తెలంగాణ

ప్రతి ఒక్కరికి ఇంటర్‌నెట్ శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసర, ఫిబ్రవరి 26: ప్రతి ఒక్కరికి ఇంటర్‌నెట్ వాడకంపై అవగాహన కోసం రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. శుక్రవారం బాసర గ్రామంలో డిజిటల్ అక్షరాస్యత, డిజిటల్ బాసర కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ధ్రువ పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ప్రతి ఒక్కరికీ ఇంటర్‌నెట్ వాడకంపై గ్రామస్థాయి నుండి పట్టణాల వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ సంస్థ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలోని బాసర గ్రామాన్ని ఎంచుకోవడం అదృష్టమని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క శాఖకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ సమాచారం, ఇతరత్రా వాటిని మొబైల్ ద్వారా అందించేందుకు కృషిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఇంటర్‌నెట్ వాడకంపై విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ట్రిపుల్ ఐటి యూనివర్సిటీలో నెలలో నాలుగు రోజులు విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులకు సైతం ఇంటర్‌నెట్ వాడకంపై ఉచితంగా శిక్షణ అందిస్తామని ట్రిపుల్ ఐటి వైస్ చాన్స్‌లర్ సత్యనారాయణ పేర్కొన్నారు.