుడై మత్స్యము కడుపులో నుండి, తప్పు తెలుసుకొని మరణకూపములో నుండి యెహోవాను జ్ఞాపకము చేసికొని ప్రార్థించగా, పరిశుద్ధ ఆలయములో నుండి ఆలకించి మరణము నుండి తప్పించాడు. అన్యదేశములో చెరలోను, వారి అవిధేయతను బట్టి బానిసత్వములోను ఉండి తండ్రిని జ్ఞాపకము చేసికొని మొఱ్ఱ పెట్టినప్పుడు ఆయన వారి మొఱ్ఱలను ఆలకించి విమోచించాడు. విచారమేమంటే మరణము ముంచుకొచ్చే వరకు కత్తి గొంతు మీదకు వచ్చేవరకు ఆరోగ్యం క్షీణించేవరకు, ఆస్తులు హరించిపోయే వరకు కుటుంబాలు నాశనమయ్యే వరకు దేవుని మర్చిపోతున్నారు. అసలు జ్ఞాపకము చేసుకోకుండా ఉండేకన్నా చివరి దశలోనైనా సృష్టికర్తను జ్ఞాపకము చేసికొనుట మేలు.
నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను. పాతాళ గర్భములోనుండి కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించియున్నావు. - యోనా 2:2.
పాతాళపు పాశములు నన్ను అరికట్టగను మరణపు ఉరులు నన్ను ఆవరింపగను నా శ్రమలో నేను యెహోవాకు మొఱ్ఱ పెట్టితిని. నా దేవునికి ప్రార్థన చేసితిని. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. - కీర్తనలు 18:5-6.
సొలొమోను ప్రసంగి గ్రంథములో వ్రాసిన మాటలు - యవ్వనుడా! నీ యవ్వనకాలమందు సంతోషపడుము. నీ యవ్వనకాలము నందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టియొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నింటినిబట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. లేత వయస్సు నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. నీ దేహమును చెరుపువాని తొలగించుకొనుము.
కొన్నిసార్లు మన పరిస్థితులు మార్చుకోలేనంతగా ఉంటాయి. అప్పుడు పశ్చాత్తాపపడినా ఉపయోగము అంతగా ఉండదు కానీ నిజ పశ్చాత్తాపము ఉంటే దేవుడు తప్పులు క్షమిస్తాడు. మన అతిక్రమములను తుడిచివేస్తాడు. పడమటికి తూర్పు ఎంత దూరమో అంతకన్నా దూరపరచి, ఇక ఎన్నటికి గుర్తు చేసుకోడు. ఇంత గొప్ప కరుణగల దేవుని, తండ్రిని, ఏ స్థితిలో ఉన్నా జ్ఞాపకము చేసికొని, తప్పక ఆయన ఆదరించి అక్కున చేర్చుకుంటున్నాడు. ఎంత పాపినైనా త్రోసివేయడు. తప్పులు క్షమించి అక్కున చేర్చుకుంటాడు.
బాలురు సొమ్మసిల్లుదురు. యవ్వనస్థులు తప్పక తొట్రిల్లుదురు. దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధత ముందు ఎన్నిసార్లు తప్పిపోయామో? తప్పిపోయిన సంగతి తెలియదు. పడిపోయిన సంగతి తెలియదు. ఉచ్చు ఉన్న సంగతి, బంధకాలు యవ్వనములో తెలియవు. అంతా మంచే నా తప్పు ఏమీ లేదు. నేను కరెక్ట్ అని యవ్వనస్థులు అనుకుంటారు. కానీ తల్లిదండ్రులకు, స్నేహితులకు, బంధువులకు బాహాటముగా తెలుస్తుంది. ఎంత తప్పు మార్గములో ఉన్నారో అంటే అంతరంగాలను కూడా ఎరిగినటువంటి ప్రభువుకు ఇంకా స్పష్టముగా మన పొరపాటులన్నీ తెలియును గదా. కనుక దేవుని శాపము ఉగ్రత మన మీదికి రాకముందే దుర్దినములు రాకముందే అంటే నేడే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. మిగిలిన జీవితమంతా నీతి కలిగి ప్రేమతో పవిత్రంగా ఓర్పుతో సహనముతో జీవించి దేవుని ఆశీర్వాదాలు మెండుగా పొందుకొని నీకు నీ యింటివారికి నీ సమాజానికి సంఘానికి దేశానికి నీవు ఒక ఆశీర్వాదముగా ఉండాలని ప్రార్థన. యవ్వనప్రాయము పోతే మరలా రాదు. వయస్సు ఉడిగిన తరువాత మార్పు వచ్చినా యవ్వనములో చేసినట్టు శక్తితో పనులు చేయలేము కనుక ఇప్పుడే దుష్టత్వము విడిచిపెట్టు. బాల్య దినములందే సృష్టికర్తను జ్ఞాపకముంచుకో. తల నెరసిన వాని ఎదుట లేచి, ముసలి వాని ముఖమును ఘనపరచి దేవునికి భయపడు. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించు. పెద్దలకు లోబడి యుండు. యవ్వనకాలమందే కాడి మోయుట నరునికి మేలు. యవ్వనమందే దేవునికి విధేయులగుట వాక్యానుసారముగా నడుచుట ఆశీర్వాదము. దేవునికి విధేయులమైతే ఆయన శక్తి మనలో ఉంటుంది గనుక సాతానును ఎదిరించగలము.
యవ్వనస్థులు దేనిచేత తమ నడత శుద్ధిపరచుకొందురు. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనేగదా. - కీర్తనలు 119:9
నీ యవ్వనమందే దేవుని జ్ఞాపకము చేసికో
నీ కుటుంబానికి నీ రాష్ట్రానికి నీ దేశానికి ఉపయోగపడు.
Nation needs you in your youth
Don't let the exitement of being young cause you to forget about your creator.

- మద్దు పీటర్ 9490651256