పఠనీయం

విలువైన చారిత్రక సమాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా వ్యాసపీఠం
చారిత్రక చలన చిత్ర వ్యాస సంపుటి
రచన:దేశిరాజు లక్ష్మీ నరసింహారావు
వెల:450/-
ప్రతులకు: రచయిత, 5-1-302, వీధి 10, కొత్త మారుతీనగర్ (వెస్ట్),
దిల్‌సుక్‌నగర్, హైదరాబాద్.
*
దేశిరాజు లక్ష్మీ నరసింహారావుగారు చరిత్ర విభాగంలో అధ్యాపకులుగా పనిచేశారు. అందువలన వారికి మంచి చారిత్రక జ్ఞానం ఉంది. ఆ తర్వాత చలన చిత్రాలపై పరిశోధన చేసి పట్టం పొందారు. కాబట్టి తెలుగు సినిమాలపై అవగాహన, విశే్లషణ ఉంది. తన పరిజ్ఞానాన్ని ఆయా సందర్భాలలో వ్యాసాల రూపంలో వివిధ పత్రికలలో ప్రచురించారు. ఆ తర్వాత వాటిని ఒక సంచలనంగా తీసుకొనిరావటం ముదావహం. చలనచిత్ర రంగంపై ఎస్.వి.రామారావు, ఇమంది రామారావు, కొంపల్లి గౌరీశంకర్, వాశిరాజు ప్రకాశం వంటి వారెందరో తమ తమ పరిశోధనలను గ్రంథ రూపంలో వెలువరించారు. శ్రీమతి పల్లవి ‘సావిత్రి’ జీవితంపై ఒక నవల అనదగ్గ గ్రంథాన్ని వెలువరించింది.
దేశిరాజు వారి విశే్లషణ ఈ రంగంలో తనదైన శైలిలో పరిచయాత్మకంగా ఉంది. సినీరంగ అభిమానులు ఆయా వ్యాసాలను చదువుకోవచ్చు. అందులో కన్నాంబ, ఎం.ఎస్.రామారావు వంటి ఆ తరం ప్రముఖులపై చాలా సంక్షిప్త వ్యాసాలాన్నాయి.
ఐతే ఈ గ్రంథాలలోని ప్రథమ భాగంలో రచయిత తన చారిత్రక జ్ఞానాన్ని విపులంగా ప్రదర్శించారు. నిజానికి ఈ చారిత్రక వ్యాసాలు విడిగా ఒక చిన్న పుస్తకంగా వేసి ఉండవలసింది. ఎందుకంటే ఇందలి విలువైన సమాచారం ఈ తరంవారికి బొత్తిగా అందనిది. చరిత్ర పరిశోధకులకు మాత్రమే తెలిసేది.
ప్రాచీన భారతదేశ చరిత్ర తెలుసుకోవటానికి మనకు మత్స్య, వాయు, భాగవత పురాణాలు కొంతవరకు తోడ్పడుతాయి. ఇంకా ఆయా కాలాలకు చెందిన నాణెములు శిల్ప కళాసంపద శాసనములు సమాచారాన్ని అందిస్తాయి. భారతదేశానికి అలగ్జాండరు కాలంనుండి కొందరు యాత్రికులువచ్చారు. వారు తాము చూచిన భారతదేశాన్ని గ్రంథస్థం చేశారు. అవి గ్రీకు- అరబ్బీ - ఇంగ్లీషు వంటి భాషలలో లభ్యమవుతున్నాయి. కొన్నింటికి అన్య భాషానువాదాలు కూడా లభిస్తున్నాయి. ఇవి చారిత్రక పరిశోధకులకు బంగారు గనులవంటివి.
మనకు ఫ్లూటార్క్, పాహియాన్, హ్యుయన్ సాంగ్ వంటి పేర్లు సుపరిచితమే. ఐతే మధ్యయుగాలలో వచ్చిన కొందరు ప్రముఖుల రచనలు ఈ తరంవారికి బొత్తిగా తెలియదు. మార్కోపోలో ప్రపంచ యాత్ర చేస్తూ ఇండియాకు వచ్చాడు. అప్పుడాయన కాకతీయ సామ్రాజ్యాన్ని దర్శించిన విషయం కొంతమందికి తెలుసు. ఇతని యాత్రా చరిత్ర ‘ట్రావెల్స్ ఆఫ్ మార్కోపోలో’ పేరిట ఆంగ్లంలో లభ్యం అవుతున్నది. ఇందులో 13వ శతాబ్దంనాటి ఆంధ్ర దేశ వైభవం కన్నులకు కట్టినట్లు కన్పడుతున్నది. ఇందలి అంశాలను శ్రీనాధుడు రచించిన క్రీడాభిరామంలోని ఓరుగల్లు వర్ణనతో తులనాత్మకంగా పరిశీలించుకోవచ్చు. దేశిరాజువారు మార్కోపోలో మీద ఒక పరిచయాత్మక వ్యాసం వ్రాశారు.
మార్కోపోలో 1254లో ఇటలీ దేశంలోని వెనిస్ నగరంలో జన్మించాడు. తన పినతండ్రితో కలిసి మొహల్ బాగ్దాద్ ఖొరాసా పామశ గోబీ ఎడారి తాంగుత, షాంగుల మీదుగా 1275లో శ్రీలంక మీదుగా చైనా వెళ్లి అక్కడి పాలకుడు కుబ్లెఖాన్‌ను సందర్శించాడు. అతడు తన రాయబారిగా ఇండియా వంటి కొన్ని దేశాలకు పంపాడు. ఆ విధంగా మార్కోపోలో అనంతర యాత్రలు కొనసాగాయి.
బర్మా, కారకోరం, కొచ్చిన్, ఇతర దక్షిణ భారత ప్రాంతాలు ఇతడు సందర్శించి వాటిని గ్రంథస్థం చేశాడు. ఇతడు జినోవాసులచే బంధింపబడి జైలులో ఉన్నపుడు తన యాత్రను భావాలను రాస్తూ సియానో అనే వ్యక్తికి వౌఖికంగా చెప్పాడు. ఈ విధంగా ఈ గ్రంథం అవతరించింది.
అంతకుముందే భారతదేశానికి మరికొందరు విదేశీయులు వచ్చారు. వారిలో అబుల్ రైహాన్ మహమ్మద్ ఇబ్న్ మహమూద్ అల్బెరూని. ఇతడు క్రీ.శ.10వ శతాబ్దం నాటివాడు. అంటే అపుడు కాంగి, చోళ సామ్రాజ్యాలు దక్షిణాపథంలో ఉన్నాయి. (ఆంధ్ర మహాభారత అవతరణ కాలం) అల్‌బెరూనీ చాలా అరుదైన సమాచారాన్ని మనకు అందించాడు. ఇతని రచనలు అరబ్బీ భాషలో ఉన్నాయి. వాటి ఆంగ్లానువాదాలు మనకు లభ్యమవుతున్నాయి.
గజనీ మహమ్మద్ దండయాత్రల మూలంగా భారతదేశం విధ్వంసమైంది. ఫలితంగా భారతీయ విద్వాంసులను శాస్త్ర గ్రంథాలను తీసుకొని సురక్షితమైన కాశ్మీరు వారణాసివంటి ప్రాంతాలకు వలస వెళ్లినట్లు అల్ బరూనీ పేర్కొన్నాడు.

- ఇంకాఉంది

- ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్