రాష్ట్రీయం

మార్కెట్ యార్డుల అభివృద్ధికి రూ.26.98 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పౌరసరఫరాల శాఖమంత్రి పరిటాల సునీత

హైదరాబాద్, డిసెంబర్ 21: ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్‌లో 54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు ఉత్తర్వులు జారీ చేశామని పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత శాసనసభకు తెలిపారు.
రైతుల ధాన్యం మొత్తన్ని ప్రభుత్వ ఏజన్సీలు కొనుగోలుచేస్తాయన్నారు. కేంద్రప్రభుత్వం లెవీ విధానాన్ని రద్దు చేసిందన్నారు. రాష్ట్రంలో 1397 ధాన్యం సేకరణ కేంద్రాలను ప్రారంభించాలని ప్రతిపాదించామని, ఇంతవరకు 709 కేంద్రాలను ప్రారంభించామన్నారు. దాదాపు రూ.4350 కోట్లనిధులు అవసరమవుతాయన్నారు. ఈ నిదులను ఆర్‌బి నగదు పరపతి నుంచి భరిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రైవేట్, ప్రభుత్వ గోదాములతో కలిసి 40 లక్షల మెట్రిక్ టన్నులకు నిల్వ స్ధలం ఉందన్నారు. ఈ నెల 9వవ తేదీ వరకు 6,22,819 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. ఒక ఇంటి నంబర్‌తో రెండు రేషన్ కార్డుల నిబంధన ఏమీ లేదని మంత్రి పరిటాల సునీత శాసనసభకు తెలిపారు. నగరాల్లో ఒకే ఇంటి నంబర్ ఉన్న ఇంట్లో రెండు, లేదా మూడు కుటుంబాలు ఉంటే వారి రేషన్ కార్డులు తీసుకోవడానికి అర్హతలేదని ప్రభుత్వం చెప్పలేదన్నారు. ఒంటరి మహిళలు రేషన్ కార్డులు పొందడానికి అర్హులని ఆమె చెప్పారు.
ప్రతి అసెంబ్లీకి ఒక మార్కెట్ యార్డు
: మంత్రి పత్తిపాటి పుల్లారావు
ప్రతి అసెంబ్లీకి ఒక మార్కెట్ యార్డును ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారని వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు చెప్పారు. శాసనసభలో ఆయన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఆయన బదులిస్తూ, ఈ ఏడాది మార్కెట్ యార్డుల అభివృద్ధికి రూ.26.98 కోట్లు,గత ఏడాది రూ.39.32 కోట్ల నిధులు మంజూరు చేశామని చెప్పారు.