ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

పార్లమెంటును బలి చేస్తున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్లమెంటును బలి తీసుకుంటున్న రెండు సంఘటనలు రాజకీయ నాయకుల కనపడని అవినీతికి అద్దం పడుతున్నాయి. అవినీతికి సంబంధించిన ఆరోపణలను కోర్టులో తేల్చుకోవాలి కానీ ఇలా పార్లమెంటును స్తంభింపజేయటం రాజకీయ పార్టీలకు ఎంత మాత్రం తగదు. పార్టీ రాజకీయాలకు మరోసారి పార్లమెంటు సమావేశాలు బలికావడం దురదృష్టకరం. ఒకటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసు. రెండోది ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ముఖ్య కార్యదర్శి రాజేందర్ కుమార్ కార్యాలయం, ఇంటిపై సి.బి.ఐ సోదాలు చేయటం. దీనిసి నిరసనగా ఆం ఆద్మీ పార్టీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లిపై చేసిన ఆరోపణలు.
కేజ్రివాల్ ముఖ్యకార్యదర్శి రాజేందర్ కుమార్‌పై జరిగిన సి.బి.ఐ దాడుల వ్యవహారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లిపై ఆరోపణలకు దారి తీసింది. ఢిల్లీ క్రికెట్ సంఘానికి నాయకత్వం వహించిన సమయంలో జైట్లి అవినీతికి పాల్పడ్డాడంటూ ఆం ఆద్మీ పార్టీ ఆయనపై ఆరోపణల వర్షం కురిపించిది. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను దొడ్డి దారిన స్వాధీనం చేసుకుంటున్నారు, దీని కోసం కాంగ్రెస్‌కు ప్రజలు ఇచ్చిన దాదాపు తొంబై కోట్ల విరాళాలను దుర్వినియోగం చేశారన్నది మాజీ మంత్రి డాక్టర్ సుబ్రమణ్యం స్వామి ఆరోపణ. రాజకీయ పార్టీలకు ప్రజలు, వ్యాపార సంస్థలు ఇచ్చే విరాళాలకు ఆదాయం పన్నును చెల్లించవలసిన అవసరం లేదు. ఆదాయం పన్ను మినహాయింపు ఉన్నందుకే ఈ నిధులను పార్టీ కార్యకలాపాల కోసం మాత్రమే ఖర్చు చేయా లి తప్ప ఇతర పనులకు మళ్లించకూడదు. అయితే కాంగ్రెస్ పార్టీ తొంబై కోట్ల రూపాయలను నేషనల్ హెరాల్డ్‌కు రుణంగా ఇవ్వటం ద్వారా చట్టాన్ని ఉల్లంఘించిందని సుబ్రమణ్యం స్వామి ఆరోపిస్తున్నారు. దీనితో పాటు కేవలం ఐదు లక్షల మూల ధనంతో ప్రారంభమైన యంగ్ ఇండియాకు నేషనల్ హెరాల్డ్‌ను బదిలీ చేయటం ప్రధాన లక్ష్యం ఐదు వేల కోట్ల విలువ చేసే ఆస్తులను ఆక్రమించుకోవటమేనని సుబ్రమణ్యం స్వామి తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఉద్దేశ్యాలు, లక్ష్యాలు, నేషనల్ హెరాల్డ్ లక్ష్యా లు ఒకటిగా ఉన్నందుకే తొంభై కోట్ల రుణం ఇచ్చామన్నది కాంగ్రెస్ నాయకుల వాదన. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో ఏర్పాటు చేసిన యంగ్ ఇండియాకు నేషనల్ హెరాల్డ్‌ను బదిలీ చేయలేదు, పత్రికను పటిష్టం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని కాంగ్రె స్ నాయకులు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో ఎలాం టి అవినీతి లేదని చెబుతున్నప్పటికీ తెర వెనక ఎక్కడో ఏదో జరిగిపోతోందనే అనుమానం కలుగక మానదు. నేషనల్ హెరాల్డ్ కేసులో అంతా సవ్యంగా ఉన్నదని భావించేందుకు వీలు లేదు. తెర వెనక జరిగిపోతున్న అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చేందుకు ఏళ్లు పట్టటంతోపాటు కోర్టులోకూడా ఏమీ తేలదు. చివరకు దీనికి మసిపూసి మారేడు కాయ చేయటం ఖాయం. అయితే ఈ రాజకీయాల కోసం పార్లమెంటును ఎందుకు బలి తీసుకుంటున్నారనేది అసలు ప్రశ్న.
