ప్రార్థన

మొద్దు నుంచి చిగురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యెష్షయి మొద్దు నుండి చిగురు పుట్టును. దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును - యెషయా 11:1.
ఈ ప్రవచనము వ్రాసిన తరువాత సుమారు 700 సంవత్సరాలకు నెరవేరింది. సమాధాన సామ్రాజ్యానికి చిగురు మొదలైంది. క్రీస్తు - నీతి సూర్యుడు జన్మించెను.
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించును.
నీతి న్యాయములు బొత్తిగా మోడుబారాయి. ఎండిన మొద్దుల వలె నీతి న్యాయములు కనికరములు లేని రోజులుగా మారాయి. కొంతవరకు నీతి జరుగుతోందిలే అనుకుంటే అది స్వనీతిగానే ఉంది. ఎందుకంటే దేవుని నీతి ముందు మానవుని నీతి మురికి గుడ్డలానే ఉంది. మనిషి ప్రేమ కరుణామయుని ప్రేమ ముందు తేలిపోతుంది.
జీవితాలు స్థిరంగా లేవు. జాలితో ప్రభువు దీనస్థితిలో ఉన్న వారిని కరుణించి ఐగుప్తు బానిసత్వము నుండి కఠినమైన పరిస్థితుల నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశములో ఉంచితే అక్కడ వారి చేష్టలు విర్రవీగినతనము ఎక్కువై పోయింది. చివరకు నాకేంటీ? నేను ఏదైనా చేయగలను. ఎలాగైనా చేయగలను. అసలు దేవుడెందుకు? దేవుని అవసరమేముంది? మా టెక్నాలజీ ముందు ఏదీ సరిపోదు అన్నంత ఎత్తుకు మనిషి ఎదిగానని అనుకుంటున్నాడు. అలా ఎంత ఉన్నత స్థితికి ఎదిగిన ఒకడు తన ప్రాణముతో చెప్పుకున్నాడట. ‘నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము’ అని చెప్పుకోవాలనుకున్నాడట. అది ఎంత వెఱ్ఱితనమో చూడండి. అసలు మన ప్రాణం దేవునిది. అది ఎంతకాలముండాలో నిర్ణయించేది దేవుడు కనుక నీవు ఎంత సంపాదించినా చివరకు లోకమంతా సంపాదించుకోగలిగినా ఒక దినాన దేవుడు నీ ప్రాణమడిగినప్పుడు ఇచ్చి వేయాల్సిందే గదా?! డబ్బు పొలాలు స్థలాలు మణులు మాణిక్యాలు ఎన్ని ఉన్నా ప్రాణాన్ని మాత్రం ఆపలేవు. గర్వం మత్తులో ఉన్నప్పుడు ఇవేవీ అర్థంకావు. ఈ మధ్యనే కేన్సర్‌తో బాధపడుతున్న ఒక స్ర్తి తనకున్న డబ్బును ఒక సంచికలో తెచ్చి డాక్టర్ చేతిలో పెట్టి బ్రతికించమని కోరిందట. వారు కుదరదన్నందుకు ఆ డబ్బును అక్కడే పారవేసి వెళ్లిపోయింది. దేవుడు ఆరోగ్యమిచ్చి ఐశ్వర్యమిచ్చి భద్రపరుస్తూ ఉంటే ఆ దేవునినే మరచిపోతున్నారు. అల్పానందమే జీవిత లక్ష్యంగా ఉన్నారు.
