తెలంగాణ

మల్లన్న గుట్టలపై పోలీసు బెటాలియన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏర్పాటుకు రంగం సిద్ధం ప్రభుత్వం పచ్చజెండా
పరకాల, డిసెంబర్ 31: వరంగల్ జిల్లా గణపురం మండలంలోని గాంధీనగరం-మైలారం మధ్య భూపాలపల్లి-పరకాల ప్రధాన రహదారికి అనుకుని ఉన్న మల్లన్న గుట్టలపై పోలీసుల బెటాలియన్ (శిక్షణ కేంద్రం) ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయినట్లు జెసి ప్రశాంత్ జీవన్ పాటిల్ నుండి బెటాలియన్‌కు గ్రీన్‌సిగ్నల్స్ వచ్చాయని గణపురం తహశీల్దార్ తెలిపారు. అంతేకాకుండా ఈ స్థలాన్ని పోలీసు శాఖ వారు ఎప్పుడు అడిగినా అప్పగించాలని జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ స్పష్టమైన అదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. తెలిపారు. ప్రధాన రహదారి పక్కనే ఉండడం, భవిష్యత్తులో హైవే కూడా అవుతుండడంతో బెటాలియన్ ఏర్పాటుకు స్థలం అనువుగా ఉంటుందని పోలీసు ఉన్నతాధికారులు భావించారు. దీంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జిల్లాలో తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ బెటాలియన్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.
143 ఎకరాలు కేటాయింపు...
బెటాలియన్ కోసం 205 సర్వే నెంబర్‌లో సుమారు 250 ఎకరాల స్థలం ఉండగా ఇందులో 143 ఎకరాల స్థలంను బెటాలియన్ కోసం కేటాయించినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. భూపాలపల్లి-పరకాల ప్రధాన రహదారికి కేవలం అర కిలోమీటర్ దూరంలోనే మల్లన్న గుట్ట ఉంది. సుమారు 50 కిలోమీటర్ల ఎత్తులో ఉండే ఈ స్థలాన్ని గత ఏప్రిల్ 25న ఎస్పీ అంబర్ కిషోర్‌ఝా పరిశీలించి పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో డిజిపి జూన్ 22న గుట్టలను పరిశీలించారు. దీనిపై సుమారు ఆరు నెలలపాటు కసరత్తు జరిగింది. అనంతరం ఈ స్థలం బెటాలియన్‌కు అనువైందని అధికారులు భావించారు. ఇందులో 143 ఎకరాల స్థలం బెటాలియన్‌కు అనుకూలంగా ఉంటుందని రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి నివేదిక కూడా అందజేశారు. దీంతో మల్లన్న గుట్టకు వెళ్లే ప్రధాన రహదారి 50 మీటర్ల ఎత్తులో ఉండగా వెనుకవైపు వంద మీటర్ల పైభాగంలో గుట్ట కనిపిస్తుంది. ఇక్కడ ప్రతి శివరాత్రికి మల్లన్న దేవునికి భక్తులు జాతర నిర్వహిస్తారు, పలుమార్లు సర్వే చేయించి అనువైన స్థలాన్ని నిర్ణయించి నివేదికలు పంపించడంతో జిల్లా కలెక్టర్ ఆమోదించినట్లు అధికారులు తెలిపారు. గతంలో జిల్లాలో మామునూర్, మడికొండ ప్రాంతాల్లోనే ఇలాంటి పోలీసు శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. తాజాగా ఆ జాబితాలోకి వరంగల్ జిల్లా గణపురం మండలం చేరనుంది.