పఠనీయం

దేశభక్తి ప్రబోధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బహురూపి గాంధీ రచయత : అనుబందోపాధ్యాయ తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు) ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక, సికింద్రాబాద్-17.. 94907 46614
=======================================================
‘‘మన లైంగిక దృష్టికోణాన్ని వదుల్చుకోవాలి. పిల్లలకు ప్రమాద అవకాశాలను ఎదుర్కొనే అవకాశమివ్వడానికే నేను మొగ్గుచూపుతాను. మరీ గాజుబొమ్మలలాగా సంరక్షించడం మంచిది కాదు’’. బాల బాలికల మధ్య దుష్ప్రవర్తనకు సంబంధించిన సమస్య ఏదైనా తలెత్తితే గాంధీ పరిశుద్ధ ఉపవాసాన్ని ఆశ్రయించేవాడు.
నూలు వడకటంతోపాటు, పత్తి ఒలవడం, ఏకులు తయారుచేయడం కూడా నేర్పేవారు. ఆ విధంగా ఏదో ఒక వృత్తిపని నేర్చుకుంటూ తమ చదువుకు సంబంధించిన ఖర్చులలో కొంతవరకూ సంపాదించుకొనేవారు. వారికి సెలవులు ఉండేవి కావు. వారానికి రెండు రోజులు వారి సొంత పనులు చేసుకొనేందుకు కొంత సమయం ఇచ్చేవారు. వారు తగిన ఆరోగ్యంతో ఉంటే ఏడాదికి మూడు నెలలు పాదయాత్ర చేయవచ్చు. గుజరాత్ విద్యాపీఠంలో (గుజరాత్ విద్యా పీఠాన్ని 1920లో అహ్మదాబాద్‌లో గాంధీ స్థాపించాడు. మెకాలే విద్యకు వ్యతిరేకంగా దాస్య శృంఖలాలను తెంచుకుని జాతి నిర్మాణం గావించే యువతను తయారుచేయాలన్నది గాంధీ ఆశయం. 1963లో డీమ్డ్ విశ్వవిద్యాలయంగా ఇది గుర్తింపబడింది) గాంధీ వౌఖికంగా బైబిలు పాత నిబంధనలోని కథలు, ఆంగ్ల సాహిత్యంలో కొన్ని ఎంచుకున్న భాగాలు చెప్పేవాడు.
కేవలం కొద్దిమంది మధ్యతరగతివారి అవసరాలు తీర్చేందుకు బదులుగా, కోట్లాది మంది సామాన్యులకు ఉపయోగపడేలా మొత్తం ఉన్నత విద్యా వ్యవస్థనే సంస్కరించాల్సిన అవసరం ఉందని గాంధీ భావించేవాడు. వాళ్లకు పూర్తిగా పరాయిదైన ఇంగ్లీషును నేర్చుకోవడానికి ఎంతెంత సమయం, శక్తీ వృధా అవుతున్నాయో, దాని వల్ల వారు తమ దేశీయ వారసత్వానికి ఎంతగా దూరమవుతున్నారో ఆయన గుర్తుచేసేవాడు. ఉన్నత విద్య కూడా విద్యార్థుల మనస్సుల్లో ఆత్మవిశ్వాసాన్ని కలిగించడం లేదు. చాలామంది తమ కళాశాల చదువు పూర్తిచేసిన తర్వాత ఏమి చేయాలి అనే సంశయంలోనే ఉంటున్నారు. ఉన్నత విద్య అనేది భారతదేశంలోని విభిన్న సంస్కృతులకు చెందిన గత సంప్రదాయాల పునాదులను, ఆధునిక అనుభవాలతో మెరుగులు దిద్దిన సమ్మేళనంగా ఉండాలని ఆయన భావించేవాడు. తెలివిగల, నిజాయితీపరులైన, ఆరోగ్యవంతులైన గ్రామీణులుగా ఎక్కడైనా, ఎప్పుడైనా తమ జీవన వ్యయాన్ని సంపాదించుకోగల సమర్థులుగా విద్యార్థులు ఉండాలి. ఒక విద్యార్థికి రాయడానికి ముందు చదవడం నేర్పాలని గాంధీ పట్టుపట్టేవాడు. చక్కటి చేతిరాత మంచి చదువులో భాగమని ఆయన భావించేవాడు. తన దస్తూరీ బాగుండదని ఆయన సిగ్గుపడేవాడు. ఉపాధ్యాయులు విద్యార్థులకు ముందుగా సరళరేఖలు, వక్రరేఖలు, త్రిభుజాలు, పిట్టలు, పూలు, ఆకులు గీయడం నేర్పాలని అప్పుడు అక్షరాలను దిద్దకుండానే రాయడం వస్తుందని ఆయన సూచించేవాడు. గ్రామీణ భారతదేశపు అవసరాలను పట్టించుకోని అప్పటి ప్రాథమిక విద్య ఆయనకు ఒక నాటకంగా అనిపించేది.
పిల్లలను కేవలం అక్షరాస్యులుగా కాకుండా వారిని వెనె్నముక గల వ్యక్తులుగా తయారుచేసేలా వారిలోని ప్రతిభను వెలికితీయాలని ఆయన భావించేవాడు. 30 ఏళ్ళపాటు విద్యా వ్యవస్థ గురించి అధ్యయనం చేసిన తర్వాత చేతివృత్తులు ద్వారా విద్య నేర్పే ఒక పద్ధతిని ప్రవేశపెట్టాడు. తన 63 ఏళ్ళ వయసులో ఆయన జైలులో ఉన్నప్పుడు తన విద్యా సిద్ధాంతానికి అక్షరరూపమిచ్చాడు. తర్వాత కాలంలో అదే నరుూ తాలీం (నరుూ తాలీంని గాంధీ 1937లో ప్రకటించాడు. చదువుతోపాటు పని కూడా నేర్పాలన్నది దీని ప్రధాన సూత్రాలలో ఒకటి) ప్రాథమిక విద్య, లేదా వార్థా విద్యా ప్రణాళిక కింద రూపొందింది.
విద్యార్థులకు శారీరక శిక్షలు వేయడానికి గాంధీ వ్యతిరేకం. ఆయన జీవితంలో ఒకే ఒకసారి ఒక అల్లరి పిల్లవాడిని రూళ్ల కర్రతో కొట్టాడు. అయితే స్వీయ నియంత్రణ కోల్పోయినందుకు ఎంతగానో బాధపడ్డాడు. దెబ్బలు కలిగించిన నొప్పికి ఆ పిల్లాడు ఏడవలేదు కానీ, గాంధీ దుఃఖాన్ని చూసి, ఆయన్ని అంతగా బాధపెట్టినందుకు అతనికీ దుఃఖం వచ్చింది. క్షమించమని, ఇంకెప్పుడూ అల్లరి చేయననీ గాంధీని వేడుకున్నాడు.
విద్యార్థులు ఆటలలో పోటీపడటాన్ని గాంధీ ప్రోత్సహించేవాడు కానీ చదువులో ఒకరిని మరొకరు ఓడించాలని ఎప్పుడూ సూచించేవాడు కాదు.