పఠనీయం

ప్రేమమయి, అమృతమయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిదురించే తోటలోకి..
రచన: మనె్నం శారద,
వెల:రూ.150, ప్రతులకు: జ్యోతివలబోజు, అన్ని పుస్తక కేంద్రాలు, ఫోన్:8096310140
===============================================================
‘‘హృదయం సముద్రంలా ఘోషించింది’’, ప్రేమ ఝరి వెల్లవై సుడులు తిరుగుతూ, కన్నీరై కళ్ళకి చేరేముందే ఆవిరైపోయింది’, ‘‘ప్రేమ రాహిత్యమైన పెళ్లి’’, ‘‘హృదయానికి దగ్గరకి రాని తతంగం, పులకింత లేని ఒక సమాగమం’’- ఇలాంటి బరువైన అక్షర చిత్రాలను ఒక్క మనె్నం శారదగారే సృష్టించగలరు. కారణం? మూడు దశాబ్దాల పరిపక్వత గల రచనలు చేసిన అనుభవం వారికి ఉంది గనుక! రాసిన ప్రతి నవలలోను కథలలోను ఆమె సృష్టించిన పాత్రలు జీవిస్తాయిగనుక! లోకం తీరునీ, పోకడనీ, మనసులో నింపుకున్నారు గనుక!!
ప్రస్తుత నవల ‘‘నిదురించే తోటలోకి..’ ఒక కమ్మని పాటలా పాఠకుడి హృదయానికి తాకుతుంది. నాయిక, నాయకులు అనుక్షణం కష్టాల కడలిలో ఈదుతూ, మరునాడు ఏం జరుగబోతోంది? వారితో ఇంటర్‌యాక్ట్ అయ్యే పాత్రలు వారిని ఎలాంటి కష్టాలకు గురిచేస్తారో.. అన్న ఉత్కంఠ పాఠకులలో కలుగచేస్తూ వారితో ఏకబిగిన ఆసాంతం చదవ చేస్తుందీ నవల.
జీవితాల్ని అతి దగ్గరి కోణాల్లోంచి చూస్తూ రాస్తూనే నేటి కాలానికి ఈ నవల ఒక ఆటవిడుపు. పాఠకులను మళ్లీ 1950-60 మధ్యకాలంలో వచ్చిన నవలా లోకానికి తీసుకువెళ్తుంది.
హేమంత్ అనే ఒక చాకులాంటి యువకుడు తన ప్రతిభకు సరిపోని ఉద్యోగం చేస్తుంటాడు. అన్ని ఆఫీసుల్లో ఉండే అసమర్థత, రాజకీయాలు, ఆశ్రీత పక్షపాతాలూ ఆ ఆఫీసులోనూ ఉంటాయి. హేమంత్ బాస్ రమేష్‌కు ఉండాల్సిన అన్ని అవలక్షణాలు ఉంటాయి. ఒకనాడు హేమంత్‌కు వరూధిని అన్న యువతితో పరిచయం అవుతుంది. వరూధిని నిజంగా పెద్దనగారు వర్ణించిన వరూధిని అంత అందం, అందంతో పోటీపడుతూ మంచితనం ఉంటుంది. డైవోర్సీ వరూధినికో కూతురు, విడాకులైనా శనిలా వదలని భర్త ఉంటాడు.
హేమంత్‌ది ఓ పెద్ద కుటుంబం. తల్లి గతిస్తుంది. తండ్రి సినిమాల్లో కనిపించే విలన్‌లా ప్రవర్తిస్తుంటాడు. ప్రేమరాహిత్యంతో బాధపడే హేమంత్ వరూధినితో ఒకరిలో ఒకరు ప్రేమను చూసుకుని దగ్గరవుతారు. ఇద్దరి ఎదరంతా ఎడారే! ఆ ఎడారిలో ఒయాసిస్సులా సరోజిని వీరిద్దరి ప్రేమను, ఆ ప్రేమలోని స్వచ్ఛతను గమనించి వీరిద్దరినీ పెళ్లి అనే బంధంతో ముడివేయాలని ప్రయత్నిస్తుంది.
రమేష్ (బాసు) చక్రవర్తి(వరూధిని మాజీ భర్త) పద్మ (హేమంత్ కొలీగ్), మమత (వరూధిని క్లాసుమేటు), సుందరం (హేమంత్ తండ్రి) లాంటి గుంటనక్కలమధ్య వీరిద్దరి ప్రేమ సఫలం అవదు సరికదా - వరూధినిని కాకుండా హేమంత్ మరో అమ్మాయిని పెళ్లాడవలసి వస్తుంది. ప్రేమోపహతురాలు, దైవోపహతురాలు అయిన వరూధిని హేమంత్ ఒడిలో తుదిశ్వాస విడుస్తుంది.
ఒక సినిమా కథకు ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్న ఈ నవల ఆద్యంతమూ సస్పెనే్స! హేమంత్, వరూధినిల ప్రేమ అలా సఫలం అయింది అనుకునేలోగా మరో అవాంతరం వచ్చిపడుతుంది.
కౌముది అనే అంతర్జాల పత్రికలో ధారావాహికగా మూడు సంవత్సరాలు వచ్చి, పాఠకులను అలా సీటుకొసన (ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ ది సీట్) కూర్చోబెట్టేదట ఈ నవల. స్ర్తిని ప్రేమమూర్తిగా, మాతృమూర్తిగా, పురుషుడి ఆవేదనలో స్వాంతన ఇచ్చే చల్లని ఒడిలా, అతి ఉన్నతంగా చిత్రీకరించిన నవల ఇది. కథాగమనం శిల్పం ఉత్కంఠతో సాఫీగా సాగించటంలో శారదగారు చూపించిన ప్రతిభ అద్వితీయం, అమోఘం.

-కూర చిదంబరం 8639338675