పఠనీయం

రూపం దాల్చిన ఆశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఉదయం నాది
(కథల సంపుటి)
దేవరకొండ గంగాధర రామారావు
21-4-10/1, జిఎఫ్-1,
సత్యసాయి టవర్స్, తణుకువారి వీధి,
తణుకు-534211, వెల: రూ.150/-
*
ప్రఖ్యాత కవి దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారి తమ్ముడే దేవరకొండ గంగాధర రామారావుగారు. తణుకు రచయితల సంఘం తరంగం స్థాపకులలో రామారావు ప్రముఖులు. 1965లో ‘వ్యక్తావ్యక్తం’ కథతో రచనా వ్యాసంగం మొదలిడి ‘కలల వల’ కథల సంపుటి వెలువరించారు. వృత్తిపరంగా ఆయన న్యాయవాది. ఒక వంక సాహితీ వ్యాసంగాన్ని మరో వంక సామాజిక, ఆధ్యాత్మిక, రాజకీయ విషయాలపై విమర్శనాత్మక రచనలనూ చేశారు. దాదాపు నాలుగు దశాబ్దాలు ఇండయన్ ఎక్స్‌ప్రెస్‌లోనూ పలు తెలుగు దినపత్రికలలోనూ ‘లెటర్స్ టు ది ఎడిటర్’ కాలమ్‌కు అనేక అంశాలపై ఆయన రాసిన లేఖలు ప్రచురితమవుతూ రావడం ఒక రికార్డ్.
ఈ ఉదయం నాది అనే ఈ కథల సంపుటిని తలపెట్టి పూర్తికాకుండానే కీర్తిశేషులైన దేవరకొండ గంగాధర రామారావు ప్రథమ వర్థంతి సందర్భంగా వారి కుమారులు సత్యనారాయణమూర్తి ఈ గ్రంథాన్ని వెలువరించడం తండ్రిగారి ఆశను సాకారం చేయడమే! రామారావుగారి 32 కథలు, దావాదండకం అనే పేరడీ రచన, దగాపడిన గిరీశం అనే సాహిత్య విమర్శ ఈ సంపుటి సంతరించుకుంది. ప్రఖ్యాత కథా రచయిత కీ.శే. మునిపల్లె రాజుగారు ‘కోస్తనీ నదీ తీర ప్రతిభా క్షేత్రంలో వినిపించిన మానవ జీవన వాస్తవాలు’గా ఈ కథలను ప్రశంసిస్తూ ముందుమాట రాశారు. శ్రీశ్రీ కోవకు చెందిన తాత్విక తార్కికునిగా, తిలక్ వారసత్వపు భావుకునిగా రామారావుగారిని పేర్కొంటారు మునిపల్లె రాజుగారు. ‘ఈ ఉదయం నాది’ కథ ఏ స్ర్తివాద మిలిటెంట్ రచయిత్రి అయినా రచించలేనిదేమో!
‘ఇదే న్యాయం’ కథ ఫ్యూడల్ వ్యవస్థ స్వరూపాన్ని బహిర్గతం చేసే బలమైన కథ. ‘కుక్కలు’ కథలో అవినీతి ఎత్తుగడలను విపులీకరించడం చూస్తాం. ‘ఆమె కల కరగనీయకు’ దారిద్య్ర దుఃఖ అస్తిత్వ వేదనను దృశ్యమానం చేస్తుంది. ‘పీచే క్యాహై’, ‘చీరసాగర మథనం’, ‘లే(డీస్)టెస్ట్’, భారత్‌‘మమీ’ లాంటి కథలు ఆకట్టుకుంటయి. సునిశిత విమర్శ, వ్యంగ్యకు ఆటపట్టయిన మంచి కథల మాగాణం ఆయన. దేవరకొండ గంగాధర రామారావుగారి కథల సంపుటిని ఈ రూపేణా పాఠకలోకానికి అందించిన దేవరకొండ సత్యనారాయణమూర్తిగారు అభినందనీయులు.
*
-సుధామ