ఎపికూరీయులు - అల్పానందమే వీరి జీవిత లక్ష్యం. రేపు చనిపోదుము గనుక తిందము త్రాగుదము అన్నట్టు ఉంటారు. - ప్రసంగి 2:1లో సొలోమోను వ్రాసుకున్న మాటలు: కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూతును; నీవు మేలు ననుభవించి చూడుమని నేను నా హృదయముతో చెప్పుకుంటిని; అయితే అదియు వ్యర్థ ప్రయత్నమాయెను. వాస్తవానికి ప్రసంగి ఇశ్రాయేలు చరిత్రలోనే మిగుల జ్ఞానము గలవాడును, ఆస్తిపరుడును, ఖ్యాతి గాంచినవాడు, మానవ దృష్టితో చూచిన చేసిన పనులన్నియు వ్యర్థము అని వ్రాశాడు. మానవ హృదయములో దేవుడు నియమించిన ఒక ఖాళీ స్థలము కలదు. దేవుడు తప్ప ఆ ఖాళీ స్థలాన్ని మరేదియు నింపలేదు. అధికారము గానీ, పలుకుబడిగానీ, ధనము కానీ, సుఖము గానీ, ప్రశంస గానీ దానినెన్నటికి నింపనేరవు. దేవుని దృష్టిలో జీవితమునకు ఒక ఉద్దేశము గలదు.
ఒకనాటి సుఖానుభవము సంతోషము యెంచుకొందురు. వారు కళంకములను నిందాస్పదములునై తమ ప్రేమ విందులలో మీతోకూడ అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగముల యందు సుఖించుదురు - 2 పేతురు 2:13.
ఉఔజషఖూళ్ఘశజఒౄ జఒ ఘ ఒకఒఆళౄ యచి ఔ్దజ్యఒ్యఔ్దక ఇ్ఘఒళజూ యశ ఆ్దళ ఆళ్ఘష్దజశఒ యఛి ఉఔజళఖూఖఒ, చ్యిఖశజూళజూ ఘూ్యఖశజూ 307 ఱ.్ళ. నిఆ ఆళ్ఘష్దళఒ ఆ్దళ ళ్ఘఆళఒఆ య్యజూ జఒ ఆ్య ఒళళ యౄజూళఒఆ ఔళ్ఘఒఖూళఒ జశ యూజూళూ ఆ్య ఘఆఆ్ఘజశ ఘ ఒఆ్ఘఆళ యఛి ఆ్ఘఖజిఖజఆజఆక, చిళళజ్యూౄ చ్యిౄ చిళ్ఘూ (్ఘఆ్ఘనజ్ఘ) ఘశజూ ఘఇఒళశషళ చ్యిౄ ఇ్యజూజక ఔ్ఘజశ.
ఈ దినాలలో కూడా అనేక మంది ఈలాగునే ఉన్నారు. ఎప్పటికప్పుడు సంతోషంగా ఉంటే చాలు. చేయవలసిన ముఖ్యమైన పనులు కూడా ఆపి అప్పటికి సంతోషంగా ఉండునట్లు. ప్రభువు కూడా చెప్పాడు. రేపటి గురించి ఆలోచించవద్దని కానీ, ఆ దినపు పనులు ఆపమని చెప్పలేదు. ఏ రోజుకారోజు సంతోషంగా ఉంటే చాలు. రేపటి సంగతి మనకెందుకు? రేపేవౌతుందో అన్నట్టు జీవిస్తున్న వారు కొంతమంది ఉంటే, కొంతమంది నాకేమీ కొదువలేదు. ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అనే తెగ ఇంకొకటి. ఇలా జీవితాలు మొద్దువారినవి. నీతి లేదు న్యాయము లేదు. ఇష్టమొచ్చినట్లు జీవిస్తున్నారు.
చూడండి. ప్రభువును సైన్యముల కధిపతియునగు యెహోవా భీకరముగా కొమ్మలను తెగగొట్టగా మిక్కిలి యెత్తుగల చెట్లు నరకబడును. ఉన్నతమైనవి పడిపోవును. ఆయన అడవి పొదలను ఇనుప కత్తితో కొట్టివేయును. లెబనోను బలవంతుడైన యొకని చేత కూలిపోవును - యెషయా 10:33-34.
దేవుని ఎదిరించే ఎత్తుకు ఎదిగిన కొమ్మలను దేవుడు తెగగొట్టెను. మిక్కిలి ఎత్తుగల చెట్లు నరకబడెను. మొద్దులు మిగిలాయి. ప్రేమగల దేవుడు జాలిగల దేవుడు అప్పటికి వారికి తీర్పు ఇచ్చినా మరలా మరలా ప్రేమను చూయిస్తూనే ఉన్నాడు. ఆదాము అవ్వ దేవుని ఆజ్ఞను అతిక్రమించినా, వారిని నశింప చేయక ఏదేను నుండి బయటకు పంపివేశాడు. కానీ అప్పుడే వారి కోసం రక్షణ పథకం వేసినట్టు బైబిల్ చెబుతోంది. కానీ ఆ మొద్దుతనం మాత్రం మనిషిని వీడలేదు. నీతి న్యాయములు మోడుబారే ఉన్నాయి.
