క్రీడాభూమి

పోటీలు లేకుంటే కష్టమే: మేరీ కోమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షిల్లాంగ్, ఫిబ్రవరి 15: వివిధ స్థాయిల్లో పోటీలు లేకపోతే బాక్సర్ల భవిష్యత్తు చాలా కష్టతరంగా మారుతుందని భారత బాక్సింగ్ స్టార్ మేరీ కోమ్ వ్యాఖ్యానించింది. బాక్సింగ్ ఇండియా (బిఐ)పై అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఎఐబిఎ) గత ఏడాది నిషేధం విధించిన తర్వాత మన దశంలో బాక్సింగ్ కార్యకలాపాలు అడ్‌హాక్ కమిటీ పర్యవేక్షణలో జరుగుతున్నాయి. పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మేరీ కోమ్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, ప్రస్తుతం ఏ స్థాయిలోనూ పోటీలు జరగడం లేదని చెప్పింది. జాతీయ చాంపియన్‌షిప్స్‌ను కూడా నిర్వహించకపోతే బాక్సర్ల పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. కొత్తగా బాక్సింగ్‌లోకి అడుగుపెట్టాలనుకునే వారు వెనుకంజ వేస్తారని, ఫలితంగా భవిష్యత్తులో ఎక్కువ మంది బాక్సర్లను చూడలేమని ఆందోళన వ్యక్తం చేసింది. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ బాక్సింగ్ క్రీడకు మన దేశంలో తెరపడుతుందనే వాదనలో అర్థం లేదని చెప్పింది. అయితే, ప్రస్తుత పరిస్థితుల వల్ల కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చని పేర్కొంది. బాక్సింగ్ సమాఖ్య సక్రమంగా ఉన్నప్పుడే బాక్సర్లు ఎక్కువ ఉత్సాహంతో పోటీలపై దృష్టి కేంద్రీకరిస్తారని అన్నాడు. సీనియర్లకు దక్షిణ ఆసియా చాంపియన్‌షిప్స్, ఒలింపిక్ క్వాలిఫయింగ్ వంటి పోటీలు ఉన్నాయని, అవికూడా లేకపోతే ప్రాక్టీస్ మొత్తం టైమ్‌పాస్ వ్యవహారంగా మారేదని వ్యాఖ్యానించింది. ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ ద్వారా కోచ్ చోటే లాల్ యాదవ్, ఫిజియోథెరపిస్టు పూర్ణిమా రామన్ గోందిర్, స్పోర్ట్స్ సైన్స్ నిపుణుడు నిఖల్ లతే తదితరులు తనకు ఆయా అంశాల్లో సహకరిస్తున్నారని మేరీ కోమ్ చెప్పింది. వీరి కృషి ఫలితంగా రియో ఒలింపిక్స్‌లో తాను రాణించగలుగుతానని ధీమా వ్యక్తం చేసింది. అయితే, బాక్సింగ్ వంటి పోటీల్లో గెలుపుపై ఎవరూ ఊహాగానాలు చేయలేరని అన్నది. రియో ఒలింపిక్స్ తనకు కెరీర్‌లో చివరి పోటీలని, ఆతర్వాత తాను అంతర్జాతీయ బాక్సింగ్ నుంచి రిటైఅవుతానని గతంలో ప్రకటించిన మేరీ కోమ్ ఇప్పుడు అదే విషయంపై అడిగిన ప్రశ్నకు సమాధాన్ని దాటవేసింది. ఒలింపిక్స్ ముగిసిన తర్వాతే తాను నిర్ణయం తీసుకుంటానని చెప్పింది. ఇప్పటి నుంచే రిటైర్మెంట్ గురించి చెప్పలేనని అన్నది. పరిస్థితులు సహకరించి, పోటీల్లో కొత్తగా మరికొన్ని విభాగాలను చేరిస్తే, 2020 ఒలింపిక్స్‌లో పాల్గొనే విషయాన్ని ఆలోచిస్తానని మేరీ కోమ్ తెలిపింది.