జాతీయ వార్తలు

భారీ వర్షంలోనూ పవార్ ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: మహారాష్టల్రో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. నేటితో ప్రచారానికి తెరపడుతుండటంతో నేతలు ప్రచారం ముమ్మరం చేశారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ సతారా ఎన్నికల ప్రచారం చేస్తుండగా భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. పవార్ తనను క్షమించమని కోరుతూ.. వర్షం శుభ సూచకం అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. వర్షంలో తడుస్తూనే ప్రసంగించారు. వయసును లెక్కచేయకుండా ఆయన ప్రసంగించటం చూసి అక్కడకు వచ్చినవారు సైతం వర్షంలో తడుస్తూ ఆయన ప్రసంగాన్ని విన్నారు. సతారాలో ఎన్సీపీ చరిత్ర సృష్టిస్తుందని ఈ సందర్భంగా పవార్ చెప్పారు.