పాపము వలన దేవునితో గల బాంధవ్యము తెగిపోయింది. అయితే త్వరలో వారు శిక్షింపబడ బోవుచున్నారు. అయితే మారు మనస్సు పొందిన కొందరికి దేవుని ఆశీర్వాదము దొరకుతుంది. మెస్సియాను వారి కొరకు పంపుదునని వాగ్దానము దేవుడు చేసెను.
ఆదికాండము నుండి దేవుడు ప్రజలను వారి తప్పులను బట్టి శిక్షిస్తూ క్షమిస్తూ ప్రవక్తల ద్వారా హెచ్చరిస్తూ ప్రేమిస్తూనే ఉన్నాడు. కానీ చివరి ప్రవక్త మలాకీ తరువాత మత్తయి శుభ వార్త వరకు సుమారు 400 సంవత్సరములు దేవుడు వారితో మాట్లాడలేదు. అదే నిశ్శబ్ద కాలము. దేవుడు మాట్లాడితే ఏంటి? మాట్లాడకపోతే ఏంటి? అన్నట్టు ఎవరి ఇష్టానుసారంగా వారు జీవిస్తున్నారు. వారిలో ముఖ్యులు గ్రీకులు. వీరు యుద్ధాలు చేసి చేసి అనేక దేశాలను కైవసం చేసుకున్నారు. క్రీస్తుకు పూర్వమే 336వ సం.లో అలెగ్జాండర్ తన యొక్క 20వ ఏట ప్రారంభించిన తన జైత్రయాత్రలో ఐగుప్తు అష్షూరు బబులోను పారసీకము మొదలగు దేశములను స్వాధీనపరచుకున్నాడు. కేవలము 5 సంవత్సరములలోనే ఇక తాను స్వాధీనపరచుకొనుటకు దేశములు లేనే లేవని బాధపడునంతగా ప్రపంచ వీధులను స్వంతం చేసుకున్నాడు. క్రీ.పూ.332వ సం.లో పాలస్తీనాను స్వాధీనపరచుకున్నాడు. అక్కడనే తనను గూర్చి రెండు వందల సంవత్సరములకు ముందే దానియేలు ప్రవచించాడు అనునది తెలుసుకొన్నాడు. గనుకనే ఆయన విస్తారమైన మంచి కార్యములను యూదులకు చేశాడు. యెరూషలేమును ధ్వంసము చేయకుండుట మాత్రం కాకుండా యూదులు అలెగ్జాండ్రియాలో నివసించుటకు అనుమతి అనుగ్రహించాడు. భవిష్యత్ కాలములో అలెగ్జాండ్రియా పట్టణము యూదుల యొక్క ముఖ్య నివాస స్థలముగా మారినది. ఈ అలెగ్జాండర్ భారతదేశమునకు వచ్చి పంజాబ్‌ను కూడా హస్తగతం చేసుకున్నాడు. అంటే ఇక జయించటానికి ఏ దేశము లేదన్నంతగా యుద్ధాలు చేసిన అలెగ్జాండర్ చివరకు క్రీ.పూ.323వ సం.న జ్వర పీడితుడై మరణించాడు.
దీనిని బట్టి చూస్తే అల్పానందములో జీవించేవారు కొందరైతే, లోకాన్నంతటిని సంపాదించాలని ఆశ కలిగినవారు ఇంకొందరు. ఇలా జీవితాలు నీతి న్యాయాలు లేకుండా ఉన్న సమయములో ప్రవచనానుసారంగా - ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను. అతడు భూమి మీద నీతి న్యాయముల ననుసరించి జరిగించును’ - యేసు జన్మించెను.