అరవింద్ కేజ్రావాల్ ముఖ్యకార్యదర్శి కేసు కూడా ఇలాంటిదే. అవినీతిని అంత మొందించేందుకే పుట్టిన అరవింద్ కేజ్రివాల్ తన ముఖ్య కార్యదర్శిపై సి.బి.ఐ దాడి చేయటాన్ని ఎందుకు ఖండిస్తున్నారు? రాజేందర్ కుమార్ కార్యాలయంపై సి.బి.ఐ దాడి చేయటం అంటే తన కార్యాలయంపై దాడి చేసినట్లేనన్నది ఆయన ఆరోపణ. నీతి, నిజాయితీకి తాను మారు పేరని చెప్పుకునే అరవింద్ కేజ్రివాల్ ఈ కేసును తనపై దాడికి ఎందుకు భావిస్తున్నారనేది అర్థం కావటం లేదు. రాజేందర్‌కుమార్‌పై వచ్చిన అవినీతి ఆరోణలపై విచారణ జరిపేందుకు అరవింద్ కేజ్రావాల్ స్వయంగా ముందుకు వస్తే బాగుండేది కానీ అలా జరగలేదు. ముఖ్య కార్యదర్శిపై సి.బి.ఐ చేసిన దాడిని తనపై జరిగిన దాడిగా భావిస్తున్న కేజ్రీవాల్ నేరుగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లిపై ఆరోపణల బాణాలు సంధించారు. నేషనల్ హెరాల్డ్ కేసు, రాజేందర్ కుమార్ కేసు, ఈ రెండు కేసుల్లో కాంగ్రెస్, ఆం ఆద్మీ పార్టీ వ్యవహరించిన తీరు గర్హనీయం. మా అవినీతిని బైట పెడితే మీ అవినీతిని బైట పెడతామనే విధంగా రాజకీయ పార్టీలు వ్యవహరించాయి. నేషనల్ హెరాల్డ్ కేసును అడ్డం పెట్టుకుని రాజకీయ కక్ష సాధిస్తున్నారు కాబట్టి పార్లమెంటును స్తంభింపజేయటం కాంగ్రెస్‌కు ఎంత మాత్రం న్యాయం కాదు.
సుబ్రమణ్యం స్వామి పెట్టిన కేసును సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితరులు కోర్టులో ఎదుర్కొవాలి, కోర్టు ద్వారా తమ నీతి, నిజాయితీని నిరూపించుకోవాలి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితరులకు బెయిల్ మంజూరు చేయటం ద్వారా పటియాలా కోర్టు న్యాయమూర్తి ఎంతో విజ్ఞతతో వ్యవహరించారని చెప్పకతప్పదు. ఇరువురు కాంగ్రెస్ అధినాయకుల అరెస్టుకు ఆదేశించి ఉంటే దేశంలో అనవసరంగా శాంతి,్భద్రతల వ్యవహారం తలెత్తేది. అరెస్టు వలన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ రాజకీయంగా బాగుపడేవారు తప్ప ప్రజలకు ఒరిగేదేదీ ఉండేది కాదు. ఇక రాజేందర్ కుమార్ అవినీతి కేసులో అరవింద్ కేజ్రివాల్ విజ్ఞతతో వ్యవహరించటం మంచిది. రాజేందర్ కుమార్ కోర్టు ద్వారా తమ నిజాయితీని నిరూపించుకునేలా కేజ్రీవాల్ చర్యలు తీసుకోవాలి. ప్రత్యర్థులపై దాడి చేసినప్పుడు సి.బి.ఐ మంచి సంస్థ, తమ వారిపై దాడి చేస్తే ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మ అనే దుర్నీతిని కేజ్రీవాల్ లాంటి వారు ఆచరించటం మంచిది కాదు. అరుణ్‌జైట్లి కూడా తనపై ఆం ఆద్మీ పార్టీ చేసిన ఆరోపణలపై కోర్టుకు వెళ్లాలి. కోర్టులో తన నిజాయితీని నిరూపించుకోవటం ద్వారా తప్పుడు ఆరోపణలు చేసిన ఆం ఆద్మీ పార్టీకి శిక్ష పడేలా చేయాలి.