పఠనీయం

అవసరమే గెలుపునకు బాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గెలుపు మనదే కధల సంపుటి రచన:పర్చా దుర్గాప్రసాదరావు
=================================
తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన పర్చా దుర్గాప్రసాదరావు 1947లో తెలుగు తోట గ్రంథమండలి పరంగా ప్రచురించిన కథల పునర్ముద్రణ రూపం ఇది. కథలన్నీ సాయుధ పోరాటాన్ని వర్ణించేవే, వివరించేవే. ఇందులో ఎనిమిది కథలున్నాయి. మొదటి రెండు కథల్లో (గెలుపు మనదే, 15 ఆగస్టు తెల్లవారింది) రమణారావు, కోదండపాణి పాత్రలు కనిపిస్తాయి. ఇద్దరూ సహాధ్యాయులే అయినా తరువాత వేరు వేరు దారుల్లో జీవన వ్యవహారం చేస్తున్నారు.
కోదండపాణి ప్రజలతో కలిసిపోయి, పోరాటంలో ముందు నిలుచుంటే, రమణారావు ఆ పనిలోని ఉన్నతిని సోదాహరణంగా తరువాత గమనించి అనుసరించగలుగుతాడు. మలేరియా జ్వరంలో ‘గెలుపు మనదే’ అని పలువరించే స్థితికి వస్తాడు. ‘అప్రయత్నంగా రమణారావు అడుగులు ప్రజల వెంట నడిచినై’ (పే.11) జన సమూహం పోలీసు కాల్పులకు గురయి కూడా సహాయ నిరాకరణ చేస్తూ ‘పన్నులివ్వం’ అని తిరగబడడం మరో కథ. ‘గుండాల రాజ్యం’ అనే కథ గుండెలు చీల్చే కథ. తన కూతురు ప్రాణదానం చేసిన డాక్టర్‌నే దారుణంగా బాకుతో పొడిచిన వ్యక్తి కనిపిస్తాడు యిక్కడ. భారత యూనియన్‌లో చేరడానికి ముందు వుండిన పరిస్థితి వివరిస్తుంది. ‘బియ్యం గింజలు’ కథలో అప్పటి ధాన్యపు షాపుల తీరు వర్ణితం అయింది. దుర్గ అనే నిండు గర్ణిణి ఆ దుకాణంలో బియ్యం గింజల కోసం వెళ్లడంలో పడిన యాతన, అక్కడే బిడ్డను ప్రసవించిన పద్ధతి ‘ఒక చేతిలో బిడ్డడు, ఒక చేతిలో సంచీ, సంచీలో మానెడు బియ్యం గింజలు’- యిదంతా హృదయ విదారకంగా అక్షరబద్ధం చేశారు. అవటానికి కె.ఎ.అబ్బాస్ ఇంగ్లీషు కథకు అనువాదమే అయిన అచ్చంగా తెలుగు పల్లె జీవనాన్ని వ్యక్తీకరిస్తోంది ఈ కథ. పాత కథలను ప్రస్తుత పాఠకులకు అందించే ప్రయత్నం చేస్తున్న తెలంగాణ సాహిత్య అకాడమీ కృషి గణనీయమయినది. సర్వకాలీన సత్యాలను తెలుసుకునేందుకు ప్రయోజనకరం.

-శ్రీవిరించి