ప్రార్థన

బుద్ధి విషయమై ఎదుగుము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును’ - ఎఫెసి 1:3.
ఆశీర్వాదము పొందుకున్న వారు, అభిషేకము పొందుకొని క్రీస్తులో ఎదగాలి. క్రీస్తు రూపములోనికి రావాలి. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అనుగ్రహించు కృప యందును జ్ఞానమందును అభివృద్ధి చెందాలి. క్రీస్తులో పసిబిడ్డల లాగ మిగిలిపోకూడదు. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయములో సహోదరులారా, ఆత్మసంబంధులైన మనుషులే అనియు, మీతో మాటలాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలక పోయినందున పాలతోనే మిమ్మును పెంచితిని గానీ అన్నముతో మిమ్మును పెంచలేదు.
మీరింకను శరీర సంబంధులై యుండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై యున్నారు కారా? మీలో కలహమును అసూయయు ఉండగా మీరు శరీర సంబంధులైయున్నారు కారా? ఒకడు నేను పౌలువాడను, మరియొకడు నేను అపొస్తలుల వాడను అని చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపొల్లో ఎవడు? పౌలు ఎవడు? పరిచారకులే గదా! ఒక్కొక్కరికి ప్రభువనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెనా వృద్ధి కలుగ జేసినవారు దేవుడే అని స్పష్టముగా తెలియజేసెను. వృద్ధి కలుగజేయునది ప్రభువే. సంఘము కాదు. పరిచారకులు కాదు. శరీర సంబంధమైన మనసు ఉన్నవారు వృద్ధి కలుగజేయు ప్రభువు వైపు గాక నాటిన వాళ్లను నీరుపోసిన వాళ్లను ఎక్కువ చేసి, వృద్ధి కలుగజేయు ప్రభువును ప్రక్కన పెడుచున్నారు.
కనుక మనమిక మీదట పసిపిల్లలమై యుండి, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము - ఎఫెసి 4:14-15.
మనము బాలురమై యున్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై యుంటిమి. అయితే బాలురై యున్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు. తాను ఒకరి సంరక్షణలో ఉండవలసినదే. చాలామంది బాలుల వలెనే ఉండటానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే బాలులను చాలా శ్రద్ధగా చూస్తాము. గౌరవిస్తాము. పిల్లలు కాబట్టి చాక్లెట్లు బిస్కెట్లు కొనిస్తారు. ఇంకా ఉన్నవాళ్లయితే మంచిమంచి బట్టలు, విలువైన వస్తువులు ఇస్తారు. వీటికి అలవాటైన కొంతమంది క్రైస్తవ బాలబాలికలు చాలా హాయిగా ఉంది. సంతోషంగా ఉంది కాబట్టి ఇక ఇలానే ఉందాము అనుకుంటారు.
కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై యుండగా, దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మరల బోధింపవలసి వచ్చెను. మీరు పాలుత్రాగవలసినవారే గానీ బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవం లేనివాడై యున్నాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి యున్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును .
-హెబ్రీ 5:12-14.
మరి ఇప్పుడు మన స్థితి ఎలా ఉంది. పసి బాలుల వలె పాలలోనే ఉన్నామా? లేక వయస్సు వచ్చిన వారి వలె బలమైన ఆహారములో ఉన్నామా? పాలతోనే ‘బేబీ క్రిస్టియన్స్’ లాగే యున్నాము. వారానికి ఒక్కసారి ఫీడింగ్‌లో ఉన్నాము. మూడు పూటలా ఫీడింగ్‌లో ఉన్నాము. అసలు ఆధ్యాత్మిక ఆకలి ఉందా? లేదా? స్వతహాగా ఆత్మీయ ఆకలి లేకపోవటంవల్ల రకరకాల హంగులతో, ఎల్‌ఇడి లైట్లతో అలంకరించిన హోటల్స్‌లాగా చర్చిలను అలకరించి ఆకర్షిస్తున్నారు. బాలలకు రంగులు హంగులు చూయించినట్లు చూయించాల్సి వస్తోంది. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అది అతనికి వెర్రితనముగా ఉన్నది. అది ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతను వాటిని గ్రహింపజాలడు. -1 కొరింథీ 2:14.
నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును మృతుల పునరుత్థానమును సత్యమైన తీర్పును అను పునాది మరల వేయక, క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని, సంపూర్ణుల మగుటకు సాగిపోదము. ఒకసారి వెలిగించబడి, పరలోక సంబంధమైన వరమును రుచి చూచి, పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయినవారు, తమ విషయములో దేవుని కుమారుని మరల సిలువ వేయుచు, బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు. గనుక మారు మనసు పొందునట్లు అట్టివారిని మరల నూతనపరచుట అసాధ్యము. - హెబ్రీ 6:1-6.
కొంతమంది పరిస్థితి ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న దగ్గరే ఉంది. రెండు వేల సంవత్సరాల క్రితం పరిస్థితి, రెండు వేల సంవత్సరాల తరువాత పరిస్థితి అంతే ఉంది. చిన్నప్పటి నుండీ 20 ఏళ్లయినా ముప్పై ఏళ్లయినా 70 ఏళ్లయినా మార్పేమీ కనబడుట లేదు. బాలబాలికలు సిద్ధపడ్డట్లు సిద్ధపడి చక్కగా కనపడుచున్నారు.