ఇంకొక ప్రవచనము: జకర్యా 6:12లో సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా చిగురు అను ఒకడు కలడు; అతడు తన స్థలములో నుండి చిగుర్చును. అతడు యెహోవా ఆలయము కట్టును.
లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు మనమతని చూచి అపేక్షించునట్లుగా అతని యందు సురూపము లేదు- యెషయా 53:2.
ఎన్నోసార్లు క్రీస్తును చిగురుగా, లేత మొక్కగా వ్రాశారు. ఆయన పెరిగినది మాత్రం దేవునిలోనే కానీ, ఆధ్యాత్మికముగా చూస్తే చుట్టూ ఎండిన భూమి అంటే నీతి న్యాయములు లేని స్థలములో నీతి న్యాయములు ఎండిన స్థలములో పెరిగాడు. యేసయ్య ఒక పేద కుటుంబములో దాసుని వలె ఎటువంటి గుర్తింపు లేనివాడుగా పుట్టాడు.
ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు యూదా సీమోను అనువారి సహోదరుడును వడ్లవాడు కాడా? ఇతని సోదరీమణులందరు మనతో నున్నారు కారా? అని చెప్పుకొనుచు అతని విషయమై అభ్యంతరపడిరి. ప్రభువు తానే చెప్పిన మాట నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుటకైనను స్థలము లేదని.
ప్రభువు జన్మిస్తాడని అనేక ప్రవచనాలున్నా, రక్షకుడు జన్మిస్తాడని తెలిసినా అప్పటి ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు మాత్రం ఎటువంటి సిద్ధపాటు లేకుండా జీవిస్తున్నారు. అంతేకాదు ఆయన వాగ్దానాల నెరవేర్పుతో జన్మించిన గాని మోడుబారిన హృదయాలు ప్రభువును ఎరుగక యున్నారు. వారి మధ్యనే జన్మించి ఎన్నో నీతి బోధలు చేసినా నీతికార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసినా గుర్తుపట్టలేనంత మోడుబారిన జీవితాలు జీవిస్తున్నారు. చివరకు లోక రక్షకుని పాపమెరుగని ఆయనను పరిశుద్ధుని పాపిగా గుర్తించిన గ్రుడ్డివారయ్యారు. ఈయన పాపి అని మేమెరుగుదుమని బల్లగుద్ది చెప్పేటంత అంధులయ్యారు. అప్పుడు జీవితమంతా అంధత్వములో ఉన్న పుట్టుగ్రుడ్డివాడు చెప్పిన మాటలు - దేవుడు పాపుల మనవి ఆలకింపడని మనకు తెలుసు. ఎవరైతే దేవభక్తుడై యుండి ఆయన చిత్తాన్ని నెరవేరుస్తారో ఆయన వాని మనవి ఆలకిస్తాడు. చూపు పొందిన గ్రుడ్డివాడు సత్యాన్ని మాట్లాడుతున్నాడు. ఈయన ఎవరో తెలియదు గానీ గ్రుడ్డివాడనైన నేను చూస్తున్నాను. లోకము పుట్టినప్పటి నుండి గ్రుడ్డివాని కన్నులు ఎవరైనా తెరచినట్టు నేను వినలేదు. అయితే ఈయన మనవి దేవుడు ఆలకించి నాకు చూపునిచ్చాడు గనుక ఈయన పరిశుద్ధుడు, దేవుని చిత్తము జరిగించువాడు అని ధైర్యముగా గొప్ప సాక్ష్యమును వారికి చెప్పాడు.
ఇంతకు మించిన గొప్ప గొప్ప కార్యాలు మన జీవితాలలో కూడా జరిగినవి. బంధకాల నుండి విడిపించాడు. బానిసత్వమును తొలగించాడు. ఉన్నత స్థితిలో ఉంచాడు. ఇంకా లెక్కించుకుంటూ పోతే దేవుడు మన పట్ల చూయించిన ప్రేమ ఇంత అంతని చెప్పలేము. అయినా ఈ చూపు పొందిన గ్రుడ్డివానికున్న విశ్వాసము ధైర్యములు లేవు. సాక్ష్యపు జీవితాన్ని జీవించలేక పోతున్నాము. నీతిగా ఉండటానికి శక్తి లేదన్నట్టున్నారు. మనకు సహాయము చేసిన వారిని గుర్తుంచుకోవటం నీతి మరి నీతిహీనత ఎందుకు కలిగిందో అర్థం కావటంలేదు.
