మహేష్‌తో పరిణీతి చోప్రా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం ‘బ్రహ్మోత్సవం’ సినిమా షూటింగ్‌లో బిజీగా వున్నాడు మహేష్‌బాబు. ఈ సినిమా తరువాత ఆయన నటించే చిత్రానికి దాదాపు అన్ని కార్యక్రమాలు పూర్తికావచ్చాయి. ప్రముఖ తమిళ దర్శకుడు మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. న్యాయవ్యవస్థపై పోరాటం అంశంగా తెరకెక్కుతున్న ఈ సినిమా తమిళ, తెలుగు భాషలతోపాటు హిందీలో కూడా రూపొందిస్తారట. మరోవైపు మహేష్ సరసన హీరోయిన్ ఎవరనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం బాలీవుడ్ భామ పరిణితి చోప్రాను హీరోయిన్‌గా తీసుకునేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. ఇప్పటికే ఆమెతో చర్చలు జరుపుతున్నారని తెలిసింది. పరిణితి చోప్రాకు బాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ వుంది. ఈ సినిమాతో సౌత్‌కు కూడా ఎంట్రీ ఇస్తోంది పరిణితి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయిన ఈ చిత్రం ఏప్రిల్ నుండి సెట్స్‌పైకి రానుంది. త్వరలోనే మిగతా వివరాలు వెల్లడి కానున్నాయి.