పఠనీయం

ఊహకు అందని ఊహావిహంగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఊహావిహంగాలు -సాహితీ తరంగాలు ( శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం)
======================================
శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశంగారు ప్రముఖ సాహితీవేత్తలు. లోగడ వీరి కవితలు , వ్యాసాలు, పద్యరచనలు వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఆంగ్లంలో కూడా రచనలు చేసిన ద్విభాషా పండితులు.
ఇపుడు ఊహావిహంగాలు - సాహితీ తరంగాలు పేరిట కథలు, వ్యాసాలు సంపుటిగా ఇదివరకు ప్రచురితమైన వాటిని క్రోడీకరించి మన ముందుకు గ్రంథ రూపంలో తెచ్చారు.
అ భాగములోని కథలు ఒకదానిని మించి మరొకటి పోటీ పడుతూ వచ్చాయి. తనకు ఇష్టమైన జంధ్యాల శాస్ర్తీగారి పేరుతో ముఖాముఖిలో సాధారణ మాటలకు అసాధారణ అర్థాలు, రకరకాల విచిత్ర బిరుదులతో సన్మానాలు అందుకొనేవారికి వెర్రెక్కించారు. పార్కులో పిన్నిగారి ముచ్చట్లలో ఆంగ్ల సాహిత్యంలోని గొప్ప రచయిత సామెతల జడివానలో పాఠకులను తడిపి ముంచెత్తి మేం మనుషులం అంటూ తెలియజెప్పారు. రాజకీయాలు రొచ్చు అయినా భీమారావులాంటి వారికి భేషైన జీవనోపాధిగా చూపించారు. కొంతమంది రచయితలకు ఉన్న సెంటిమెంటును సున్నితంగా స్పృశిస్తూ కథ చెక్కిన కథ అనుభవపూర్వకంగా వ్రాసిన విధంగా వున్నది. సినిమా ఫక్కీలో వ్రాసిన కాలధర్మంలో ప్రమాదంలో పడబోతున్న భార్యాభర్త జీవితాన్ని గట్టెక్కించిన తీర్పు బాగుంది. తెలుగు అక్షరాలలో కాలం చెల్లిన వాటికి పచ్చని సెంటిమెంటు అద్ది ఎండిపోయిన చెట్టు ద్వారా భాషకూ, బాంధవ్యాలకూ సమాజంలో విలువలు ఇవ్వాలి అనే సూక్తిని మరొక్కసారి గుర్తుచేశారు. కంప్యూటరీశ్వరుడి ద్వారా నేటి యువతను లాక్ చేస్తూ, నిజమైన జ్ఞానాన్ని తెలుసుకోవాలి అని వ్యంగ్యంగా వ్రాసిన తీరు బాగుంది.
మన ఫలితాలే మనల్ని వెతుక్కుంటూ వస్తాయి అని, శవంమీది డబ్బులు ద్వారా పాఠక లోకానికి చెప్పారు. అల్పజీవులలో అల్పజీవి కుక్కతో సాంబును పోల్చి హృదయాన్ని కదిలించారు. ఇలాంటివారు ఈ కాలంలో కూడా ఉన్నారా అనే ప్రశ్న మనకు ఉదయిస్తుంది. ఆ భాగంలో వ్యాసాలు పొందుపరచారు. పార్వతీశంగారికి వ్యాకరణం భాషలో మంచి పట్టు వ్నుది. అందుకే అన్ని వ్యాసాలలో పద్యాలు, శ్లోకాలు, అలంకారాలు ఇబ్బడిముబ్బడిగా ఉన్నాయి. జాన్ కీట్సు, కాళిదాసు, డేవిడ్ గ్యాస్కాయిన్, శ్రీశ్రీ గారి గురించి, పోతనలోని సార్వకాలికత, బలిజేపల్లి వారి చమత్కారాలు, కరుణశ్రీ గారి కమనీయ భావమకరందం, విశిష్టకవి వీరేంద్ర శర్మ గురించి ఎంతో పరిశోధనాపూర్వకంగా వెలువరించారు. ప్రాచీన అలంకార శాస్త్రాలు బ్రాహ్మణవాద దృక్పథానికి పరిమితమైపోయాయి అనే వాదాన్ని తిరస్కరిస్తూ విశే్లషణాత్మకంగా ఇచ్చిన వివరణ నేటి మేధావులు ఆలోచింపదగినదిగా ఉంది.
సాంకేతిక పరిజ్ఞాన యంత్రాలకు బలవుతున్న అక్షర దహనాలను అంతం చెయ్యాలి అని చెప్పడంలో తెలుగు భాషపై వున్న వారి మమకారం మనందరి హృదయాలను తట్టిలేపుతుంది. ఓంకార సంకేతమే వినాయక స్వరూపం అంటూ నేటి సమాజానికి మార్గదర్శక సూత్రాలను బోధించడం ఆ గణనాథునికి నివాళి. వీరు వృత్తిరీత్యా ఇంజనీరు. అందుకే తన వ్యాకరణ ప్రతిభను, సాహిత్య ప్రక్రియను కలగలిపి మొనగాడి సిమెంటు, శ్రేష్ఠమైన ఇసుక, మన్నికగల ఐరన్‌తో దృఢమైన, అభ్యుదయకరమైన సమాజం కొరకు నిర్మాణ ప్రక్రియను చేపట్టారు. ఈ గ్రంథం చదివిన ప్రతి పాఠకుడు పార్వతీశంగారు తన ప్రక్రియలో విజయం సాధించారు అని ఒప్పుకుంటారు.

-జొన్నాభట్ల నరసింహప్రసాద్ 7995900497