పఠనీయం

సత్యానికే సదా జయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బహురూపి గాంధీ రచయత : అనుబందోపాధ్యాయ తెలుగు సేత: నండూరి వెంకట సుబ్బారావు
(2014లో అనువదించారు) ప్రతులకు - మంచి పుస్తకం
12-13-439, వీధినెం.1. తార్నాక, సికింద్రాబాద్-17.. 94907 46614
=================================================================
అతడి పేరు బాలసుందరం. అతడి ముందు రెండు పళ్ళు విరిగి, బట్టలు చిరిగి వున్నాయి. అతడిని అతని తెల్ల యజమాని బాగా కొట్టాడు. గాంధీ అతడిని ఓదార్చి ఒక తెల్ల వైద్యుని వద్ద దెబ్బలకు చికిత్స చేయించాడు. దెబ్బల తీవ్రతను ధృవీకరిస్తూ వైద్యుని వద్ద సర్ట్ఫికెట్ తీసుకున్నాడు. తర్వాత బాలసుందరం తరఫున కోర్టులో కేసు వేసి అతడిని క్రూరమైన యజమాని చెరనుండి విడిపించి మెరుగైన కొత్త యజమాని వద్ద చేరే అవకాశం కల్పించాడు. ఈ సంఘటనతో పేద భారతీయ కార్మికులలో గాంధీ చాలా ప్రసిద్ధుడయ్యాడు. నిస్సహాయులకు రక్షకుడిగా ఆయన ఖ్యాతి భారతదేశం వరకు చేరింది. అప్పటినుంచీ స్నేహితులు లేనివారికి అతడు స్నేహితుడుగా మారిపోయాడు.
ఒక సంవత్సరం అనుభవంతో గాంధీకి ఆత్మవిశ్వాసం వచ్చింది. కొన్ని వాద వివాదాల తర్వాత ఈ కూలీ బారిష్టరుకు నాటల్ సుప్రీంకోర్టులో న్యాయవాదిగా నమోదు చేసుకొనే అనుమతి లభించింది. తెల్ల న్యాయవాదులు అతనికి కేసులు రానిచ్చేవారు కాదు. పైగా ఆయనే స్వయంగా తన వృత్తికి అడ్డంకులను సృష్టించుకొనేవాడు. న్యాయవాద వృత్తి అంటే అబద్ధాలకోరు వృత్తికాదని నిరూపించాలని ఆయన కంకణం కట్టుకున్నాడు. ఆయనెప్పుడూ అసత్యాలాడేవాడు కాదు. కేసులు గెలవడం కోసం సాక్షులను తప్పుడు సాక్ష్యం చెప్పమని అనేవాడు కాదు. తన కక్షిదారు ఓడినా, గెలిచినా తనకు న్యాయంగా రావలసిన ఫీజు తప్ప ఒక్క పైసా కూడా ఎక్కువ తీసుకొనేవాడు కాదు. తనకు ఫీజులు బాకీపడ్డ కక్షిదారులకు ఆన ఒక్కసారి కూడా నోటీసులు పంపలేదు. వ్యక్తిగతంగా తనను కష్టపెట్టినవాళ్లమీద కేసులు వేయలేదు. దక్షిణాఫ్రికాలో ఆయనమీద నాలుగుసార్లు దాడి జరిగినా దుండగులను కోర్టుకీడ్చి శిక్ష వేయించడంపై ఆసక్తి చూపించలేదు. న్యాయవాదిగా తన ఇరవైయ్యేళ్ళ వృత్తిజీవితంలో వందలాది కేసులు న్యాయస్థానం బయటే పరిష్కారమయ్యేందుకు సహాయం చేశాడు.
ఒకసారి ఒక కేసు వాదిస్తూండగా తన కక్షిదారే అన్యాయంగా ప్రవర్తించాడని ఆయనకు అర్థమయింది. అతన్ని గెలిపించేందుకు వాదించడం మాని, కేసును కొట్టివేయమని మేజిస్ట్రేటును కోరాడు. తప్పుడు కేసు తెచ్చినందుకు కక్షిదారును స్వయంగా మందలించాడు. ‘‘నేను న్యాయవాద వృత్తిని ఒక రెండవ శ్రేణి న్యాయవాదిగా ప్రారంభించాను. నా న్యాయవాద నైపుణ్యాలు నా కక్షిదార్లను పెద్దగా ఆకట్టుకునేవి కావు. కానీ నేను ఎట్టి పరిస్థితుల్లోనూ సత్యానికే కట్టుబడి ఉంటాను అనే విశ్వాసం వారికి కలిగాక నన్ను వదలిపెట్టేవారు కాదు’’ అని గాంధీ ఒకసారి స్వయంగా చెప్పుకున్నాడు. ఆయన కక్షిదార్లు క్రమంగా ఆయన స్నేహితులుగా, సహచరులుగా మారిపోయేవారు. ఆయన నిజాయితీకి ఎంత విలువ ఉండేదంటే ఒక సందర్భంలో ఒక కక్షిదారుడిని జైలుకి వెళ్లకుండా అదే కాపాడింది.
గాంధీ పాత కక్షిదారు ఒకరు దిగుమతి సుంకం చెల్లించకుండా కొన్ని వస్తువులను దిగుమతి చేసుకున్నాడు. అయితే తన పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగే పరిస్థితులు తలెత్తేసరికి ఆయన గాంధీ వద్దకు వచ్చి నిజం చెప్పేశాడు. తన తప్పు ఒప్పుకొని అపరాధ రసుము చెల్లించాలని గాంధీ ఆయనకు సూచించాడు. తానే స్వయంగా ప్రభుత్వ న్యాయవాదిని (అటార్నీ జనరల్‌ను) కలిసి ఉన్న విషయం ఉన్నట్లుగా చెప్పాడు. వారు గాంధీ వాంగ్మూలాన్ని ఎలాంటి ప్రశ్నలూ లేకుండా స్వీకరించి, తప్పు చేసిన వ్యక్తిని కేవలం అపరాధ రుసుముతో వదిలేశారు. దీనికి కృతజ్ఞతగా ఆ కక్షిదారు మొత్తం సంఘటనను ముద్రించి, పటం కట్టించి తన కార్యాలయంలో తగిలించాడు.
మరొక సందర్భంలో కక్షిదారు పద్దులలో చిన్న తప్పు దొర్లింది. గాంధీ ఆ తప్పును ప్రతిపక్షానికి చూపించి పొరపాటైందని అంగీకరించాడు. దానికి అనుగుణంగానే తన వాదన కొనసాగించాడు. ఆ కేసు పర్యవేక్షిస్తున్న న్యాయమూర్తి మరీ అంత కఠినంగా వృత్తిని నిర్వహించడం మంచిది కాదని గాంధీని మందలించాడు, కానీ చివరకు గాంధీ కక్షిదారునికి అనుకూలంగా తీర్పు ఇచ్చాడు. ‘‘గాంధీ స్వయంగా వారి పద్దులో తప్పును చూపించకపోతే ఏమయ్యేదో ఒక్కసారి ఆలోచించు’’ అని ఆయన ఎదుటి పక్షానకి సర్ది చెప్పాడు. సాక్షుల వాంగ్మూలాలను పరీక్షించి నిగ్గుతేల్చడంలో గాంధీ గొప్ప ప్రతిభ చూపేవాడు.