ప్రార్థన

ఆత్మ ఖడ్గము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి’ -ఎఫెసి 6:17
అసలు మనము పోరాడునది శరీరులతో కాదు గనుక శరీర ప్రకారము యుద్ధము చేయము. శరీరేచ్ఛలను అదుపు చేయుటయే యుద్ధము. శరీరములో వచ్చే ఆవేశము ఆవేదన ఆలోచనలు కోపము అదుపు చేయటం ముఖ్యం. సాతాను పెట్టే శోధనలను ఎదుర్కొనటానికి, జయించటానికి ప్రభువు వాడిన వాక్య ఖడ్గము మనకు కూడా అవసరం. సాతాను యొక్క అసత్యాన్ని ఎదుర్కొనటానికి మనకు సత్య వాక్యము అవసరం.
బాల్యము నుండి యుద్ధ్భ్యాసము చేసిన గొల్యాతు - కత్తి ఈటె బల్లెమును ధరించుకొని బాలుడైన దావీదు మీదికి వచ్చినపుడు, కేవలము సైన్యముల కధిపతియగు దేవుని నామములో దావీదు ముందుకు సాగి గొల్యాతును హతమార్చాడు. గొల్యాతు లాంటి సాతానును ఎదుర్కొనటానికి మనకు కావలసినది లోక సంబంధమైన యుద్ధోపకరణములు కాదు. సైన్యములకు అధిపతియైన దేవుని మాటలు.
దేవుని సత్యాన్ని చెరిపి అసత్యంగా చేయాలని సాతానుని పన్నాగము. వెలుగు లేకుండా మనుషులను చీకటిమయం చేయాలని వాడి కోరిక. అందుకే వెలుగైయున్న దేవుని బిడ్డలు చీకటిని పారద్రోలి అసత్యాన్ని రూపుమాపి, అసత్యములో ఉన్నవారిని సత్యములోనికి చీకటిలో ఉన్నవారిని వెలుగులోనికి నడిపించుటకు దేవుని శక్తితో పాటుపడాలి. ప్రేమ కలిగి, సత్యము చెప్పుచు నీతిగా నిజాయితీగా ఉండటమే దేవుని బిడ్డలకు గొప్ప ఆయుధము. ప్రపంచములో అతి పెద్ద యుద్ధము సత్యానికి అసత్యానికి మధ్య నడుస్తూనే ఉంది. మంచి చెడుల మధ్య జరిగే యుద్ధమిది. సత్యవంతుడైన దేవునికి లోబడి ఆయన వాక్యానుసారంగా నడుచుటయే సాతానుతో యుద్ధము. దేవుని శక్తికి లోబడి ఉన్నాము గనుక సాతానుడు ఓడిపోయి పారిపోతాడు. లేకుంటే సాతానుడు మనుషులను సులభంగా ఓడించి వశపరచుకొంటాడు. అందరిలో చులకనగా చేస్తాడు. మహా బలవంతుడైన దేవుని బిడ్డలము గనుక అంటే మరణ బంధకాలను సహితము త్రుంచివేసి మరణాన్ని గెల్చి తిరిగి లేచిన ప్రభువు వాక్యానుసారంగా నడచుచు చెడును ద్వేషిస్తూ ఉండాలి.
ఎందుకనగా - దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శాసించుచున్నది - హెబ్రీ 4:12. వాక్యమై యున్న క్రీస్తును నమ్మిన మనమందరము దేవుని బిడ్డలమే. క్రీస్తును అంగీకరించిన వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారముంది. వాక్యాన్ని అంగీకరించిన మనము వాక్య ప్రకారము నడవాలి. వాక్యాన్ని ముందు గ్రహించి విధేయించాలి. వాక్యాన్ని పూర్తిగా ఎరిగి ఉండాలి. అందుకే సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయమని ఓ భక్తుడు తెలియజేస్తున్నాడు.
దేవుని సముఖములో నుండి త్రోసివేయబడిన సాతానుడు చాలా అనుభవజ్ఞుడు. వాక్యము బాగా తెలుసు. వాక్యము తెలిసీ తెలియని వారిని అసలు తెలియని వారిని ఇట్టే మోసము చేసి అనేక రకాలైన బంధకాలలో ఉంచుతాడు. తాగుడు జూదం వ్యభిచారము మోసం దగాల లాంటి అనేక బంధకాలలో కాడిమాను మోకులతో కట్టివేస్తాడు. బంధకాలలో ఉంచుతాడు. బంగారపు జైలు అయినా అది జైలే. కొందరిని బంగారముతో మరి కొందరిని కొన్ని వ్యసనములతో, బంధించి ఉంచుతాడు.
మనము వాక్యముతో నింపబడి ఉంటే సాతానుతో జరిగే పోరాటములో వాక్యముతోనే పోరాడి ప్రభువులా గెలువగలము. మనలో వాక్యము సమృద్ధిగా లేకపోతే సాతానుడు సులువుగా ఓడిస్తాడు. జాగ్రత్త! దేవుని మాటలే సాతానుని ఎదిరించగలవు. అందుకే వాక్యము మనలో సమృద్ధిగా ఉండాలి. మరి రోజుకు ఎంతసేపు వాక్యాన్ని ధ్యానిస్తున్నారు? గ్రహిస్తున్నారు?
