పఠనీయం

వృత్తి విద్యా కళే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బహురూపి గాంధీ రచయత : అనుబందోపాధ్యాయ తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు) ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక, సికింద్రాబాద్-17.. 94907 46614
=============================================
తాను మైలపడకుండా ఆయన ఆ పనిచేసి చూపించాడు. ఒకసారి ఒక విదేశీయుడు గాంధీని అడిగాడు. ‘‘మిమ్మల్ని ఒక రోజు పాటు భారతదేశానికి వైస్రాయికి చేస్తే ఏం చేస్తారు?’’
‘‘వైస్రాయి భవనంలో ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురౌతూ అపరిశుభ్రంగా ఉన్న పారిశుద్ధ్య పనివారి నివాసాలను శుభ్రం చేస్తాను’’
మీ పదవీ కాలాన్ని మరో రోజు పొడిగిస్తే?’’
‘‘మర్నాడు కూడా నేను అదే పని చేస్తాను’’
చెప్పులు కుట్టేవాడు
63 సంవత్సరాల వయసులో గాంధీని వల్లభభాయి పటేల్‌తో కలిసి ఎరవాడ జైలులో పెట్టారు. వల్లభభాయికి ఒక జత చెప్పులు అవసరమైనాయి. కానీ జైలులో చెప్పులు కుట్టేవాళ్లు అందుబాటులో లేరు. అప్పుడు గాంధీ ‘‘మంచి తోలు దొరికితే మీకు చెప్పులు తయారుచేస్తాను. నేను చాలా రోజుల క్రితం నేర్చుకున్న చెప్పులు కుట్టే విద్య సరిగా గుర్తుందో లేదో ఇపుడు పరీక్షించుకోవాలి. ఒకప్పుడు నేను చెప్పులు బాగా కుట్టేవాడిని. నా పనితనానికి నమూనా సోదెపూర్‌లోని ఖాదీ ప్రతిష్ఠాన్ మ్యూజియంలో చూడొచ్చు. నేను ఆ చెప్పులని ఒకరి కోసం పంపాను. కానీ ఆయన వాటిని ఉపయోగించకుండా భద్రపరిచాడు. నేను టాల్‌స్టాయ్ క్షేత్రంలో ఉండగా అలాంటి జతలు చాలా తయారుచేశాను’’ అన్నాడు.
ఆ సమయంలో, అంటే 1911లో గాంధీ తన మేనల్లుడికి రాసిన లేఖలో ‘‘నేను ప్రస్తుతం చెప్పులు కుట్టడంలో తీరిక లేకుండా ఉన్నాను. ఇప్పటికి 15 జతలు తయారుచేశాను. నీకు కొత్త జత కావాలంటే సైజు పంపించు’’ అని రాశాడు. ఆయన చెప్పులుకుట్టే కళను దక్షిణాఫ్రికాలో కాలెన్‌బాక్ (హెర్మన్ కాలెన్ బాక్ (1871-1945) జర్మన్ యూదుడు, దక్షిణాఫ్రికాలో భవన నిర్మాణ శిల్పి) అనే అంకితభావంగల జర్మన్ స్నేహితుని నుండి నేర్చుకున్నాడు. ఆ తర్వాత గాంధీ చెప్పులు కుట్టడంలో ఇతరులకు కూడా శిక్షణనిచ్చాడు. ఆయన ఆ నైపుణ్యంలో గురువునే మించిపోయాడు కూడా.
గాంధీ తయారుచేసిన చెప్పులు, బూట్లు ఆశ్రమం బయట అమ్మేవారు. ఆ సమయంలో ప్యాంటు మీద శాండల్ బూట్లు ధరించడాన్ని గాంధీ ఫాషన్‌గా మార్చాడు. వాటికి పైభాగం సాధారణ బూట్లలా మూసి ఉండదు కాబట్టి ఉష్ణదేశాల్లో వేసవిలో ధరించేందుకు సుఖంగా ఉంటాయి. శీతాకాలంలో మేజోళ్ళతో కలిపి ధరిస్తే చలి నుంచి రక్షణ పొందవచ్చు.
సర్దార్ పటేల్, జవహర్‌లలా ఒకసారి గాంధీ సలహాకోసం సేవాగ్రామ్‌కు వెళ్ళారు. అక్కడఆయన వాళ్ళకి ఒక ఆశ్రమవాసుల సమూహానికి శిక్షణ ఇస్తూ కనపడ్డాడు. ‘‘పట్టీలు ఇక్కడుండాలి. ఇదుగో ఇలా వెయ్యాలి, మడమల వద్ద ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి తోలుని అడ్డముక్కలుగా వేయాలి’’ అంటూ వాళ్ళు చేసిన పొరపాట్లను సరిచేస్తున్నాడు. నాయకులలో ఒకరు ‘‘వాళ్ళు మా సమయన్నా దోచుకుంటున్నారు’’ అని ఫిర్యాదు చేశారు. ‘‘పాఠాలన్నీ వాళ్ళే నేర్చుకుంటున్నారని అసూయ వద్దు. కావాలంటే మంచి చెప్పుల జత ఎలా తయారుచేస్తారో మీరు కూడా చూడొచ్చు కదా’’ అని గాంధీ బదులిచ్చాడు.
ఇంకోరోజు గాంధీ, కొంతమంది సహచరులు కలిసి ఒక చచ్చిన ఎద్దు చర్మాన్ని గ్రామీణ చర్మకారులు ఎలా వలుస్తారో పరిశీలించాడు. వాళ్ళు సాధారణ దేశవాళీ కత్తితో కొంచెం కూడా పాడవకుండా తోలు ఒలవడం గాంధీని ఆకట్టుకుంది. ఆ పనిని గ్రామీణ చర్మకారులకంటే బాగా చేయడం పేరుపొందిన శస్తచ్రికిత్స నిపుణులకు కూడా సాధ్యం కాదని ఆయన కితాబిచ్చాడు. మానవ శరీరాలని కోసి, చర్మాన్ని తీసే వైద్య విద్యార్థులు కూడా ఆయన దృష్టిలో చర్మకారులే. ఒకపక్క వైద్యవృత్తిని గౌరవిస్తూనే మరొక ప్రక్క పారిశుద్ధ్య పనివారి వృత్తిని, చర్మకారుల వృత్తిని అసహ్యించుకుంటున్నాం. వాళ్ళను హిందువులు అంటరానివాళ్ళుగా చూస్తున్నారు. గాంధీ బూట్లుకుట్టడం నేర్చుకోవడంతో ఆగిపోలేదు. ఆయనతోలు తయారీలో కూడా నిపుణుడు కావాలనుకున్నాడు. ఎందుకంటే ప్రపంచంలో చాలామంది తోలు చెప్పులు ధరిస్తున్నారు కనా ఆ తోలు మాత్రం ఆరోగ్యంగా ఉన్న ఆవులను, గేదెలను, మేకలను, గొర్రెలను చంపడం ద్వారా సేకరిస్తున్నారు.