ఎటువంటి హంగూ ఆర్భాటము లేకుండా జన్మించిన రక్షకుని అర్థం చేసుకోలేక పోయారు. ఒక రాజు వలెనో లేక గొప్ప ధనికుడులా వో రక్షకుడు వచ్చి పరిస్థితులను చక్కపరుస్తాడు, రోమా సామ్రాజ్యాన్ని వారి బంధకాలను తీసివేస్తాడని ఎదురుచూశారే తప్ప, ప్రభువు వచ్చింది అసలు ఈ బంధకాలకు బానిసత్వాలకు కారణమైన పాపము నుండి విడిపించటానికి అన్న సంగతి అర్థం చేసుకోలేక పోయారు. అప్పటికప్పుడు అప్పులు పోవాలి. ఆరోగ్యం రావాలి. కోరుకున్నవి జరగాలి అన్నట్టు ఇప్పుడు ఎలా ఆరాటపడుతున్నారో, అప్పుడు అంతే ఎదురుచూసి నిరాశ చెందారు. అసలు ప్రభువు వచ్చింది మన పాపముల నుండి రక్షించడానికి, దాని ద్వారా నరకము నుండి తప్పించటానికి, నీతి రహిత జీవితాలలో నీతిని నింపటానికి. నీతిమంతమైన సమాజాన్ని నెలకొల్పటానికి. ఎందుకంటే జీవితాలు ఎంత మోడుబారినవంటే అసలు నీతి అంటే ఏమిటి? సత్యమంటే ఏమిటో తెలియని మొద్దుల్లాటి మనుషుల మధ్య నీతి చిగురు చిగిరించింది. రక్షణ ప్రణాళికను పూర్తి చేసి తన ప్రాణానే్న బలిగా ఇచ్చి, పాపాలకు జీతమైన మరణాన్ని గెల్చి తిరిగి లేచి ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని దివారాత్రులు మన కొరకు విజ్ఞాపనములు చేస్తున్న దేవుడు, అతి త్వరలో రారాజుగానే రానైయున్నాడు. లోక పాపములను మోసికొని పోవు గొఱ్ఱెపిల్లగా వచ్చిన ప్రభువు కొదమ సింహముగా త్వరలోనే రాబోవుచున్నాడు. ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము గొఱ్ఱెపిల్లగా వచ్చి నీతిని స్థిరపరచి, ఇదిగో ఇప్పుడు కొదమ సింహము యూదా గోత్రపు సింహముగా వచ్చి, నీతిని బట్టి తీర్పు తీరుస్తాడు. దీనులకు యధార్థముగా విమర్శ చేయును. తన వాగ్దండము చేత లోకమును కొట్టును. తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్లుగా ఉండును. తోడేలు గొఱ్ఱెపిల్ల యొద్ద వాసము చేయును. చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును. దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగులు కూడి మేయును. వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును. ఎద్దు మేయునట్లు సింహము గడ్డిమేయును.
ఆ దినములలో యూదా వారు రక్షింపబడుదురు. యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసించుదురు. యెహోవాయే మనకు నీతియని యెరూషలేమునకు పేరు పెట్టుదురు.
ఇలా ప్రభువును గూర్చిన ప్రవచనాలు అనేకమైనవి నెరవేరినవి. మిగిలినవి త్వరలో నెరవేరును. ప్రభువు యొక్క ప్రేమను కనికరమును ఆయన మనుష్య కుమారుడుగా రావటాన్ని, మరణమును గెల్చి మనలను రక్షించటానికి, చివరకు యూదా గోత్రపు సింహముగా తిరిగి వచ్చి తీర్పు నిస్తాడనే లేఖనాలను నమ్మటమే మనకు నీతి.
The first time Christ came to slay sin in man.
The second time He will come to slay men in sin.

- మద్దు పీటర్ 9490651256