పఠనీయం

‘‘32 బ్రహ్మవిద్యలు’’ సులభరచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్వాత్రింశత్ బ్రహ్మవిద్యలు
వివరణ అనువాదం
డా. కిడాంబి నరసింహాచార్య
వెల: రూ.226/-లు
ఇం.నెం. 3-13-102/1 వీధి నెం.1
శ్రీనివాసపురం -రామాంతాపూర్
హైదరాబాద్ -13
చరవాణి 9866828404
శ్రీమాన్ టి. పార్థసారథి
చరవాణి : 9393484709
*
త్రిమతాచార్యుల ప్రతిభాలోకనఫలంగా వెలువడిన భాష్యత్రయం. ఎంతో గొప్పవనేది మనకు తెలియని విషయంకాదు. వీరుమువ్వురూ జీవేశ్వర సంబంధం ‘సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ’ అనే వేదసూక్తి విషయంలో చేసిన వాదోపవాదాలు - సిద్ధాంతాలు - వారి మేధాశక్తికి ప్రతిరూపాలు. ఈనాడు మనం ఆచార్యత్రయం వారందించిన భాష్యవిషయాలను గ్రహించటానికి ఎంతో శక్తి గల వారమైతేనే సాధ్యం అయ్యే వేదాంత విద్యను ఆయుర్వేద ఔషధం వలె గ్రహించి సంతృప్తి చెందినామనిపించే ఈ దశలో పెద్దలు ఎందరో సులభరీతి ప్రవచన పద్ధతిని గ్రంథ రూపంగా అందించి ఎంతో మేలు చేసినారు.
ఈ పరంపరలోనే ఇటీవల(2019) వెల్వడింది - డా. కిడాంబి నరసింహాచార్య స్వామి వారి ‘ద్వాత్రింశత్ బ్రహ్మవిద్యలు’ అనే గ్రంథం. ఇది బహిరంతశ్శుద్ధితో -ముద్రాదోషాలు లేకుండా సులభ శైలివివరణ గల్గి పాఠక జన సంతృప్తిని కలిగించే రీతి గల రచన.
శ్రీమద్రామానుజుల వారి శ్రీభాష్యంలోని సంబంధి అధికరణాల అనువాదమైన దీంట్లో ఇతః పూర్వం ఇదే విషయం పై వచ్చిన మహానుభావుల రచనలను వారి అభిప్రాయా భేదాలను ప్రారంభంలోనే ఎంతో జాగ్రత్తగా వివరించిన కిడాంబి వారి వాదరహిత అభిప్రాయ వ్యక్తీకరణ ప్రశంసా పాత్రం. ఈ విద్యలు 32 లేదా 40. అనేవి ఒక వాదం. వీటిని ఎవరెవరు ఎట్లా ముఖ్యంగా బ్రహ్మసూత్రాల ద్వారా బాదరాయణుడు తెల్పిన ద్వాత్రింశత్ (32)బ్రహ్మవిద్యలు - ఇవి అని నికరంగా నిర్థారణం చేసిన శ్రీమాన్ ఉత్తమూరి వీరరాఘవాచార్యులవారు. శ్రీమాన్ కె.ఎస్. రామానుజాచార్య మహోదయుల ‘పట్టిక’ నామభేదాలను 4 పుటల్లో సూచించి తమ పరిశోధనాపటిమను పరిస్ఫుటం చేసిన ఈ గ్రంథకర్త అధికరణాలకు సులభశైలి తెలుగులో మరొక శీర్షిను చేర్చినారు. ఉదా19, ‘సంవర్గవిద్య’ (అపశూద్రాధికరణము) 20 అజాశరీర బ్రహ్మ విద్యశే్వతాశ్వతర విద్య. (చమసాధికరణము) ఇట్లా ఆయా 32 విద్యల శీర్షికలను తెల్పి- సహజ సుందర శైలీవిన్యాసంతో వివరణ రచించటం వీరికి గల ఉభయ భాషాసాహిత్య శక్తుల నిరూపణ, అంతేకాక - ఆచార్య సన్నిధి యందు శ్రీభాష్యాది సంప్రదాయ గ్రంథ విషయ సేవనం (కాలక్షేపం -బోధన) చేసి పరిణత ప్రజ్ఞా సమన్వితులైన వీరు తదనుగుణంగా దీన్ని సిద్ధం చేసినారు. జటిల వేదాంత విషయాలను ఇంతకన్నా సులభశైలిలో తెల్పటం అసాధ్యం. మన వాడకంలో ఏదైనా కఠిన విద్యాభ్యాసం చేయటమో! విద్యాసంబంధ విషయంలోనో ‘ఇదేంబ్రహ్మ విద్య’ నా అంటారు. ఇది