AADIVAVRAM - Others

వంద విలువ ఎంత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెండితో చేయబడిన కొంత విలువ గల ద్రవ్యమునకు సంస్కృత భాషలో రూప్యమని పేరు. ఇదే హిందీలో రుపయాగా, ఇంగ్లీషులో రుపీగా, తెలుగులో రూపాయిగా మారింది. చంద్రగుప్త వౌర్యుడు (క్రీ.పూ.340-290) కాలంలో అప్పుడు చెలామణీలో ఉన్న నాణేన్ని రూప్యారుపా అని పిలిచేవారు. అది 11.53 గ్రాముల బరువుండేది. కానీ ఆకృతిలో అంత అందంగా ఉండేది కాదు. షెర్షాసూరి కాలంలో (1540-1545) మొదటగా ఫ్రెంచి ఈస్ట్ ఇండియా కంపెనీ వారు రూపాయి నాణేన్ని ముద్రించారు. అసలు సిసలైన వెండి రూపాయి విక్టోరియా మహారాణి కాలంలో చెలామణీలోకి వచ్చింది. అది 11 గ్రాముల చిల్లర బరువుండేది. తులం అనేవారు. దాన్ని ముఖ్యంగా వెండి, కొద్దిగా బంగారం కూడ కలిపిన మిశ్రమంతో తయారుచేసేవారు. వాడుకలో వెండి రూపాయి అనే అనేవారు. గుండ్రంగా, మందంగా, హుందాగా, ఇప్పటి రూపాయి కంటే పెద్దదిగా ఉండేది. ఒకవైపు విక్టోరియా మహారాణి బొమ్మ, రెండవ వైపు అక్షరాలలో గశ్రీ-ఉఉ అనీ, సంవత్సరం వ్రాసి ఉండేవి. ఇవి టంకశాలలో తయారయ్యేవి. కుడిచేయి ముడిచి, రూపాయిని చూపుడు వేలుపై ఉంచి, బొటన వేలితో ఎగరేస్తే ఎంత సొంపుగా ఉండేది. ఖంగుమని శబ్దం కాసేపు వినవచ్చేది. అది ఎంతో ఇంపుగానూ, శ్రావ్యంగానూ ఉండేది. పెద్దల నెవరినైనా సన్మానం చేయవలసి వచ్చినపుడు తాంబూలంలో నాలుగు రూపాయలు (వరహా) గాని, స్తోమత ఉంటే 13 రూపాయలు కానీ ఇచ్చేవారు. ఆ రోజులలో బంగారం నవర్సు ధర 13 రూపాయలు. అదే ధర ఎంతోకాలం స్థిరంగా ఉంది. మనకు స్వాతంత్య్రం వచ్చిన తరువాతే బంగారానికి రేటు పెరిగింది. ఎడ్వర్డ్ నినిని, కింగ్ జార్జ్ కాలంలో కూడా రూపాయిలో మార్పు లేదు. కానీ కింగ్ జార్జ్ ని కాలంలో కంచుతో రూపాయిలు ముద్రించటం మొదలుపెట్టారు. ఎగరేసినప్పుడు శబ్దంలో మార్పు తప్ప హుందా ఏం తగ్గలేదు. క్రమేపీ నికెల్, ఇనుము, క్రోమియం మిశ్రమంతోనూ, నికెల్‌తోనూ కూడ తయారుచేయడం మొదలుపెట్టారు. సైజు కూడా చిన్నదై పోయింది. దీన్ని ఎగురవేసినప్పుడు ‘డబ్’ అనే శబ్దం మాత్రమే వచ్చేది. బ్రిటీష్ వారి కాలంలో రూపాయి కాక చిల్లర నాణెలు అర్ధ రూపాయి, పావలా, బేడా, అణా, అర్ధణా, కానీ, అరగానీ, దమ్మిడీలు ఉండేవి. దమ్మిడీ అంటే రూపాయిలో 192వ వంతు. 20వ శతాబ్దం మొదటి దశాబ్దంలో దమ్మిడీ తీసుకొని వెళ్లి మార్కెట్లో ఒక కూర, కప్పు పెరుగు, కొత్తిమీర కట్ట తెచ్చుకునేవారట. ఏగాని అంటే రెండు దమ్మిడీలని అర్థం. అరగాని కూడా వుండేది. దీన్ని దుగ్గాని అంటారు. దమ్మిడీకి రెండు ఠోలీలు కూడ ఉండేవిట.

-ప్రయాగ కృష్ణమూర్తి