పఠనీయం

ఆలోచింపచేసే కథలివి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జన్నాభట్ల కథలు
5వ సంకలనం
మూల్యం: రూ.200/- లు.
ప్రాప్తిస్థానం
జన్నాభట్ల నరసింహప్రసాద్
ఇం.నెం.1-108, ఫ్లాట్‌నెం.7 అరవిందనగర్
*
ఈ కథాసంకలనంలో పనె్నండు కథలున్నాయి. కొన్ని కొంచెం పెద్దవి. ఇంకొన్ని చిన్నవి. రచయిత శైలి స్వాదుపు, నిరలంకారము, సామాజిక ప్రయోజన కాంక్షితం. ఆవేశం, ఆవేదన, దేశభక్తి, మాతృదేశ ఉజ్జ్వల భవితానురక్తి ఈ కథలల్లో దీపిస్తున్నాయి. ఈ కథల వస్తువు, విన్యాసము, లక్ష్యసిద్ధి, చిత్తశుద్ధి గూర్చి ప్రస్తావించాలంటే పరిణిత వాణి, అని ప్రసక్తి చేస్తే కథావస్తు, శిల్ప నైపుణ్యాలకు పూర్తి సమన్వయం సాధించినట్లు అనిపిస్తుంది.
తెలుగు కథకు ఉరామరగా 120 సంవత్సరాల చరిత్ర ఉంది. తెలగు కథ ప్రభవించటమే సామాజిక ప్రయోజన లక్ష్యంతోను, సాంఘికాదర్శ ధ్యేయం తోనూ ఆవిర్భవించింది. బహుశా ఆధునికార్థంలో తెలుగుకథ రూపుదిద్దుకునే పరిణామంలో ఇప్పటికీ పదివేల కథలపైనే వచ్చి ఉంటాయి. వేయిమంది కథారచయితలైనా లెక్కకు వస్తారు.
అయితే సమాజంలోని నూత్నతలు, వినూత్నతలు, తెలుగు కథను నూట ఇరవై ఏళ్లుగా దిద్దితీర్చుతూనే ఉన్నాయి. సమాజ హితాన్ని ఆసాంతం దృష్టిలో పెట్టుకుని వచ్చిన మొదటి కథ ‘దిద్దుబాటు’ కదా. అది గురజాడ అప్పారాయ స్వయజ్ఞం. కనుక తెలుగు కథానిక రచన మొదటి నుంచీ మనోజ్ఞము, సాంఘిక సదుపదేశమూ దిద్దుకుంటూ వస్తున్నదనే చెప్పాలి. ఆశ్చర్య జనకమూ, ఆనందకరమూ అయిన విషయం ఏమంటే ఉత్తమ సాహితీవేత్తలు, వేద పండితులు అయిన రచయితలు కూడ తెలుగుకథ వికాసం పట్ల విణ్నాణం పట్ల మోజు చూపారు. కైసేతులకు ముచ్చట పడ్డారు.
జన్నాభట్ల నరసింహప్రసాద్ తెలుగు సమాజపు భూతభవిష్యద్వర్తమానాలకు చెందినవి కావటం హృద్యం. ఆయన ఎంచుకున్న కథావస్తువు ప్రబోదాత్మకం. సున్నితమైన హాస్యాన్ని, వ్యంగ్యాన్ని, అధిక్షేపాన్ని కూడా వీరి కథలలో మనం చూస్తాం. ముఖ్యంగా ఆధునిక సమాజంలో కుటుంబ సమస్యలు, సంఘర్షణలు, సమన్వయాలు వీరి కథల ద్వారా సూచితం. ఆచార్య ముదిగొండ శివప్రసాద్ ప్రసిద్ధ సాహితీవేత్త ‘సుధామ’ విలువైన పరిచయాలు చేకూర్చారు. ఈ కథలకు పెట్టిన పేర్లు చాలా ఆకర్షికం ఉన్నాయి.. దూరశ్రవణ, భవిష్యద్దృశ్యం అనే విభ్రమాత్మక దృశ్య, శ్రవణ సంఘటనలు ఈ కథలను ఆసక్తికరంగా పాఠకులచే చదివిస్తాయి.

- అక్కిరాజు రమాపతిరావు