పఠనీయం

సామాజిక సమస్యలను స్పృశించే కథలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మా నాన్నకు ప్రేమతో...!
సూపర్ సీనియర్ రైటర్స్
వెల: 99/-
ప్రతులకు: అన్ని ప్రధాన పుస్తక విక్రయ కేంద్రాలు..
*
వైద్యుడు కేవలం మేధస్సుతో కాక హృదయాన్ని కూడా కలిపి తమ వృత్తిని కొనసాగించాలి. రోగిపట్ల జాలి, దయ, నిజాయితీ లేనివాడు వైద్య వృత్తికి అనర్హుడు అంటూ వైద్యులకు సమాజం పట్ల ఉన్న బాధ్యతను ఎంతో సున్నితంగా, సూటిగా 3అంతర్ముఖంగా చెప్పింది రచయిత్రి ఆలూరి విజయలక్ష్మి. ఆస్తిహక్కులో ఆడపిల్లలకు సమభాగం ఉండాల్సిందే అని చట్టం చెబుతోంది. మంచిదే.. కానీ బాధ్యతల్లో కూడా సమానత్వం ఉండాలని చెప్పలేదా? అంటూ అమెరికాకు వెళ్లి తల్లిదండ్రుల పట్ల బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్న ఆడపిల్లలను ‘ఇంతేనా ఈ జీవితం’ అంటూ సూటిగా ప్రశ్నిస్తోంది రచయిత్రి అత్తలూరి విజయలక్ష్మి. ప్రతి మనిషి తాను చేసే సుదీర్ఘ ప్రయాణంలో ఎత్తు పల్లాలను, ఒడిదుడుకులను ఓర్చుకుంటూ ముందుకుసాగి గమ్యాన్ని చేరుకుంటాడు. కొడుకు ఉన్నత పదవులను అధిరోహించి నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదిగినా పేదవారిని ఏమాత్రం మరిచిపోకూడదంటూ ఓ తండ్రి తన కొడుకుతో కలిసి చేసినదే ‘రైలు ప్రయాణం. కొడుకు సమాజానికి, పేదవారికి ఉపయోగపడాలన్న ఓ బాధ్యతాయుతమైన తండ్రి తపనను చాలా చక్కగా వివరించాడు రచయిత సలీం ఈ కథలో. తల్లిప్రేమను తెలిపే ఓ తల్లి కథను అలతి అలతి పదాలతో చక్కగా వివరించాడు రచయిత అంగర వెంకట శివప్రసాదరావు. తన కడుపున కాసిన కాయల బుద్ధి, తెచ్చుకున్న కోడళ్ళ బుద్ధి తెలుసుకున్న ఆ ఇల్లాలు భర్త మృతికి బాధపడుతున్నా.. భర్త తనకంటే ముందు పోయినందుకు ఒక రకంగా సంతోషంగా ఉన్నాను అంటూ తన ‘గుండెతడిని కన్నీళ్ల రూపంలో బయటకు రానీకుండా అడ్డుతున్న ఓ భార్య ఆవేదనను చాలా హృద్యంగా ఆవిష్కరించాడు రచయిత వియోగి. నేటి సమాజంలో మీడియా ఎంతకు దిగజారుతుందో చాలా చక్కగా వివరించాడు రచయిత బి.కె. ఈశ్వర్ చూడు చూడు నీడలు’ కథలో..
జీవితంలో అన్నీ జరిగినప్పుడు మనంతటి వాళ్లు లేరంటాము. అదే జరగనప్పుడు జ్ఞాపకాలను తలచుకుంటూ ముందుకు సాగుతాం. అదే జీవితం. ఇలాంటి ఉదాహరణలెన్నో అని చెప్పే కథే. బాలి రాసిన ‘చిన్న ఉదాహరణ. ఉన్నదానికీ, అనుకున్నదానికీ మధ్యన ఏ కొలతకూ అందనంత దూరమే జీవితం అని చెప్పే కథలే. గంధం యాజ్ఞవల్క్యశర్మ ‘జీవన వేదం, విహారి ’జీవన ఫలం. చదువు వల్ల జ్ఞానం లభిస్తుంది. కానీ జీవితం కేవలం జ్ఞానం వల్లనే సాఫల్యం కాదు. మనిషి విజయాలను హస్తగతం చేసుకోవాలంటే వాడికి ఊహాశక్తి ఉండాలి. జ్ఞానం కంటే ఊహాశక్తి గొప్పది. జ్ఞానికి హద్దులుంటాయి కానీ ఊహాశక్తి ఎల్లలు లేనిది అని చెప్పిన ఐన్‌స్టీన్ మాటలతో మొదలైన ‘తాత్పర్యం’ కథారచయిత రామా చంద్రవౌళి. చెలిమికిది హేతువని చెప్పగాలేము. అంతరమ్మగు దానినందుకోలేము అని తెలిపే కథే యస్. రేణుకాదేవి ప్రయాణం. తెలంగాణా యాసలో సాగినదే నల్ల భూమయ్య ‘పిస బాలయ్య’ కథ. నీటిలో ఉన్న మొసలి బలం ముందు ఏనుగు బలం ఎందుకూ కొరగాదని గజేంద్రమోక్షం భాగవతగాథ మనకి చెబుతుంది. స్థానబలానికి ఉన్న ప్రాముఖ్యతను ఎలక్ట్రాన్ ‘బల పరిధులులో చక్కగా వివరించారు. పులిగడ్డ విశ్వనాథరావు ‘మతిమరుపుకు మందు’ కథాశైలి హాస్యంతో కూడుకున్నదే.. మిగిలిన కథలు కూడా సామాజిక సమస్యలను అలతి అలతి పదాలతో పాఠకులకు చక్కగా అర్థమయ్యే రీతిలో అందించారు రచయితలు, రచయిత్రులు.
ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముప్ఫై ఒక్క మంది సూపర్ సీనియర్ రచయితల కథలను ఒకేచోట గుదిగుచ్చి పుస్తకంగా ముద్రించారు. ఈ పుస్తకానికి ‘మా నాన్నకు ప్రేమతో..!(సీనియర్ సిటిజన్ కథలు’ అనే శీర్షికను పెట్టి తొంభై ఐదు సంవత్సరాల నిత్యనూతన సేవాతత్పరులు, ఆదర్శ వైద్యులు, అపర ధన్వంతరిగా వాసికెక్కిన డాక్టర్ కొడాలి పాపారావుగారికి అంకితమిచ్చి గౌరవించింది తెలుగు కథా రచయితల వేదిక.

- ఎస్.ఎన్. ఉమామహేశ్వరి