రెండంచులు గల వాడియైన ఖడ్గముతో ముందు మనలో ఉన్న చెడునంతటినీ తీసివేయాలి. ఏది సత్యమో గ్రహించాలి. అసత్యాన్ని నరికివేయాలి. వేటి ద్వారా బంధించబడి యున్నామో వాటిని నరికి పారవేయాలి. ఎందుకంటే బంధకాలలో ఉంటే సాతానుతో పోరాడలేము. చిన్నదో పెద్దదో ఏదో ఒక బంధకములో అందరినీ బంధించటానికి సాతానుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. వాడి బంధకాలలో పడకుండా ఉండటానికి వాక్య ఖడ్గమును ఉపయోగించాలి. వాక్యమందు నిలిచి ఉంటేనే సత్యమును గ్రహించగలము. అప్పుడే మనము స్వతంత్రులవౌతాము. స్వతంత్రత లేకుండా బంధకాలలో ఉంటే, బానిసలుగా ఉంటే యుద్ధం చేయలేము. నిస్సహాయంగా ఉంటాము. చీకటిలో ఉన్నట్టే. చీకటిలో ఉండి చీకటితో యుద్ధమేమిటి?
అయితే వాక్యముతో సరిచేసుకుంటూ ఉంటే, సాతాను మోసాలలో పడము. ఉచ్చులో పడము. వాక్యములో సరిచేసికొని దుష్ట మార్గముల నుండి తప్పించుకోగలము. శత్రువుకు మించిన జ్ఞానము బోధకులకు మించిన విశేష జ్ఞానము, వృద్ధుల కంటే విశేష జ్ఞానము పొందుకోగలము. న్యాయ విధులు తెలుసుకుంటాము. తప్పు మార్గము నుండి తప్పించుకొనే వివేకము కలుగుతుంది. వాక్యము మన పాదములకు దీపముగా త్రోవకు వెలుగుగా ఉంటుంది.
సత్య వాక్యము వలనను దేవుని బలము వలనను కుడి యెడమల నీతి ఆయుధములు కలిగి యుందము. ఎడమ చేతిలో కాపాడుకొనుటకైన డాలు కుడి చేతిలో చెడును నరకుటకైన ఖడ్గమును ధరించి యుద్ధ వీరుని వలె మనకు దేవుడు అనుగ్రహించిన నీతి ఆయుధములతో శోధనలను ఎదిరించుటకు గురి వైపు చూసి పోరాడి ముందుకు సాగుటకు సమర్థులము కావాలి.
మంచి మార్గములో ముందుకు పోనీయకుండా ఏదో ఒకటి అడ్డు వేసి అక్రమ మార్గములో వెళ్లజేసేందుకు అనేక రీతులుగా ప్రయత్నిస్తాడు సాతానుడు. లంచమిస్తేనే పనులు జరుగుతాయని, చెడును చూసీ చూడనట్లు ఉండాలని, చిన్నచిన్న అబద్ధాలు ఆడవచ్చని, అప్పుడప్పుడు అల్లరితో కూడిన ఆట పాటలు ఫర్వాలేదనీ - ఇలా అనేక విషయాలలో సులువుగా చిక్కున పెడతాడు సాతాను. జాగ్రత్త!
ఖడ్గాన్ని సరిగ్గా వాడుట తెలియాలి. లేకుంటే అది మనలనే నరికివేస్తుంది. 1 తిమోతి 6:6-10 ప్రకారము - తృప్తి కలిగిన భక్తి ఉండాలని స్పష్టంగా వాక్యము చెప్తుంటే - అదే చాలా లాభదాయకమని తెలుపుతూ ఉంటే - కొందరు ధనవంతులగుటకు అపేక్షించి శోధనలలోను ఉరిలోను అవివేక యుక్తములును హానికరములైన అనేక దురాశలలో పడుతున్నారు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొంటున్నారు. లోకము ఆశ పెడుతుంది. వాక్యము తృప్తి కలిగి ఉండమంటుంది. దేవుని సేవకులకు ధనాపేక్ష ఉండకూడదు. ఈ ధనాశ అనే బంధకములో వాక్యము తెలియని వారు, తెలిసిన వారు కూడా ఉన్నారు. ముందు ఇటువంటి బంధకాల నుండి విడిపించబడితేనే బంధకములలో ఉన్న వారి కట్లను వాక్య ఖడ్గముతో విడిపించగలము. ఎంతో మంది అనేక రకాలైన బంధకాలలో ఉండి ఎవరు రక్షిస్తారో అని ఆశగా చూస్తున్నారు. అయితే వాక్య ఖడ్గముతోనే ఆ బంధకాల నుండి బయటపడగలరు.
ఎందుకంటే మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గానీ, దేవుని యెదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై యున్నది. వాక్య ఖడ్గముతో సాతానుని ఎత్తులు జిత్తులు పన్నాగాలు అన్నింటినీ ఛేదించవచ్చు. సాతానుని బంధకాలలో ఉన్న వారిని విడిపించవచ్చు.
దయచేసి గమనించాలి. ఇది మనుషుల మధ్య జరిగే యుద్ధము కానే కాదు. అంధకార సంబంధులగు లోక నాథులతోను, చీకటి శక్తులతోను, ఆకాశ మండల మందున్న దురాత్మల సమూహములతోనని తేటగా తెలుసుకోవాలి. మనుషులతో పోరాటము ఆపి, మనకందరికీ శత్రువై మనలను అసత్యానికి పతనానికి నరకానికి దారి మళ్లిస్తున్న సాతానుతో ఆత్మ ఖడ్గమును ధరించి పోరాడుదము. వాక్య ఖడ్గము ధరించుకొని సాతాను బంధకాలను తెగ నరికి మన ముందు ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము.
స్వార్థముతో ధనాపేక్షతో వేషధారణతో దేవుని వాక్యాన్ని బోధిస్తే, అది మనుషులను గలిబిలి చేసి రెండంతలు నరకపాత్రులుగా చేస్తుంది. జాగ్రత్త!
‘వాక్యమై యున్న దేవుడు మనలను సత్యములోనికి నడిపి స్వతంత్రులుగా జీవించటానికి’ కృప చూపునుగాక.

-మద్దు పీటర్ 9490651256