పఠనీయం

అక్షర తూణీరాలే ఈ కవితా ‘మొగ్గలు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొగ్గలు
రచన: డా. భీంపల్లి శ్రీకాంత్ వెల:- రూ.50/-లు
ప్రతులకు డా. భీంపల్లి శ్రీకాంత్ 8-5-38, టీచర్స్ కాలనీ, మహబూబ్ నగర్ - 509001 సెల్ నెం. 9032844017
===========================================================
ఆధునిక తెలుగు వచన కవిత్వంలో లఘురూప ప్రక్రియలు కోకొల్లలు. వాటి సందేశాన్నిబట్టి, అక్షర నియమం రూపుదిద్దుకుని సంక్షిప్తరూపాన్ని ధరిస్తుంటాయి. హైకూలు, నానీలు, రెక్కలు, వ్యంజకాలు, రుబాయిలు, నానోలు, గజళ్ళు, రాణీలు లాంటి వైవిధ్య ప్రక్రియలు సరికొత్త పాద నియమాలతో ఊపిరిపోసుకున్నవే. ఇలాంటి కోవకి చెందిన మరో విభిన్న ప్రక్రియ ‘‘మొగ్గలు’’. దీనిలో మూడు పాదాలుంటాయి. దీనికి సృష్టికర్త ‘్భంపల్లి శ్రీకాంత్’. ఈ నూతన ప్రక్రియకు ఆద్యుడు. అనేక తాత్త్వికతల జీవనసార ప్రతిరూపమిది.
‘‘వాడు వౌనంగా ఉన్నాడంటే
ఏదో ఆలోచనకు బీజం వేసినట్టే
వౌనం ఒక మహావిస్ఫోటనం’’అంటాడు ఈ కవి ఒకచోట.
పైకి కనిపించని ఒక సుదీర్ఘ విశ్వరూప దర్శనం దీనిలో అంతర్లీనంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మేథోపరమైన లోతైన ఊహాశక్తికి ఇది దర్పణం పడుతుంది. వౌనం ఆలోచనకు కేంద్ర బిందువుగా మలిచి, దాని పర్యవసాన ఫలితాన్ని గొప్ప పరమార్థసత్యంగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాడు.
‘‘శిథిలమైన గోడలు ఎప్పుడూ
వెక్కిరిస్తూనే ఉంటాయ్
చరిత్ర ఆనవాళ్లు అవే’’అంటూ నొక్కి వక్కాణిస్తాడు మరోచోట శ్రీకాంత్. ఈ వాక్యాల్లో ఒక భౌతికమైన చారిత్రక భవిష్యత్‌రూపాన్ని గతంతో పోల్చి చెబుతూ, చెదలుపట్టిన వాస్తవిక సందర్భాన్ని కరతలామలకంగా మలిచి, సజీవత్వాన్ని ఆపాదిస్తాడు కవి. పాతదనంలోని గత స్మృతుల వైభవాన్ని కళ్ళకు కట్టిస్తాడు.
‘‘చినుకు స్నానమాడితే కానీ
ఆకు ముత్యాన్ని కిరీటంలా ధరించదు
వాన చినుకు మెరిసే ముత్యం’’అని వ్యాఖ్యానించడంలో ఉట్టిపడే దృశ్య తాత్త్వికత సౌందర్యంతో ప్రకాశిస్తుంది. ఆకుపై చినుకు స్పర్శకు నీటిబిందువు ముత్యం రూపం ధరించడాన్ని కళాత్మక కవితా దృష్టిగా చిత్రించి చెప్పడం జరిగింది. ఈ బాహ్యాంతర కోణాల తత్త్వసారాన్ని లోచూపుతో ఆకళింపు చేసుకోవలసి ఉంది.
‘‘పొలాన్ని దున్నితేనే కానీ
మట్టి మహానందాన్ని పొందదు
విత్తనాలు మట్టిబిడ్డలు’’ అని పోల్చి చెప్పడంలో మట్టికి- విత్తుకి ఉన్న మమకార అవినాభావ సంబంధాన్ని, తేటతెల్లం చేస్తాడు కవి. పొలానికీ- నాగలికీ ఉన్న పేగుబంధాన్ని, అనుబంధంగా గుర్తుచేస్తాడు. వర్ణనాతీతమైన ఈ మహదానందాన్ని పలవరించి అనుభవించడంలో ఉన్న తృప్తీ, పులకరింత మాటల్లో వ్యక్తంచెయ్యలేనిది. కాబట్టే ఈ సందర్భాన్ని కవిత్వమయం చెయ్యగలిగాడు శ్రీకాంత్.
‘జీవితం ఒక నాటక రంగం’అని చదివినప్పుడు- ఎప్పుడో షేక్షిపియర్ చెప్పిన పలుకులు మరోసారి పునరావృతమైనట్టు అనిపిస్తాయి. గతంలో చెప్పిన కొన్ని ‘నిత్య జీవన సత్యాలు’ అక్కడక్కడా మళ్ళీ దొర్లినట్టు అనుభవంలోకి వస్తాయి. ఈ మొగ్గల్లో చాలావరకూ ఒకే బాణీలో సాగిపోయే యాంత్రికత దర్శనమిస్తుంది.ఈ అలతి పదాల వాక్య నిర్మాణంలో కవిత్వం ధ్వనించే పంక్తులు పాఠకుల్ని ఆకట్టుకుంటాయి. వీటిలో ‘‘బుజ్జిపాపలు నవ్వితే కానీ/ పలుకులు ముత్యాల్లా రాలవు’’, ‘‘రాత్రులు కాలాన్ని నిద్రపుచ్చే తల్లులు’’, ‘‘రాత్రి కలల్ని ఒడిసి పట్టుకుంటాను కదా/ ఉదయానే్న అవి సీతాకోక చిలుకల్లా ఎగరిపోతాయి’’, ‘‘కవిత్వం ఒక నిండు జాబిల్లి’’, ‘‘ప్రకృతి సౌందర్యం/ భూతల్లి మెడలో ఆభరణం’’, ‘‘విహంగం ఒక స్వేచ్ఛా వాయులీనం’’, ‘‘చినుకులు నేలను ముద్దాడతేనే కానీ/ బీడు పొలం పకపక నవ్వదు’’, ‘‘కవిత కాలాన్ని పట్టి చూపే కాగడా’’, ‘‘హృదయం ఒక మురళీనాదం’’, ‘‘కన్నీటికి తడి ఎక్కువ’’వంటి వాక్యాలు ‘కొండంత శిఖరాన్ని గోరంత అద్దం’లో పట్టి చూపిస్తాయి. ఇలా సాగిన భీంపల్లి శ్రీకాంత్ ‘మొగ్గలు’ గొప్ప సామాజిక ప్రయోజనానే్న తెలుగు పాఠకులకు కానుకగా అందించి అలరిస్తాయి.

- మానాపురం రాజా చంద్రశేఖర్ 9440593910