పఠనీయం

సమర్థురాలి అంతరంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసమర్థురాలి అంతరంగం-
చిన్న కథలు ఆలోచనలు-రచన /సంకలనం:రజనీ సుబ్రహ్మణ్యం, వెల:రూ.150/-, ప్రతులకు:జ్యోతి వలబోజు.
సెల్ నెం.8096310140
==========================================================
‘పండితపుత్రుడు పరమ శుంఠ’ అని ఏ సందర్భంలో అన్నారో తెలియదు కాని ఒక పండితుని పుత్రుడు /పుత్రిక, తండ్రి అడుగుజాడల్లో నడిచి తానూ, కొంత పాండిత్యాన్ని ప్రదర్శించే అవకాశం ఉంటుంది. జీవశాస్తవ్రేత్తలు దీన్ని ‘జీన్స్’ ప్రభావంవల్ల అంటారు.
కారణాలు ఏవైనా, ఒక వేద పండితుడి కొడుక్కు వేదం బాగా చదవగలిగే అవకాశం ఉంటుంది. ఒక చెప్పులు కుట్టే చర్మకారుడి కొడుకు తానూ చెప్పులు కుట్టే కళని అలవర్చుకోగలడు.
త్రిపురనేని రామస్వామి చౌదరి సంస్కృతాంధ్ర భాషల్లో పండితుడు, గొప్ప హేతువాద రచయిత. చౌదరిగారి అబ్బాయి త్రిపురనేని గోపీచంద్. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న గొప్ప మనోవిశే్లషకుడు. ఆయన గతించి సుమారు డెబ్భై ఏళ్ళు అయ్యాయి. పదహారేళ్ళ వయసు నుండే రాయటం మొదలుపెట్టి తెలుగు సాహిత్యానికి ‘అసమర్థుడి జీవయాత్ర’, ‘చీకటి గదులు’, ‘పండిత పరమేశ్వరశాస్ర్తీ వీలునామా’ లాంటి గొప్ప నవలలు- నిత్యనూతనంగా కనిపించే నవలలు రాశారు. గోపీచంద్ మరియు కొడవటిగంటి కుటుంబరావుగారలు తెలుగు సాహిత్య లోకానికి ‘వేగుచుక్క’ల వంటివారు. సమకాలీన సాహిత్య ప్రపంచంలో భీష్మ పితామహ అనదగ్గ శ్రీ విహారిగారు గోపీచంద్ గారి రచనలు ‘సాధారణంగా కనిపిస్తూ, అసాధారణంగా ప్రవహించే జ్ఞానగంగ గోపీచంద్ రచనలు’ అనటంలో ఏ మాత్రమూ అతిశయోక్తి లేదు.
గోపీచంద్ గారి పుత్రిక రజనీ సుబ్రహ్మణ్యం. తండ్రి ఆటిట్యూడ్‌ను చిన్ననాటినుండే గమనిస్తూ, అనుసరిస్తూ, అడపాదడపా రాస్తూన్నారు. ప్రస్తుత సంకలనం ‘అసమర్థురాలి అంతరంగం’లో రచయిత్రి రాసిన 10 కథలు, 3 అనువాదాలు, 7 వ్యాసాలున్నాయి.పది కథలూ చిన్న కథలే! వీటిని బహుశా కథలు అనటం కంటే రచయిత్రి అంతరంగంలో ప్రతిఫలించిన ‘ఆలోచనలు’ అనటం సబబు అనుకుంటాను. ఆడపిల్ల ఒంటరిగా రైలు ప్రయాణం చేయాల్సి వస్తుంది. బహుశా, అదే మొదటి రైలు ప్రయాణం కావచ్చు. జాజి (కథలోని పాత్ర) మనసును భయం, ఆరాటం, కంగారు ఆవహిస్తాయి. దానికితోడు జాజి సోషియాలజీ చదవటంతో ప్రతివాళ్ళ ప్రవర్తన నిశితంగా పరిశీలించటం చెడుని తలచి భయపడటం ఆమెకు అలవాటైపోయింది.
ప్రయాణంలో ఓ పేరు తెలియని వింత ప్రవర్తనగల మనిషి పరిచయం చేసుకుంటాడు. జాజి అతని గురించి ఎన్నో భయంకరమైన ఆలోచనలు పెంచుకుంటూ నిద్రపోతూంది. తెల్లవారుతుంది. ఏ విశేషమూ లేకుండానే జాజి గమ్యం చేరుతుంది. మరో కథ (ఓటమి)దేవిక వేణు దంపతులు. గోపీచంద్ రాసిన చీకటి గదుల్లోని కళ్యాణ కింకిణిలా దేవిక తనను తాను ఊహించుకుంటుంది. భర్త ఈసడింపులు దేవికకు నచ్చవు. అయినా గులాబీ రంగు చీర కట్టుకున్న దేవిక భర్త ఇష్టానుసారం బ్లూకలర్ శారీ కట్టుకోవటానికి సన్నద్ధురాలవటంతో కథ ముగుస్తుంది. ఇలాంటి కథలే మిగతావీను. మూడు అనువాద వ్యాసాల్లో మూడవది అయిన ‘వ్రాయటం ఎలా’ వ్యాసంలో మూలరచయిత కాట్రగడ్డ గోపీచంద్ రాసిన ఇంగ్లీషు వ్యాసానికి తెలుగు అనువాదం చేశారు రచయిత్రి. మిగిలిన ఏడు వ్యాసాల్లో రచయిత్రి తన తండ్రి గురించి, తండ్రిని గురించిన జ్ఞాపకాలు ఇచ్చారు. 120 పేజీలున్న ఈ చిన్ని సంకలనంలో రచయిత్రి రజనీగారు అతి సమర్థవంతంగా, తన అంతరంగాన్ని మనతో పంచుకున్నారు. ఒక ప్రఖ్యాత రచయిత కూతురిగా, తండ్రిని ఎలా చూసింది అన్న కోణంలోంచి వ్రాసిన ఈ వ్యాసాలు ఎంతో ఆసక్తికరంగా సాగుతాయి. అవును.. ఒక మేలిమి వజ్రం గురించి ఎవరు రాసినా బావుంటుంది.

-కూర చిదంబరం 8639338675