ప్రార్థన

క్రీస్తు లేచెను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘తాను చెప్పినట్టే ఆయన లేచెను’ -మత్తయి 25:6
‘కలవరపడకుండి. సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు. ఆయన లేచి యున్నాడు. ఇక్కడ లేడు’ - మార్కు 16:6
‘ఆయన ఇక్కడ లేడు. ఆయన లేచి యున్నాడు’ - లూకా 24:6
అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది, చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు ముందుగానే తెలియజేసెను. ఆయన చెప్పినట్లే యెరూషలేమునకు వెళ్లినప్పుడు, ఆయన గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి ప్రార్థించుచుండగా, తన శిష్యులలో ఒకడగు యూదా వచ్చాడు. అతనితోపాటు బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని వచ్చారు. యేసు ప్రభువు అది చూసి ‘చెలికాడా, నీవు చేయవచ్చినది చేయుమ’ని చెప్పెను. అప్పుడు యూదా ‘నీకు శుభమ’ని యేసుని ముద్దు పెట్టుకొనెను. వెంటనే యేసుని పట్టుకొని ప్రధాన యాజకుడైన కయప దగ్గరకు తీసికొని, ఆయన చేయని నేరములు మోపి, అబద్ధ సాక్ష్యములు చెప్పి, చివరకు పిలాతు ముందు నిలువబెట్టి, బందిపోటు దొంగయైన బరబ్బాను వదిలి యేసు ప్రభువును సిలువ వేయుమని కేకలు వేసి, ఆయన తలకు ముళ్ల కిరీటము పెట్టి, అపహసించి, ఉమ్మి వేసి, కొరడా దెబ్బలు కొట్టి, మోయలేని సిలువను ఆయన చేత మోయించి గొల్గొత కొండ మీద కపాలమనబడే స్థలమున ఇద్దరు గజ దొంగల మధ్య సిలువ వేసి రమారమి ఆరు గంటల పాటు సిలువ మీదనే ఉంచి, చనిపోయాడని నిర్ధారించటానికి ప్రక్కలో బల్లెముతో పొడిచి, రక్తము - నీరు కారగా చూచి చనిపోయాడని తెలిసికొని, ప్రవచనానుసారము క్రొత్త సమాధిలో ఉంచి పెద్ద రాయి పొర్లించి వెళ్లిపోయెను. ఆ సమాధికి కాపలాగా కొంతమందిని అక్కడ ఉంచారు. సమాధిని భద్రము చేసి రాతికి ముద్ర వేశారు.
యేసు ప్రభువును సిలువ వేసి చంపి సమాధి చేసి అధికార పూర్వకంగా కాపలా ఉంచారు. ఇలా జరుగునని ప్రభువే చెప్పాడు. ఆయన చెప్పినట్లే అంతా జరిగింది ఇప్పుడు. విశ్రాంతి దినము గడిచిపోయిన తువాత ఆదివారం తెల్లవారుతూండగా, మగ్దలేన మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చారు. అప్పటికే ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహా భూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్తమ్రులు హిమమంత తెల్లగా ఉండెను. దూత వచ్చి స్ర్తిలను చూచి ‘మీరు భయపడకుండి. సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియును. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్లే, ఆయన లేచి యున్నాడు. ఈ సంగతిని మిగిలిన వారికి చెప్పటానికి వెళ్తున్న వారిని ప్రభువు ఎదుర్కొన్నాడు.
క్రీస్తు లేఖనముల ప్రకారము ఎలాగు చనిపోయెనో అలాగే లేఖనాల ప్రకారము మూడవ దినమున లేపబడెను. ఆయన ముందు స్ర్తిలకు, కేఫాకు ఆ తరువాత పండ్రెండు మంది శిష్యులకు కనపడెను. అటు తరువాత ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందె కనబడెను.
ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను ఏడు దయ్యములను వెళ్లగొట్టిన మగ్దలేనె మరియకు మొదట కనపడెను - మార్కు 16:9. ఆ తరువాత కొంతమంది స్ర్తిలకు కనపడెను. -మత్తయి 28:9. తరువాత పేతురుకు, లూకా 24:34 తరువాత భయపడి దాగున్న శిష్యులకు -యోహాను 20:19, తరువాత ఎమ్మాయు మార్గమున ఇద్దరు శిష్యులకు, లూకా 24:15, తరువాత శిష్యులందరికి, ఈసారి తోమా కూడా ఉన్నాడు -యోహాను 20:21-29; గలిలయ దగ్గర ఏడుగురు శిష్యులకు -యోహాను 21:14, గలిలయ కొండ దగ్గర శిష్యులకు -మత్తయి 28:16, అటు తరువాత ఐదు వందల మంది శిష్యులకు, ఒక్కసారే కనపడెను - 1 కొరింథీ 15:6, ఆ తరువాత యాకోబుకు అపొస్తలులందరికి కనపడెను 1 కొరింథీ 15:7, శిష్యులందరిని ఆశీర్వదించెను -లూకా 24:50-51, తరువాత పౌలు భక్తునికి కనపడెను 1 కొరింథీ 15:8.