అమూల్యమైన విశ్వాసము పొందుకున్న వారికి పేతురు తన రెండవ పత్రిక మొదటి అధ్యాయములో వ్రాసిన మాటలు - దేవుని గూర్చినట్టయు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చినట్టియునైన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. మహిమను బట్టియు గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి యున్నాడు. దురాశ ననుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు, వాటిని అనుగ్రహించెను. ఆ హేతువు చేతనే మీమట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త ఆశానిగ్రహమును, ఆశానిగ్రహము నందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తియందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన యెడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండ చేయును. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి, గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడునగును.
-2 పేతురు 1:1-9.
సహోదరులారా శుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి. బుద్ధి విషయమై పెద్దవారలై యుండుడి -
1 కొరింథీ 14:20.
మీరు క్రీస్తుతో కూడ లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనేగాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. ఏలాగనగా మీరు మృతి పొందితిరి. మీ జీవము క్రీస్తుతో కూడ దేవుని యందు దాచబడి యున్నది.
- కొలెస్స 3:1-2.
క్రీస్తుతో లేపబడిన గాని, ఆత్మ విషయములో ఎదుగుదల లేని వారి మనస్సు భూ సంబంధమైన వాటితోనే నిండి ఉంటుంది. జాగ్రత్త!!
భూ సంబంధమైన విషయాలలోనే మనసు ఉందంటే, అంటే ఏమి తిందుము ఏమి త్రాగుదము అనే వాటిపై మనసు ఉందంటే ఇంకా పసిబాలుడవే. బాలుడవైతే నీకు దాసునికి భేదము లేదు. క్రీస్తుతో వారసత్వముండదు. పసిబిడ్డలను ఎత్తుకెళ్తున్నట్లు, సాతానుడు మనలను తేలికగా పడవేస్తాడు. మోసపరుస్తాడు. మోసపోయామన్న సంగతి కూడా మనకు తెలియకపోవచ్చు. వీరు నీళ్లు లేని బావులును, పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములై యున్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి యున్నది. వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై, తప్పు మార్గమందు నడుచువారిలో నుండి అప్పుడే తప్పించుకొనిన వారిని, పోకిరి చేష్టల చేత మరలుకొల్పుచున్నారు. తామే భ్రష్టత్వమునకు దాసులై యుండియు, అట్టివారికి స్వాతంత్య్రము ఇత్తుమని చెప్పుదురు.
అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానము మేమాయెను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున నున్నట్టే నిలచి యున్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. ఏలయనగా పూర్వము నుండి ఆకాశముండెదనియు, నీళ్లతో నుండియు నీల్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగెననియు వారు బుద్ధి పూర్వకముగా మరతురు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశము భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై, అదే వాక్యము వలన భద్రము చేయబడియున్నది. ప్రియులారా! ఒక సంగతి మరచిపోకుడి ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరముల వలెను, వెయ్యి సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి. కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛగింపక, అందరు మారు మనసు పొందవలెనని కోరుచు, ఏలయనగా దీర్ఘశాంతము గలవాడై యున్నాడు. -2 పేతురు 3:3-9.
అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతమలు మిక్కటమైన వేండ్రముతో లయమై పోవును. భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నియు ఇట్లు లయమై పోవునది గనుక, ఆకాశములు రవులుకొని లయమై పోవునట్టియు పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టియు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో ఆపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను, భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై యుండవలెను. అయినను మనమయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. వాటియందు నీతి నివసించును. ప్రియులారా! వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతముగలవారై, ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనపడునట్లు జాగ్రత్తపడుడి. - 2 పేతురు 3:10-14.
అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు ధనాపేక్షులు బింకము లాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రుల కవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటె సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, అనురాగ రహితులు అతి ద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు పైకి భక్తి గలవారివలె ఉండి దాని భక్తిని ఆశ్రయించని వారునై యుందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము.
- 2 తిమోతి 3:1.
ఆత్మీయ ఎదుగుదల లేకుంటే మోసపోయే అవకాశముంది. ఎందుకంటే విశ్వాసి పాపము చేసినా అవిశ్వాసి పాపము చేసినా పాపము పాపమే. వాక్యములో ఎదుగుదల లేకపోతే సాతాను అర్థముకాని మోసపు మాటలతో తప్పుద్రోవ పట్టిస్తాడు. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్య్రముండును. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప జేయుచు, మహిమ నుండి అధిక మహిమ పొందుచు, ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. దేవునితో ఎదిగే నీతిమంతులు ఖర్జూర వృక్షమువలె మొవ్వ వేయుదురు. లెబనోను మీది దేవదారు వృక్షమువలె వారు ఎదుగుతారు. యెహోవా మందిరములో నాటబడిన వారై మన దేవుని ఆవరణములో వర్థిల్లుదురు. నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యధార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందును ఇంక చిగురు పెట్టుచుందురు. సారము కలిగి పచ్చగా ఉందురు. అందరు ఎదిగి ఫలించి సారము కలిగి పచ్చదనముతో లోకాన్ని నింపాలని ప్రార్థన.

-మద్దు పీటర్ 9490651256