రుచి

బొప్పాయి పండు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొప్పాయి పండులో విలువైన పోషకాలతోపాటు ఆరోగ్యానికి అవసరమైన ఔషధాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. సౌందర్య సాధనాల తయారీలో దీన్ని వినియోగిస్తారు. బీటా కెరోటిన్, విటమిన్ ఎ,బి,సి,ఇ , ఖనిజ లవణాలు, ప్రొటీన్లు, పీచు పదార్ధాలు ఈ పండులో లభిస్తాయి. ఇందులోని పీచుపదార్ధం రక్తంలో కొలస్ట్రాల్ స్థాయిని తగ్గించి, గుండె సంబంధ వ్యాధులకు దివ్యౌషధంలా పని చేస్తుంది. బొప్పాయి ముక్కలపై కాస్త తేనె, పాలు కలిపి తింటే నరాల బలహీనత తగ్గుతుంది. ఇది జీర్ణశక్తిని పెంచుతూ, డయేరియాను నివారిస్తుంది. బొప్పాయి ముక్కలు తింటే నోటి పూత, పెదాలపై పగుళ్లు తగ్గుతాయి. మహిళల్లో రుతుచక్రాన్ని క్రమబద్ధం చేస్తుంది. బొప్పాయిలోని నల్లటి గింజలను తొలగించిన తరువాతే గుజ్జు తినాలి. ఈ గింజల్లోని హానికరమైన పదార్ధం వల్ల నాడీ వ్యవస్థలో ఇబ్బందులు తలెత్తుతాయి. బొప్పాయి గుజ్జును ముఖానికి తరచూ రాసుకుంటే మొటిమల బాధ నుంచి ఉపశమనం కలుగుతుంది. గుజ్జును శరీరానికి పట్టించి పావుగంట తర్వాత వేడినీటితో స్నానం చేస్తే చర్మానికి మంచి నిగారింపు వస్తుంది. సబ్బులు, క్రీముల తయారీలో దీన్ని వాడతారు. మెత్తటి బొప్పాయి గుజ్జును ఫేస్‌ప్యాక్‌లా వేసుకుంటే ముఖచర్మం కాంతులీనుతుంది.

- కెఎఆర్