జాతీయ వార్తలు

పీటర్ ముఖర్జియాకు సత్య శోధన పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 28: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసుకు సంబంధించి ఆమె సవతి తండ్రి పీటర్ ముఖర్జియా (60) చెబుతున్న వివరాల్లో నిజమెంతో తెలుసుకునేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) శనివారం ఆయనకు పాలిగ్రాఫ్ (సత్య శోధన) పరీక్ష జరిపించింది. న్యూఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (సిఎఫ్‌ఎస్‌ఎల్)లో శనివారం ఉదయం ఈ పరీక్ష నిర్వహించారు. సిబిఐ అధికారులు ముందుగానే అందజేసిన ప్రశ్నావళిని ఆధారంగా చేసుకుని ఫోరెన్సిక్ నిపుణులు ఈ పరీక్ష నిర్వహించారని, పరీక్ష జరిగినప్పుడు ఆ గదిలో శాస్తవ్రేత్తలు, పీటర్ మాత్రమే ఉన్నారని సిబిఐ వర్గాలు తెలిపాయి. పీటర్ ఇచ్చిన సమాధానాల్లో కొన్ని అబద్ధాలు ఉన్నట్లు ఈ పరీక్షలో స్పష్టమైందని, అయినప్పటికీ ఈ పరీక్షకు సంబంధించిన నివేదిక అందే వరకూ తాము తుది అభిప్రాయానికి రాలేమని సిబిఐ వర్గాలు స్పష్టం చేశాయి. షీనా బోరా హత్య కేసుకు సంబంధించి పీటర్ ముఖర్జియా ఇప్పటికే పలుమార్లు మాట మార్చి పొంతనలేని సమాధానలు ఇస్తుండంతో ఆయనకు సత్య శోధన పరీక్ష నిర్వహించాల్సిన అవసరం ఏర్పడిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.