ఆంధ్రప్రదేశ్‌

నవంబర్ నుంచి పోలవరం పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: వరదల కారణంగా నవంబర్ వరకు పోలవరం పనులు చేయలేని పరిస్థితి నెలకొన్నదని, నవంబర్ నుంచి డిజైన్ ప్రకారం పనులు చేస్తామని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఆయన గుంటూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు పారదర్శక టెండరింగ్ ద్వారా 780 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో మ్యాక్స్ కంపెనీకి అధిక ధరలకు ఇచ్చారని, అదే సంస్థ 12.5 శాతం తక్కువ ధరతో ముందుకు వస్తే సింగిల్ బిడ్డింగ్ ఎలా ఇస్తారని విమర్శిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గంతో పాటు తక్కువ ధరకు చేస్తామని ముందుకు వస్తే నష్టం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. అధిక ధరకు వెళ్లిన వెలుగొండ ప్రాజెక్టుకు కూడా రివర్స్ టెండరింగ్‌కు వెళతామని పునరుద్ఘాటించారు.