ఇలా ఆయన నలుబది దినములు వారికి కనపడుచు దేవుని రాజ్య విషయములు గూర్చి బోధించుచు, అనేక ప్రమాణములను చూపి వారికి తన్నుతాను సజీవునిగా కనపరచుకొనెను.
ఆ తరువాత దేవుడు మరణాన్ని గెల్చినప్పుడు, శిష్యులకు లోక భయము ప్రాణ భయము పోయింది. కనుకనే శిష్యులు ఈ సత్యాన్ని ప్రకటించటానికి ఎన్ని ఇబ్బందులు, కష్టాలు చివరకు ప్రాణ హాని ఉన్నా భయపడలేదు. కారణము జీవాధిపతి క్రీస్తే, మృత్యుంజయుడు క్రీస్తే గనుక ఇక నాకేమి అని లోకానికి ఈ సంగతి తెలియబూనుకున్నారు. ఎక్కడ ఎప్పుడు వెనుతిరుగలేదు గనుకనే ఇప్పటి వరకు ఈ పునరుత్థాన వార్త ప్రకటింపబడుతూనే ఉంది.
వాస్తవానికి ఈ శిష్యులే ప్రభువును సిలువ వేసే సమయములో పారిపోయారు. భయభ్రాంతులకు గురయ్యారు. యూదులు వీరిని కూడా ఎక్కడ చంపుతారో అన్న భయముతో దాక్కున్నారు. అటువంటి వారి మధ్యకు వెళ్లి వారికి తన్ను తాను కనపరచుకొని మీకు సమాధానము కలుగును గాక అని చెప్పెను. ఆయన ఆలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు - మరల మీకు సమాధానము కలుగును గాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని చెప్పెను - యోహాను 20:19-21.
క్రీస్తు చనిపోయినప్పుడు శిష్యుల సంతోషము నిరీక్షణ అంతా ఎగిరిపోయి భయములో ఉన్నటు వారు మరల యేసు ప్రభువు వచ్చి వారికి కనపరచుకొనగానే వారికి సంతోషము మొదలైంది.
శిష్యుడు పేతురు వ్రాసిన మాటలు - మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు, వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరము చప్పున మనలను మరలా జన్మింపజేసెను - 1 పేతురు 1:3-4
యేసు ఎవరో నాకు తెలియదని ముమ్మారు బొంకిన పేతురు, ఇప్పుడు క్రీస్తు కొరకు జీవించుటకు, ఆయన కొరకు మరణానికైనా సిద్ధమేనని సువార్తను ప్రకటింప మొదలుపెట్టాడు.
మరణాన్ని గెల్చి లేచిన యేసు ప్రభువు, శిష్యులు ఉన్న గది తలుపులు మూసి ఉన్నా గానీ వచ్చి, వారి మధ్య నిలిచెను. ఆయన శరీరము అలానే ఉన్నప్పటికీ చాలా మార్పు ఉంది. ఆయన ప్రత్యక్షమవ్వగలడు. తాను అనుకున్న చోటికి. అలాగే అదృశ్యుడు కాగలడు.
ఎమ్మాయి గ్రామమునకు వెళ్లుచున్న ఇద్దరు శిష్యులకు దర్శనము ఇచ్చాడు క్రీస్తు. యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అనే ఒక గ్రామమునకు వెళ్లుచున్న ఇద్దరితో యేసు నడుస్తూ, వారి సంభాషణ దేని గురించి అని అడుగగా, వారు దుఃఖముఖులై నిలిచిరి. ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీకు తెలియదా? అని క్లెయొప అడిగెను. అసలు సంగతే యేసు. అయితే ఆయనకు తెలియాల్సింది ఏముంటుంది? ఏ సంగతులు అని ప్రభువు వారి నడిగినప్పుడు, వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని యెదుటను ప్రజలందరి యెదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్తయై యుండెను. మన ప్రధాన యాజకులును అధికారులును ఆయనను ఎలాగు మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా? ఇశ్రాయేలీయులను విమోచింపబోవు వాడు ఈయనే అని మేము నిరీక్షించుచుంటిమి. ఇవిగాక ఈ సంగతులు జరిగి నేటికి మూడు దినములాయెను. అయితే మాలో కొందరు స్ర్తిలు తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్లి, ఆయన దేహము కానక వచ్చి - కొందరు దేవదూతలు తమకు కనపడి ఆయన బ్రతికి యున్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి.
