పఠనీయం

ఊహాజనితం ‘‘ఇట్లసుత’’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇట్లసుత
వచన మహాభారత ఐతిహాసిక ఊహాకావ్యము
రచన:వరిగొండ కాంతారావు,
వెల:రూ.400/-,
ప్రతులకు:
వివిధ ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలలో.
*
వరంగల్ అఖిల భారతీయ స్థాయిలో పేరొందిన సాంస్కృతిక కేంద్రం. నాటికీ నేటికీ అదే స్థితి. కాకతీయులు ఓరుగల్లును ఎందుకు రాజధానిగా చేసుకున్నారో తెలియదు. ముదిగొండ శంకరాధ్యులవారు 1920లో ఓరుగల్లు కేంద్రంగా ఎందుకు శైవధ్వజం రెపరెపలాడించారు?
నిజాం నవాబుకే అప్పులివ్వగల ఆకారపువారు, కొండూరివారు చందా కాంతయ్యలు, పడిశాల భద్రయ్యలు వరంగల్ అనగానే ఎంతో ఎంతెంతో వైభవవోజ్వల చరిత్ర గుర్తుకువస్తుంది. మాననీయులు భండారు చంద్రవౌళీశ్వరరావుగారు భండారు సదాశివరావుగారు, భండారు నాగభూషణరావు, భూపతి కృష్ణమూర్తి, మరొక గాంధీ అని పేరు పొందిన ఎం.ఎస్.రాజలింగం- ఇలా ఎందరెందరో 20వ శాబ్దంలో వరంగల్‌కు పేరు తెచ్చారు. వే.న.రెడ్డి, సుప్రసన్న వరవరరావు, సంపత్కుమార, మహాభారత నిఘంటువు నిర్మాత త్రోవగుంట వెంకట సుబ్రహ్మణ్యం, కాళోజీ, అనుముల కృష్ణమూర్తి వీరంతా ఇటీవలివారే.
ఈ పరంపరలో వరంగల్‌కు సేవ చేయడానికి సహృదయ అనే సాహిత్య సాంస్కృతిక కళాసంస్థ ఆవిర్భవించింది. వీరు నాటక పోటీలు నిర్వహించటం పురస్కార ప్రదానాలు గ్రంథ ముద్రణకు సహాయం చేయుట వంటి ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. అనలానిలము వంటి కవితా సంపుటాలు వెలువరించిన వరిగొండ కాంతారావుగారి ‘ఇట్లసుత’ అనే గ్రంథాన్ని ఇటీవల ముద్రించి వీరు సంచలనాన్ని సృష్టించారు.
వరిగొండ కాంతారావు ఇప్పటికీ తెలంగాణలో లబ్దప్రతిష్ఠితుడైన కవి. నిరంతర సాహితీ వ్యవసాయం చేస్తున్న సహృదయుడు. ఆయనకు ఉన్నట్లుండి ఒక ఆలోచన వచ్చింది. కురుక్షేత్రం లేని మహాభారతం ఎలా ఉంటుంది? అని. అదెలా సాధ్యం? అని ఆయనే ప్రశ్న వేసుకున్నారు. ఎలా అంటే కర్ణుడు పాండవ పక్షంలో చేరిపోతే యుద్ధం ఆగిపోయేది. జనక్షయం నివారింపబడేది. శ్రీకృష్ణావతార రహస్యమేమిటంటే దుష్టశిక్షణ పవిత్రాణాయ సాధూనాం అనే శ్లోక సారాంశం ఇదే.
దుష్ట చతుష్టయమును ఎవరూ కాపాడలేరు. ఐతే మంచికోసం పద్దెనిమిది అక్షౌహిణుల సైన్యం నశించటం భారతదేశపు దురదృష్టం.
వరిగొండ కాంతారావు శాంతిప్రియుడు కాబట్టి యుద్ధ నివారణ ఇలా జరిగి ఉండేది అని ఒక కల్పనచేశాడు. అదేమిటంటే, కుంతి-కృష్ణుడు చేసిన బోధనలతో మహాభారత యుద్ధం ఆగిపోయింది ‘ఇట్లసుత’ అనే వచన గ్రంథంలో ఇది స్థూలంగా కథ.
ఇక రెండవ అంశం- రచనలో తెలంగాణ మండలికాన్ని ప్రవేశపెట్టడం. లోగడ పోరంకి దక్షిణామూర్తి వంటివారు గోదావరిలోని మాండలికంలో రచనలు చేసి జనాదరణ పొందారు. ఈ పదాలు అందరికీ తెలియవు. రచయితయే చెప్పినట్లే, కాంతారావు చిన్నప్పుడు విన్న చాలా పదాలు ఇపుడు వినపడటంలేదు. అందుకని యధోచితంగా ఇందులో మాండలిక భాష వాడి వాటి సమానార్థకాలు గ్రంథం చివర ఒక నిఘంటువుగా అకారాధ్యమక్రమణికలో ఇవ్వటం మదావహం. గ్రంధాదిలో మాండలికం వ్యావహారికం శిష్ట వ్యావహారికం వంటి భాషా చర్చను వరిగొండవారు చేశారు. దానిని చదివి ఎవరికి తోచినట్లు వారు ఒక అభిప్రాయానికి రండి. గ్రంథాన్ని ప్రశంసించాలన్నా విమర్శించాలన్నా ముందు గ్రంథం చదవాలి కదా! అని వరిగొండవారే సవినయంగా కోరారు.
ఇట్లసుత ఒక అందమైన ఊహ. ఒక ఆచరణయోగ్యంకాని చారిత్రక సత్యం. దీనిని ఐతిహాసిక నవల అని అనలేము. ఇదొక కల్పన. అట్లని కాల్పన (రొమాంటిక్) నవల కాదు. మానవ సమాజాన్ని యుద్ధాల బారినుండి తొలగిస్తే బాగుండుననే ఒక దురాశ ఇందులో ఉంది. ఒక అసంభవానికి సంభావ్యత ఊహాజనితం- వరికొండ కాంతారావు అభినందనీయుడు.
‘‘అప్పటి దన్న నివ్వు నా ఆరాధ్యదేవతవు. దినాం ఇట్లనే పూజ్జేసుకుంట. ఈ యింతనే మంతం కూడ తాకకుంటే పూజ పూర్తయినట్టు కాదు’’ (పుట 206), ‘‘నువు మని నీ శాపకాలమయిపోతే మల్ల ఎనక కొస్తవు’’ (పుట 363), ‘వెరెటోల్లదాకెందుకు? తమ్ముడు ఎదురాడె పడగొట్టిండా’’ (పుట 346)- రచయిత భాషా ప్రయోగ రచనారీతి ఇలా మాండలికంలో సాగింది.

- ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్