పఠనీయం

ప్రకృతి చికిత్స.. మహాభాగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బహురూపి గాంధీ రచయత : అనుబందోపాధ్యాయ తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు) ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక, సికింద్రాబాద్-17.. 94907 46614
========================================
జబ్బుపడినవారికి వైద్యం చేసేటప్పుడు వారిని ప్రశాంతంగా ఉంచేందుకు గాంధీ ప్రయత్నించేవాడు. అన్ని రకాల అలవాట్లకు ఆయన చాలా వ్యతిరేకం అయినా ఒక దక్షిణాది కుర్రాడు జబ్బుపడినప్పుడు అతని మనసుకు ఊరట కలిగించేందుకు గాంధీ స్వయంగా అతనికి కాఫీ కలిపి ఇచ్చాడు.
రోగుల శరీరాలను తడిగుడ్డతో శుభ్రం చేయడం, ఎనిమా చేయడం, స్నానం చేయించడం, మట్టి పట్టీలు వేయడం అన్నీ స్వయంగా చేసేవాడు. నర్సుకంటే ఎక్కువ ఆయన రోగులకు సేవలు చేసేవాడు. రోగాలు అంటుకుంటాయేమోనన్న భయం ఆయనకు లేదు. ఒకసారి ఒక కుష్ఠు బిచ్చగాడు ఆయన వద్దకు వచ్చాడు. గాంధీ కొద్ది రోజులపాటు అతనికి ఆశ్రయం ఇచ్చి, అతని గాయాలకు కట్లు కట్టి ఆ తర్వాత ఆసుపత్రికి పంపించాడు. ఒకసారి ఆయన తోటి ఖైదీకి కుష్ఠవ్యాధి లక్షణాలు సోకాయి. అతన్ని రోజూ సందర్శించేందుకు గాంధీ అనుమతి సంపాదించాడు. ఆ తర్వాత చాలా ఏళ్ళపాటు అతనికి సేవాగ్రామ్ ఆశ్రమంలో ఆశ్రయం ఇచ్చాడు. అతని గాయాలకు గాంధీనే స్వయంగా కట్లు కడుతూండేవాడు.
గాంధీకి నర్సుగా సేవలందించేందుకు రెండు చారిత్రాత్మక సందర్భాలలో అవకాశం లభించింది. అందులో ఒకటి బోయర్ యుద్ధం, రెండోది జులూ తిరుగుబాటు. ఆ రెండు సందర్భాలలోనూ ఆయన ఒక భారతీయ అంబులెన్స్ దళం ఏర్పరచుకొని గాయపడిన వారిన యుద్ధ రంగం నుంచి బయటకు మోశాడు. వైద్య సేవలందించాడు. గాయపడినవాళ్లను స్వయంగా స్ట్రెచర్‌మీద మైళ్ళకు మైళ్లు మోసాడు, అంబులెన్స్ దళానికి సమర్థుడైన నాయకుడనిపించుకున్నాడు. కొరడా దెబ్బలు తిని నిస్సహాయంగా పడి వున్న జులూ ప్రజలకు సంతోషంగా సేవలందించాడు. వారికి సేవలందించేందుకు తెల్లవారైన ‘సిస్టర్స్ ఆఫ్ మెర్సీ’ దళం నిరాకరించింది. వారి గాయాలు చీము పట్టి భయంకరంగా ఉండేవి. వైద్యుల సూచనల ప్రకారం తెల్ల సైనికులకు కూడా గాంధీ ఔషధాలు అందించేవాడు. ఆయన నర్సింగ్ సేవలకు జులూ యుద్ధపతకం, కైజర్-ఎ-హింద్ బంగారు పతకం లభించాయి.
దక్షిణాఫ్రికాలోని బంగారు గనుల్లో ప్లేగు వ్యాధి విజృంభించినపుడు అనేకమంది భారతీయ కార్మికులు ఆ రోగం బారిన పడ్డారు. ఆ కబురు వినగానే గాంధీ నలుగురి సహాయకులతో అక్కడకు వెళ్ళాడు. అక్కడ కొన్ని మంచాలు వేసి 23 మంది రోగులను అక్కడకు చేర్చారు. గాంధీ తక్షణ స్పందనకు అక్కడి పురపాలక సంఘం కృతజ్ఞతలు తెలిపింది. అవసరమైన మందులను, ఒక నర్సును సహాయానికి పంపింది. ఆ నర్సు రోగ నివారణిగా వాడుకొనేందుకు తగినంత బ్రాందీ నిల్వలు తెచ్చుకొన్నాడు. గాంధీకి ఆ రకమైన రోగ నివారణపై అంతగా నమ్మకం లేదు. రోగులకు మందులివ్వడం, వారి పడకలను శుభ్రం చేయడం, రాత్రులు వారి పక్కన కూర్చుని ధైర్యం చెప్పడం వంటి పనులన్నీ గాంధీ చేసేవాడు. చికిత్స చేస్తున్న వైద్యుని అనుమతితో గాంధీ అక్కడున్న రోగులలో ముగ్గురికి మృత్తికా చికిత్స మొదలుపెట్టాడు. వారిలో ఇద్దరు బతికారు. నర్సుతో సహా మిగిలినవారంతా మరణించారు. సేవలందించేందుకు తగిన శారీరక దృఢత్వం ఉండాలంటే రోగుల పట్ల ఎంత శ్రద్ధగా ఉండాలో తన శరీరం పట్ల కూడా అంత శద్ధగా ఉండాలని గాంధీకి తెలుసు. ఆయన ఎప్పుడూ తగిన జాగ్రత్తలు తీసుకొనేవాడు. పనిభారం అధికంగా ఉన్నప్పుడు పొట్టనిండా తినేవాడు కాదు.
ఎనిమా ఇవ్వడంలోనూ, కటి స్నానం చేయించడం, నూనెతో మర్దన చేయడం, మట్టి పట్టీలు వేయడం, తడి గుడ్డల పట్టీలు వేయడంలోనూ గాంధీకి మంచి నైపుణ్యం ఉంది. రక్తపోటును తగ్గించుకొనేందుకు ఆయన తరచుగా తన నుదుటిమీద మట్టి పట్టీ వేసుకొనేవాడు. జపాను కవి యోన్ నొగూచి (ఇతను 1936లో భారతదేశంలో గాంధీని కలిశాడు)తో ఈ మట్టి పట్టీ గురించి చెబుతూ గాంధీ ‘‘నేను భారతదేశపు మట్టిలో పుట్టి పెరిగినవాడిని, కాబట్టి నాకు ఈ భారతీయ మృత్తికే కిరీటంగా ఉంటుంది’’ అన్నాడు.
రోగి ప్రమాదకర పరిస్థితిలో ఉన్నా ఆయన సాధారణంగా కంగారు పడేవాడు కాదు. తన భార్యా పిల్లలకు సేవలు చేసేటప్పుడు కూడా చాలా ప్రశాంతంగానే ఉండేవాడు.