అయితే ఈ ఇద్దరు ప్రభువు లేచాడన్న వార్త విన్నాగానీ నమ్మలేదు. అయితే పండ్రెండు మందిలో ఒకడైన తోమా - నేనాయన చేతులలో మేకుల గురుతులతో వేలుపెట్టి చూచితేనె తప్ప, నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే తప్ప నమ్మనే నమ్మననెను. ఎనిమిది దినములైన తరువాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని పలికెను. తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము. నీ చెయ్యి చాచి నా ప్రక్కను ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుమనెను. చూచి నమ్మిన వారికన్న చూడక నమ్మినవారు ధన్యులని చెప్పెను.
ఈ తోమాయే ఆ తరువాత ప్రభువు ద్వారా హెచ్చరింపబడి మొదటి శతాబ్దములోనే మన భారతదేశంలో కేరళ ప్రాంతానికి వచ్చి సువార్తను అందించింది. ఈయననే ‘డౌటింగ్ థామస్’ అని కూడా అంటారు.
ప్రభువును చూడకపోయినా నమ్మిన వారెంతో ధన్యులు. ఆయన జీవ వాక్యము ఇప్పుడు మనకు చాలు. ఆ మాటల ప్రకారము మనము నడిచినట్లయితే ధన్యులము. మరణమును దాటగలము. ఎలా వెలుగును చీకటి బంధించలేదో అలాగే క్రీస్తు పునరుత్థాన జీవము మనలో ఉంటే మరణము మనలను బంధించలేదు. భయపెట్టలేదు.
మరణము యొక్క బలము గల వానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడ రక్తమాంసములలో పాలివాడాయెను. - హెబ్రీ 2:14-15
నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువారు నిత్యజీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవమునకు దాటి యున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. -యోహాను 5:24
క్రీస్తులో విశ్వాసముంచి ఆయన మాటల ప్రకారము జీవించు వారిలో ఆయన పునరుత్థాన శక్తి ఉంటుంది గనుక, మరణము వారిని కూడా బంధించలేదు గనుక జీవములోనికి వెళ్తారు. నిత్య జీవాన్ని పొందుకుంటారు. దేవుని మాటలను నమ్మక వారి ఇష్టమొచ్చినట్లు జీవించి శరీరానుసారముగా ఉన్న వానిలో పాపముంటుంది. గనుక మరణము పాపిని వదలదు. పాపి యొక్క పాపము, పాపిని మరణము ఆపివేసి నిత్య నరకమునకు పంపిస్తుంది.
అదే క్రీస్తును నమ్మితే, ఆయన పునరుత్థాన జీవమును బట్టి మరణము మనలను పట్టుకొనలేదు. చీకటి వెలుగును పట్టి దాచలేదు. క్రీస్తు బిడ్డలు వెలుగు సంబంధులు. వారికి చీకటితో పనిలేదు.
యేసు ఎమ్మాయి గ్రామస్థులను ‘అవివేకులారా! ప్రవక్తలు చెప్పిన మాట లన్నిటిని నమ్మని మందమతులారా! క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్ప, యోషేయ సమస్త ప్రవక్తలును మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. ఇంతలో వారి గ్రామము రానే వచ్చింది. వారు ప్రభువును ఆహ్వానించి ఆతిథ్యమిచ్చినప్పుడు ఆ రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరువబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతట ఆయన వారికి అదృశ్యుడాయెను.
జాగ్రత్త! ప్రవక్తలు చెప్పిన మాటలు, లేఖనములు చెప్పిన మాట జాగ్రత్తగా వినాలి. జ్ఞాపకముంచుకోవాలి. అర్థము చేసికోవాలి. ఈ శిష్యులు కూడా ప్రభువు సిలువ వేయక ముందు చెప్పిన బోధలు విన్నవారే. ప్రవక్తల మాటలు విన్నవారే. అయినా ప్రభువు మూడవ దినమున లేచునన్న మాటను వీరు గ్రహించలేదు. సిలువ మీద చనిపోవుట మాత్రము చూచారు. సమాధి కార్యక్రమాలు చూచారు. అయినా మూడవ దినమున తిరిగి లేస్తానని ప్రభువు చెప్పిన మాటను గ్రహించలేదు. ప్రభువు ప్రేమ కలిగిన వాడు గనుక మరల మరల వారికి కనపడి పునరుత్థానాన్ని తెలియజేస్తూనే ఉన్నాడు.

-మద్దు పీటర్ 9490651256