ఆ 32 బ్రహ్మ విద్యల విషయం. అంటే ఆ వ్యక్తి తనకు పరిచయంలేని ‘బ్రహ్మవిద్య’లను ఒక సామాన్యమైన సామెతగా వాడటం ఆవిద్య యొక్క వ్యాప్తి లేదా ప్రత్యేకత అని గ్రహించవచ్చు. శ్రీమాన్ కిడాంబివారు గ్రంథ ప్రారంభంలో ఇంతకుముందు 32 బ్రహ్మవిద్యల గూర్చి గ్రంథ రచన చేసిన వారి వివరాలను ముద్రణ సంవత్సరాలనిచ్చి ఇట్లా గొప్ప సమాచారాన్ని చేర్చినా- ఎందుకోగాని వీరి వీక్షణంలో - శ్రీమాన్ మరింగంటి సీతారామానుజాచార్య(ఖమ్మంజిల్లా , కల్లూరు) రచన ‘32 బ్రహ్మవిద్యలు’ తప్పిపోయింది. సీతారామనుజాచార్య స్వామి వారు జూనియర్ కళాశాల లెక్చరర్ గా పనిచేసినారు. సంస్కృతాంధ్ర ఆంగ్ల విద్యలల్లో నే గాక సంప్రదాయ విద్యలలోనూ గరీయః ప్రతిభులు ఈ పుస్తకం 1970 ప్రాంతంలో ముద్రణ మయింది. నాపరిశోధన సమయంలో వీరి గ్రంథాన్ని నేను చూచే భాగ్యం కల్గలేదు కాబట్టి దీని విషయం ‘మరిగంటి కవుల సాహిత్యం’ లో లేదు. ఇదంతా ఎందుకు తెల్పడం అంటే చాలాకాలం నాడే మన తెలంగాణలో మారుమూలయందున్న మహాప్రతిభావంతులు గొప్ప గ్రంథరచన చేసినారని గ్రహించటానికీ ఇంకా ఈ కిడాంబివారు కృతి ప్రారంభంలో గురుస్తుతిని చేసి - సుగ్రహీత నామధేయులు విద్యా పాథోథులైన శ్రీమాన్ సముద్రాల వెంకట రంగరామానుజాచార్యులు, కందాడై రామానుజాచార్య స్వామి, కండ్లకుంట వేంకట నరసింహాచార్య మహోదయుల నుండి వెల్వడిన గొప్ప భావనాలహిరిని చేర్చి పాఠకులకొక మార్గాన్ని చూపినారు. వీటితో పాటు స్వవిషయం గురుస్తుతులను దాదాపు 30 పుటలలో విశదీకరించినారు. అంతరాదిద్య విద్యలోని ‘యతోనాఇమని....’ వివరణ (41పు) అపరావిద్య (91పు) ‘్భమావిద్య’లో ‘సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ’ (109పు) ‘దహర విద్య’(పు122) వీటి వివరణలే కాదు 32 విద్యల వివరణలోను ఆచార్యులవారు దీన్ని వేదాంత విషయ గ్రంథం వలె భావించటానికి వీలులేని సులభ శైలీ సమాయుక్త బహు విషయ పరిపుష్టరచనగా సిద్ధం చేయటం వీరికి గల చిరంతన కాల ‘బోధానానుభవం’ విషయవైవిద్య గ్రంథరచనానుభవం. ఆచార్యసన్నిధి శాస్త్ధ్య్రాయనం మొదలైన వాటి వలన ద్వాత్రింశత్ బ్రహ్మవిద్యల గ్రంథం అద్భుతంగా తయారైంది. గ్రంథం చివర్లో చమధికరణంలోని -‘ సంయోగోవిప్రయోగశ్చ...’ ఇత్యాది శ్లోక వివరణ చాలా బాగున్నది.
ముఖ పత్రం శ్రీమద్రామానుజ చిత్రాలంకృతం కాగా లోపల కవిశాబ్దిక కేసరి. న.చ.రఘునాథాచార్య స్వామి వారి చిత్రాన్ని చేర్చటం ఆచార్యుల వారి శేముషీభక్తిరూప ప్రతీక. శ్రీమాన్ నరసింహాచార్య స్వామి వారు చాలాకాలం క్రితం తిరునామ సాహిత్యాన్ని అందించి సాహితీ లోకానికి చేసిన మేలు కన్నా, ఈ ద్వాత్రింశత్‌బ్రహ్మ విద్యలు మరింత విశేషం కలిగినట్టివి. ఈకృషి శ్రీభాష్య వివరణ గ్రంథ పరంపర యందు మిక్కిలి రాణించగలదని ఆశింతాం.

- శ్రీరంగాచార్య 9299451266